#POPxoTurns5: 2018లో మా టాప్ 5 క్ష‌ణాల‌ను మీతో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుంటున్నాం.

#POPxoTurns5: 2018లో మా టాప్ 5 క్ష‌ణాల‌ను మీతో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుంటున్నాం.

POPxo ప్ర‌స్తుతం మ‌న దేశంలో ఎంతోమందికి ఫేవ‌రెట్‌గా మారిపోయిన వెబ్‌సైట్‌.. కేవ‌లం ఇంగ్లిష్‌, హిందీ మాత్ర‌మే కాదు.. మ‌రో నాలుగు భాష‌ల్లోనూ త‌న కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తూ అన్ని భాష‌ల వారి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. POPxo ప్రారంభించి ఐదేళ్లు పూర్త‌వుతోంది. మా పాఠ‌కుల ఆద‌రాభిమానాలే ఈ ఐదేళ్లు మ‌మ్మ‌ల్ని ముందుకు న‌డిపించాయి. ఈ ఐదేళ్లు అన్ని భాష‌ల బృందాలు ఒక కుటుంబంగా క‌లిసి పనిచేయ‌డం వ‌ల్లే ఈ స్థాయికి చేర‌గ‌లిగాం. POPxoలో పెద్ద‌వే కాదు.. చిన్న చిన్న మైలురాళ్ల‌ను కూడా ఎంతో ఆనందంగా సెల‌బ్రేట్ చేసుకోవ‌డం మాకు అల‌వాటు. కొలీగ్స్ ఆఫీస్‌లో చేరిన రోజును కూడా వారి పుట్టిన‌రోజులాగే గుర్తుంచుకొని వేడుక‌లు జ‌రుపుకోవ‌డం మాకు అల‌వాటు.


2014లో దిల్లీలోని హౌజ్ కాజ్ విలేజ్‌లో ఐదుగురు స‌భ్యుల‌తో ప్రారంభ‌మైంది POPxo. ఈ ఐదేళ్ల‌లో మా పాఠ‌కుల ఆద‌రాభిమానాల‌తో ఎంతో అభివృద్ధి సాధించాం. ప్ర‌స్తుతం POPxo బృందంలో 180 మంది స‌భ్యులు అటు గురుగ్రామ్‌, ఇటు ముంబై ఆఫీసుల్లో ప‌నిచేస్తున్నారు. ఈ ఐదో పుట్టిన రోజు సంద‌ర్భంగా 2018లో మేం సాధించిన విజ‌యాల‌ను మా పాఠ‌కుల‌తో పంచుకోవ‌డానికి ఎంతో సంతోషిస్తున్నాం. మా క‌థ‌నాలు, వీడియోలు, సోష‌ల్ మీడియా పోస్టులు, ఇప్ప‌టివ‌ర‌కూ మేం చేరుకున్న మైలురాళ్లు, భ‌విష్య‌త్తులో మేం మీకు అందించ‌బోతున్న స‌ర్‌ప్రైజ్‌లు అన్నింటి గురించి మీతో పంచుకోవ‌డానికి ఎంతో సంతోషిస్తున్నాం.


2018లో ఎక్కువ మంది చ‌దివిన క‌థ‌నాలు


1. Shame, Shame, Shame! Kasautii Zindagii Kay Delivers The Most Sexist Episode Of This Season


స్టార్ ప్ల‌స్‌లో ప్ర‌సార‌మ‌య్యే క‌సౌటీ జింద‌గీ కీ 2 సీరియ‌ల్ దేశ‌మంత‌టా మంచి పాపులారిటీ సంపాదించిన సంగ‌తి తెలిసిందే. ఆ సీరియ‌ల్ గురించి మేం రాసిన ఈ క‌థ‌నం కూడా అంతే పాపులారిటీ సంపాదించింది. ఎందుకు అనుకుంటున్నారా? ప‌్రైమ్ టైమ్‌లో ప్ర‌సార‌మయ్యే ఈ డైలీ శృంగారభ‌రితంగా, కుటుంబంతో చూసేందుకు ఇబ్బందిక‌రంగా ఉంద‌ని మేం రాయ‌డ‌మే దీనికి కార‌ణం.


2. #DeepVeerKiShaadi: EVERYTHING You Need To Know About Deepika's Bridal Looks!


