ప్ర‌త్యేక గీతంతో హీట్ పుట్టిస్తున్న పాయల్ రాజ్ పుత్..!

ప్ర‌త్యేక గీతంతో  హీట్ పుట్టిస్తున్న పాయల్ రాజ్ పుత్..!

RX 100 సినిమాతో పిల్లా రా.. అంటూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది పాయల్ రాజ్ పుత్(Payal Rajput) . తన అందంతోనే కాకుండా అభినయంతోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకొంది. తొలి చిత్రంతోనే కుర్రకారు మనసులో చెరిగిపోని ముద్ర వేసుకొంది. ఇప్పుడు ఈ భామ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సీత సినిమాలో ప్రత్యేక గీతంతో సందడి చేయనుంది. ‘బుల్లెట్ మీద వచ్చే బుల్ రెడ్డి రాజ్ దూత్ మీదొచ్చే రాం రెడ్డి’ అంటూ స్టెప్పులు ఇర‌గ‌దీస్తోంది. పాయ‌ల్ న‌టించిన‌ మొదటి సినిమాలో ఆమె డ్యాన్స్ పూర్తి స్థాయిలో చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కలేదు. కానీ ఈ పాటతో ఆ లోటు తీరనుంది.

సీత సినిమాలో పాయల్ నర్తించిన ప్రత్యేక గీతానికి సంబంధించిన స్టిల్ విడుదల చేసినప్పుడే అందరిలోనూ ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ పాటకు సంబంధించిన వీడియోను ఈ రోజు విడుదల చేశారు. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ఇది వైరల్ గా మారింది. వాస్తవానికి ఇది లిరికల్ కమ్ మేకింగ్ వీడియో అని చెప్పాలి. ఇందులో పాయల్ వేస్తున్న స్టెప్పులు చూస్తుంటే.. తెరపై అదరహో అనిపించేలానే ఉన్న‌ట్ల‌నిపిస్తోంది.


సినిమా టీం సైతం ఈ పాట గురించి ప్రత్యేకంగా చెబుతోంది. బుల్ రెడ్డి పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని వారు చెబుతున్నారు. ఈ సాంగ్ లో పాయల్ రాజ్ పుత్ సైతం హాట్ హాట్ గా కనిపిస్తోంది. RX100 సినిమాలో ఆమె కొన్ని స్టెప్పులు వేసినప్పటికీ వాటి ప్రభావం చాలా తక్కువ. బుల్ రెడ్డి పాటతో ఇప్పుడు ఆమె డ్యాన్స్ స్టామినా గురించి సైతం తెలుగు ప్రేక్షకులకు తెలియనుంది. 

తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, కాజల్ హీరోయిన్ గా  కనువిందు చేయనున్నారు. మరో హీరోయిన్ గా మన్నారా చోప్రా నటిస్తోంది. సోనూ సూద్, తనికెళ్ల భరణి ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు వైవిధ్యంగా ఉందనే టాక్ సంపాదించుకుంది. ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తోన్న ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.


బుల్ రెడ్డి ప్రత్యేక గీతాన్ని మీరూ ఇక్కడ వీక్షించండి.

Subscribe to POPxoTV

ఇవి కూడా చదవండి:


మన్మథుడు కుటుంబంతో సహా వచ్చేశాడు.. ఈయన కుటుంబం పెద్దదే సుమా...!


పోస్ట‌ర్ల‌తోనే ఆసక్తి రేపుతోన్న బ్రోచేవారెవరురా సినిమా టీం..! ఆ పోస్టర్లను మీరూ చూడండి..


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో కథనాలు చదవచ్చు.


అద్భుత‌మైన వార్త‌.. ఇప్పుడు POPxo షాప్ ఓపెన్ అయింది. చ‌క్క‌టి మ‌గ్స్, ఫోన్ క‌వ‌ర్స్‌, కుష‌న్స్‌, లాప్‌టాప్‌స్లీవ్స్ ఇంకా మ‌రెన్నో ఇక్క‌డ 25 శాతం డిస్కౌంట్‌తోనే ల‌భిస్తున్నాయి. POPXOFIRST అనే కూప‌న్ కోడ్‌ని ఉప‌యోగించండి. దీంతో మ‌హిళ‌ల‌కు ఆన్‌లైన్ షాపింగ్ ఎంతో సులువైపోతుంది.