ADVERTISEMENT
home / Bollywood
ఈ ఆస్కార్ .. భారతీయ మహిళలకే అంకితం.. ఎందుకంటే..?

ఈ ఆస్కార్ .. భారతీయ మహిళలకే అంకితం.. ఎందుకంటే..?

మన దేశంలో బహిష్టు (period) సమయంలో మహిళలు ఎన్నో ఆంక్షలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ సమయంలో వారు ఇంట్లోకి రాకూడదు. దేన్నీ తాకకూడదు. ఎవరినీ ముట్టుకోకూడదు. అంతేనా.. చాలామంది మహిళల‌కు ఆ సమయంలో సరైన న్యాప్కిన్స్ కూడా అందుబాటులో ఉండవు. కొందరు దీని కోసం కాటన్ వస్త్రాలు వాడితే.. మరికొందరు వస్త్రంతో తయారు చేసిన సంచిలో ఇసుక నింపి దాన్ని న్యాప్కిన్‌గా వాడుతున్నారు. దీనివల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటోంది. వివిధ రకాల ఇన్ఫక్షన్లకు గురవుతున్నారు.

ఇలా గ్రామీణ ప్రాంతాల్లో నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలపై చిత్రీకరించిన షార్ట్  ఫిలిం పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్ (Period: End Of Sentence). ఈ భారతీయ చిత్రానికి అపురూపమైన గౌరవం దక్కింది. శానిటరీ న్యాప్కిన్ అంటే ఏంటో తెలియని వారు, నెలసరి గురించి, వాటి సమస్యల గురించి మాట్లాడాలంటే జంకే మహిళలు.. శానిటరీ న్యాప్కిన్లతోనే తమ సాధికారతకు ఎలా బాటలు వేసుకొన్నారో అద్భుతంగా చూపించిన ఈ లఘుచిత్రానికి బెస్ట్ షార్ట్ డాక్యుమెంటరీగా ఆస్కార్ అవార్డ్(Oscar Award) దక్కింది.

1-period-end-of-sentance

భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొనే రుతుక్రమ సంబంధమైన సమస్యలే నేపథ్యంగా దీన్ని రూపొందించారు. హాపూర్ జిల్లాలోని కాథికేరా గ్రామంలో దీన్ని షూట్ చేశారు. ఈ సినిమాకు గునీత్ మోంగా నిర్మాతగా వ్యవహరించారు. ఈమె మసాన్, లంచ్ బాక్స్ వంటి వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన వారిలో ఒకరు. కాగా పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్‌కు  25 ఏళ్ల ఇరానియన్ అమెరికన్ డైరెక్టర్ ర్యాకా జెటాబ్చీ దర్శకత్వం వహించారు. సుమారుగా 26 నిమిషాల వ్యవధి ఉన్న ఈ షార్ట్  ఫిల్మ్ గ్రామీణ భారత మహిళల సమస్యలను ఎత్తి చూపించింది.

ADVERTISEMENT

ఈ లఘుచిత్రం కథ స్థూలంగా..

కాథికేరా గ్రామంలోని మహిళలకు శానిటరీ న్యాప్కిన్ అంటే ఏంటో తెలీదు. దాని వినియోగం గురించి సరైన అవగాహన లేదు. ఆ సమయంలో శుభ్రమైన బట్ట వాడకపోవడం వల్ల వారు అనారోగ్యం బారిన పడుతున్నారు. తాము ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన ఇబ్బంది గురించి ఇతరులతో కూడా చెప్పుకోలేరు. చాలామంది అమ్మాయిలు చదువు పట్ల ఆసక్తి ఉన్నా.. న్యాప్కిన్లు అందుబాటులో లేకపోవడం వల్ల పాఠశాలకు వెళ్లడం మానేస్తున్నారు. 

ఆ ఊరిలోని పురుషులు సైతం తమ ఇంట్లోని మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన ఇబ్బందుల గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. కనీసం వారికి పీరియడ్స్ అంటే అవగాహన కూడా ఉండదు. అయితే యాక్షన్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ ఆ ఊరిలో అడుగుపెట్టడంతో ఈ పరిస్థితి క్రమంగా మారుతుంది. ఈ సంస్థ ఆ గ్రామ మహిళల కోసం శానిటరీ న్యాప్కిన్ వెండింగ్ మెషిన్ ఏర్పాటు చేస్తుంది. దాంతో క్రమంగా అక్కడి మహిళలు పీరియడ్స్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెడతారు. అంతేనా.. సాధికారత దిశగా అడుగులు సైతం వేస్తారు. తామే స్వయంగా శానిటరీ న్యాప్కిన్స్ తయారుచేయడం మొదలుపెడతారు. దానికి fly అని పేరు పెడతారు. ఇది వారి సాధికారతకు సూచన.

