ఈ సంక్రాంతికి.. ఈ టాలీవుడ్ చిత్రాలు చాలా స్పెషల్

ఈ సంక్రాంతికి.. ఈ టాలీవుడ్ చిత్రాలు చాలా స్పెషల్

తెలుగు చిత్రపరిశ్రమకి సంబంధించి సంక్రాంతి (Sankranthi) సీజన్ అంటే సినిమాలకి వసూళ్ళ పరంగా ఒక మంచి సమయంగా భావిస్తారు. అలాగే సినీ ప్రేక్షకులు కూడా సంక్రాంతి సీజన్‌లో విడుదలయ్యే భారీ చిత్రాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే 2018 సంక్రాంతి సీజన్‌లో విడుదలైన పవన్ కళ్యాణ్ "అజ్ఞాతవాసి", బాలకృష్ణ "జై సింహ" చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఇటు ప్రేక్షకులతో పాటు అటు టాలీవుడ్ చిత్రపరిశ్రమ కూడా తీవ్ర నిరాశకి గురికావడం జరిగింది.ఇక ఈ సంవత్సరం సంక్రాంతి విషయానికి వస్తే, ఎప్పటిలాగే భారీ చిత్రాలు ప్రేక్షకులని అలరించడానికి విడుదలకి సిద్ధమవుతున్నాయి. పైగా ఈ సినిమాలు అన్ని కూడా పెద్ద హీరోలవి కావడం విశేషం. ఇంతకీ ఈ జాబితాలో ఉన్న మొదటి హీరో ఎవరంటే నందమూరి బాలకృష్ణ. ఆయన తన తండ్రి జీవితాన్ని ఆధారంగా చేసుకొని నిర్మించిన సినిమా ఎన్టీఆర్ "కథానాయకుడు". స్వర్గీయ ఎన్టీఆర్ జీవితాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా మొదటి భాగాన్ని సంక్రాంతికి విడుదలచేయనున్నారు. 2019లో ఈ సినిమాతో తెలుగు సినిమాల ప్రస్థానం మొదలు కానుంది. 


NTR-Biopic-2


ఈ జాబితాలో ఉన్న రెండవ చిత్రం పెట్టా (Petta). సూపర్ స్టార్ రజినీకాంత్.. రోబో 2.0 చిత్రం వంటి భారీ విజయాన్ని అందుకున్న తరువాత వస్తున్న ఈ చిత్రం పైన అందరికి అంచనాలు మెండుగానే ఉన్నాయి. రజిని పక్కన సిమ్రాన్ & త్రిష నటించగా నవాజుద్దీన్ సిద్ధిఖీ  & విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రం తెలుగులోకి డబ్బింగ్ చిత్రంగానే వస్తున్నప్పటికి, సూపర్ స్టార్ రజినీకాంత్‌కి మన దగ్గర ఉన్న ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకుంటే ఇది కూడా వేరే చిత్రాలకి ఓపెనింగ్స్ పరంగా ఒక ఛాలెంజ్‌ని విసరగలిగేదే అని చెప్పవచ్చు.


Rajinikanth-Petta-1


ఈ సీజన్‌లో విడుదలవుతున్న మూడవ చిత్రం వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న ఈ చిత్రం పండగ పూట ఒక మంచి కమర్షియల్ చిత్రంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌‌ను బట్టి చూస్తే.. రామ్ చరణ్‌ని ఒక పక్కా మాస్ హీరో‌గా ఆవిష్కరించినట్టుగా మనకి అర్ధమవుతుంది. బోయపాటి శ్రీను తనదైన ట్రేడ్ మార్క్‌ని ఈ చిత్రంలో కూడా మిస్ అవ్వలేదని తెలుస్తోంది. కియారా అద్వానీ ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన నటించింది. 


vinaya-vidheya-rama


ఇక సంక్రాంతి రోజున అంటే జనవరి 14న విడుదలవుతున్న చిత్రం F2 (Fun & Frustration). ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ & వరుణ్ తేజ్  హీరోలుగా నటిస్తుండగా వారి సరసన తమన్నా & మెహ్రీ‌న్‌లు నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే.. పండగ పూట కుటుంబసమేతంగా వెళ్లి చూడదగ్గ చిత్రంలాగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజు కూడా మాట్లాడుతూ - దర్శకుడు అనిల్ రావిపూడి.. ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులు నచ్చి మెచ్చేలా F2 చిత్రాన్ని తీసినట్లు తెలిపారు. ఈ సంక్రాంతికి ఒక చక్కటి వినోదాన్ని పంచే చిత్రంగా ఇది ఉంటుంది అని ఆయన హామీ ఇస్తున్నారు.


F2-movie-poster


2019 సంవత్సరంలో ఈ చిత్రాలు ముందుగా ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. గత సంక్రాంతిలా కాకుండా ఈ యేడు మంచి ఫలితాలు రావాలని కోరుకుందాం. మరి ఈ చిత్రాలు ప్రేక్షకుల మనసులని ఎంతవరకు గెలుచుకుని 2019ని తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక మంచి ప్రారంభాన్ని ఇస్తాయా లేదా అనేది వేచి చూడాలి.


ఇవి కూడా చదవండి


2018 తెలుగు సినిమా ప్రోగ్రస్ రిపోర్ట్ ఇదే..!


2018లో ఈ తెలుగు సినిమాలు ఎందుకు ప్రత్యేకమో తెలుసా..?


2018 మెగా హిట్ చిత్రం "రంగస్థలం".. దర్శకుడిదే క్రెడిట్..!