గ‌తేడాది భార‌త‌దేశాన్ని మొత్తం ఆక‌ర్షించిన వివాహం దీప్‌వీర్‌ల పెళ్లి. ఈ పెళ్లిలో దీపిక ధ‌రించిన దుస్తుల గురించి స‌బ్య‌సాచి డిజైన్ చేసిన విధానం గురించి మేం రాసిన క‌థ‌నం వైర‌ల్‌గా మారింది. దీపిక దుప‌ట్టాపై రాసి ఉన్న మాట‌ల గురించి కూడా ఇందులో పొందుప‌ర్చ‌డం వ‌ల్ల.. దీన్ని చాలామంది చ‌దివేందుకు ఆస‌క్తి చూపించార‌ట‌.


3. Dear Bride, 13 Super Cool Things Sonam Kapoor Did At Her Wedding That You Should Too!


ఈ సంవ‌త్స‌రం బాలీవుడ్ బ్యూటీ సోన‌మ్ పెళ్లితో ప్రారంభ‌మైంది. #SonamKiShaadi అంటూ ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ మొత్తం నిండిపోయింది. ఒక అద్బుత‌మైన బాలీవుడ్ చిత్రంలా కొన‌సాగిన ఈ వివాహం సంద‌ర్భంగా సోన‌మ్ గురించి పలు ఆసక్తికరమైన విష‌యాల‌ను అందిస్తూ.. త‌న నుంచి మ‌న పెళ్లి కూతుళ్లు నేర్చుకోవాల్సిన అంశాలను చెప్పిన ఈ క‌థ‌నం కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది.


4. #WomensDay: 84 Ways To Remind Yourself That You Are BEAUTIFUL!


వుమెన్స్ డే అనగానే అంద‌రికీ ఒక‌టే రోజు వ‌స్తుంది. కానీ POPxoలో మాత్రం రోజూ వుమెన్స్ డేనే జ‌రుపుకుంటాం. ఎందుకంటే ప్ర‌తిరోజూ దేశంలోని ప్ర‌తి అమ్మాయికి న‌చ్చే క‌థ‌నాల‌ను అందిస్తూ వారి శ్రేయ‌స్సును కోరుకుంటాం. అందుకే గ‌తేడాది వుమెన్స్ డే సంద‌ర్భంగా బాహ్య సౌందర్యం కన్నా.. ఆత్మ సౌందర్యం మిన్న అని చెబుతూ.. ఈ విషయాన్ని ప్ర‌తి అమ్మాయి గుర్తుంచుకోవాల‌ని ఓ క‌థ‌నాన్ని అందించాం. అది చాలా పాపుల‌రైంది.


5. Dear 'The Cut', Did You Really Just Call Nick Priyanka's 'Forever Bitch'?


ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్‌ల వివాహం త‌ర్వాత ద క‌ట్ మ్యాగ‌జైన్ ప‌బ్లిష్ చేసిన క‌థ‌నం గురించి అంద‌రికీ తెలిసిందే. ప్రియాంక కేవ‌లం హాలీవుడ్‌లో పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించ‌డానికే నిక్‌ని వివాహమాడింద‌ని వెల్ల‌డించిన ఈ క‌థ‌నానికి వ్య‌తిరేకంగా మేం రాసిన ఈ స్టోరీ మంచి పాపులారిటీని సంపాదించింది. ఓ లేఖ రూపంలో మ‌న దేశీ గ‌ర్ల్‌ని కించ‌ప‌ర్చినందుకు వారికి చ‌క్క‌టి గుణపాఠాన్ని చెప్ప‌డం మేం ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేనిది.


ఈ సంవ‌త్స‌రంలో వైర‌ల్ అయిన వీడియోలు


1. Types Of People In An Elevator (లిఫ్ట్‌లో మ‌న‌కు ఎదుర‌య్యే వివిధ ర‌కాల వ్య‌క్తులు)
2. Types Of Golgappa Eaters (పానీపురీ తినే వ్య‌క్తుల్లో ర‌కాలు)
3. Quick And Easy Hairstyles For Oily Hair (ఆయిలీ జుట్టు కోసం వివిధ ర‌కాల సులువైన హెయిర్‌స్టైల్స్‌)
4. Annoying Things Girls With Big Boobs Will Totally Get (స్త‌నాలు పెద్ద‌గా ఉండే అమ్మాయిలు ఎదుర్కొనే ఇబ్బందులు)
5. Thoughts Every Girl Has While Getting A Bikini Wax (బికినీ వ్యాక్స్ చేయించుకునేట‌ప్పుడు ప్ర‌తి అమ్మాయి మ‌న‌సులో ఎదుర‌య్యే ఆలోచ‌న‌లు)మీ ఇయ‌ర్‌ఫోన్స్‌ని చెవిలో పెట్టుకొని వీటిని చూడ‌డం మ‌ర్చిపోవ‌ద్దు.


సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన మా మీమ్స్‌


1. మ‌న‌ జీవితంలోని పెద్ద జోక్ ఇది..


popxo3


 


2. దేవుడా.. ప్లీజ్ కాస్త క‌నిక‌రించు..


popxo2


3. ఇద్ద‌రు భోజ‌న‌ప్రియులు క‌లిస్తే ఇంతే..


popxo4


4. దేశంలోనే పెద్ద తిండిబోతు


popxo5


5. అమ్మ ర‌హ‌స్య ఆయుధం అదే..


popxo6


POPxo ప్ర‌స్తుతం ఆరు భాష‌ల్లో అందుబాటులో ఉంది.


ఇంగ్లిష్‌, హిందీ భాష‌ల్లో నెల‌కు 39 మిలియ‌న్ల యాక్టివ్ యూజ‌ర్ల‌తో కొన‌సాగుతోన్న POPxo... సోష‌ల్ మీడియా వెబ్‌సైట్లు, ఇత‌ర ఛాన‌ళ్ల‌లో కూడా చ‌క్క‌టి ప్ర‌గ‌తిని సాధిస్తోంది. ఈ సంద‌ర్భంగా తెలుగుతో పాటు మ‌రో మూడు భాష‌ల్లోనూ వెబ్‌సైట్ల‌ను ప్రారంభించింది POPxo. త‌మిళం, మ‌రాఠీ, బెంగాలీ భాష‌ల్లోనూ సేవ‌లు అందిస్తోంది. మ‌న భాష‌లో క‌థ‌నాల‌ను అందిస్తూ ఇంకా ఎక్కువ మందికి ద‌గ్గ‌ర‌వ్వాల‌న్న‌దే మా ఉద్దేశం.


ఇంకా పెద్ద స‌ర్‌ప్రైజ్(లు) మీకోసం సిద్ధం..


ఇది మీకు చెప్పాల‌ని మాకు ఎంతో ఆత్రంగా ఉన్నా.. ప్ర‌స్తుతానికి మాత్రం దీన్ని ర‌హ‌స్యంగానే ఉంచుతున్నాం. ఒక‌టి కాదు.. మీకోసం రెండు ర‌హ‌స్యాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. వాటిని మీతో పంచుకోవ‌డానికి ఎంతగానో వేచి చూస్తున్నాం. త్వ‌ర‌లోనే వాటిని వెల్ల‌డిస్తాం.


ఇంత‌టి అద్భుత‌మైన POPxo అందించే యాప్‌ని మీరు ఇంకా డౌన్‌లోడ్ చేసుకోలేదా? అయితే వెంట‌నే ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ల‌లో డౌన్‌లోడ్ చేసుకోండి.


POPxo ప్ర‌స్తుతం ఆరు భాష‌ల్లో అందుబాటులో ఉంది. ఇంగ్లిష్‌, హిందీతెలుగుత‌మిళంమ‌రాఠీ, మ‌రియు బెంగాలీ.అద్భుత‌మైన వార్త‌.. ఇప్పుడు POPxo షాప్ ఓపెన్ అయింది. చ‌క్క‌టి మ‌గ్స్, ఫోన్ క‌వ‌ర్స్‌, కుష‌న్స్‌, లాప్‌టాప్‌స్లీవ్స్ ఇంకా మ‌రెన్నో ఇక్క‌డ 25 శాతం డిస్కౌంట్‌తోనే ల‌భిస్తున్నాయి. POPXOFIRST అనే కూప‌న్ కోడ్‌ని ఉప‌యోగించండి. దీంతో మ‌హిళ‌ల‌కు ఆన్‌లైన్ షాపింగ్ ఎంతో సులువైపోతుంది.