ఆ అమ్మాయిలకొచ్చిన ఆలోచన ఇది..

ADVERTISEMENT

మీకో విషయం తెలుసా? ? ఓక్ వుడ్ స్కూల్లో చదువుతోన్న 12-14 ఏళ్ల వయసున్న కొంతమంది అమ్మాయిలకు వచ్చిన ఆలోచన ఇది. వారు ఈ చిత్ర నిర్మాణం కోసం క్రౌడ్ ఫండింగ్ కూడా చేశారు. వారిలో ఒకరి తల్లి గునీత్ మోంగాను సంప్రదించడంతో ఈ షార్ట్ ఫిలిం పూర్తి స్థాయిలో రూపొందింది. ఈ విషయాన్ని ఆస్కార్ అవార్డ్ స్వీకరించిన అనంతరం నిర్మాత గునీత్ మోంగా ఓ పత్రికకు వివరించారు. ఏడేళ్ల క్రితం ప్యాడ్ మెషీన్ కోసం డబ్బులు సేకరించడం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే ప్రజల్లో అవగాహన కల్పించేలా దీన్ని చిత్రీకరించాలని భావించారు. ఆ తర్వాత ఈ టీంకు యాక్షన్ ఇండియా సంస్థ కూడా తోడవడంతో.. అక్కడి మహిళల జీవన పరిస్థితిలో అద్భుతమైన మార్పు వచ్చింది.

‘ఈ కన్నీటికి కారణం అది కాదు’ – దర్శకురాలు ర్యాకా

తమ సమస్యల గురించి చెప్పుకోలేని మహిళలు సాధికారత దిశగా ఎలా అడుగులు వేశారో చూపించిన ఈ షార్ట్ ఫిలింకు బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డ్ వచ్చింది. ఈ అవార్డును స్వీకరించిన తర్వాత దర్శకురాలు ర్యాకా జెటాబ్చీ మాట్లాడుతూ ‘ఇప్పుడు నేను కన్నీరు పెట్టుకొంటున్నది నా పీరియడ్స్ వల్లనో.. మరో కారణం చేతో కాదు.. రుతుక్రమం గురించి తీసిన ఓ చిత్రం ఆస్కార్ అందుకొందంటే ఇప్పటికీ నాకు నమ్మశ‌క్యంగా అనిపించ‌డం లేదు.’ అని పేర్కొన్నారు.

ఎందుకంటే.. ఎండ్ గేమ్, బ్లాక్ షీప్, లైఫ్ బోట్, ఎ నైట్ ఎట్ గార్డెన్ వంటి లఘు చిత్రాలతో ఇది పోటీ పడాల్సి వచ్చింది. ఆస్కార్ జ్యూరీలో ఓ సభ్యుడు.. ఈ డాక్యుమెంటరీకి ఓటు వేయడానికి తిరస్కరించారు. బహుశా అందుకు వారి మేల్ ఇగో అడ్డొచ్చినట్టుంది. అయినా చివరికి పీరియడ్స్ విజయాన్ని అందుకొంది.

ADVERTISEMENT

ఆస్కార్ సాధించిన తమ విజయాన్ని ఈ భూమ్మీద ఉన్న ప్రతి అమ్మాయికీ పంచాలన్న ఉద్దేశంతో ప్రొడ్యూసర్ గునీత్ మోంగా.. బ్యూటీఫుల్ ట్వీట్ చేస్తే.. దర్శకురాలు ర్యాకా ఈ విజయాన్ని ప్రపంచంలో ఉన్న టీచర్లు, విద్యార్థినులతో పంచుకొన్నారు. అంతేకాదు.. పీరియడ్స్ ఆడపిల్లల చదువుకి ఆటంకం కాకూడదని ఆకాంక్షించారు.

Image: Instagram ,ABC

ఇవి కూడా చ‌ద‌వండి

ఈ న్యాయవాది.. మనదేశంలోనే కులం, మతం లేని మొదటి వ్యక్తి

ADVERTISEMENT

అంగ వైకల్యాన్ని “బయోనిక్ ఆర్మ్స్”తో జయించింది… ఆదర్శంగా నిలిచింది..!

కూతురిపై ప్రేమ‌తో.. అమ్మ ఎక్కువ‌గా అడిగే ప్ర‌శ్న‌లు, ఇచ్చే సూచ‌న‌లు ఇవే..!

24 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT