బిగ్ బాస్ తెలుగు : నామినేషన్ ప్రక్రియలో హల్చల్ చేసిన పునర్నవి & తమన్నా ..!

బిగ్ బాస్ తెలుగు : నామినేషన్ ప్రక్రియలో హల్చల్ చేసిన పునర్నవి & తమన్నా ..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 (Bigg Boss Telugu Season 3 ) కార్యక్రమంలో భాగంగా.. నిన్నటి ఎపిసోడ్‌లో జరిగిన సంఘటనలు ఆసక్తికరంగా సాగాయి. ముఖ్యంగా నామినేషన్ ప్రక్రియ జరిగే సమయంలో.. ఇంటి సభ్యుల మధ్య తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. ఆ పరిస్థితులు ఎంతవరకు వెళ్లాయంటే.. ఏకంగా ఇంటి సభ్యులు మొత్తం ఈ వారం నామినేషన్స్‌లో ఉండేంత వరకు.

టీవీ9 జాఫర్ "బిగ్‌బాస్ హౌస్"లోకి.. మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వనున్నారా?

అసలు ఇంతటి గందరగోళం జరగడానికి.. అలాగే ఇంటి సభ్యులు మొత్తం నామినేషన్స్‌లో ఉండే పరిస్థితి రావడానికి గల కారణం.. ఇద్దరు ప్రధానమైన సభ్యులు. వారే - పునర్నవి (Punarnavi), తమన్నా సింహాద్రి (Tamanna Simhadri).

ముందుగా తమన్నా గురించి మాట్లాడుకుంటే, ఈ వారం ఎక్కువగా నామినేషన్స్ దక్కించుకున్న వారిలో ఆమె కూడా ఒకరు. అయితే ఆమెని రవికృష్ణను నామినేట్ చేసిన తరువాత.. అనూహ్యమైన రీతిలో అతన్ని దూషించడం ప్రారంభించింది. "నమ్మించి మోసం చేసావు, అసలు నువ్వు ఇక్కడ ఉండడానికి పనికి రావు" లాంటి మాటలతో రెచ్చగొట్టడానికి ప్రయత్నించింది. అయితే వెంటనే ఇంటిలోని సభ్యులు.. ఆమెని వారించే ప్రయత్నం చేయగా.. వారి పైన కూడా తన పరుష పదజాలంతో టార్గెట్ చేయడం మొదలుపెట్టింది.

అసలు ఆమెని మిగతా నలుగురు సభ్యులు కూడా నామినేట్ చేసినప్పటికి.. రవికృష్ణ ఒక్కడినే ఎందుకు టార్గెట్ చేసిందనే విషయం మాత్రం ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. అలాగే గత వారం కూడా.. తమన్నా ఇంటికి వచ్చిన కొత్తలో రవికృష్ణ వస్తువులని కావాలని దాచిపెట్టడం, అప్పుడప్పుడు కావాలని గొడవపడుతుండడం చేస్తుండేది. ఇవ్వన్ని గమనిస్తే.. ఇంటిలోకి వచ్చే ముందే రవికృష్ణ‌ని టార్గెట్ చేయడానికి తమన్నా సింహాద్రి సిద్ధపడి వచ్చినట్టుగా స్పష్టమవుతోంది.

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులందరూ నామినేట్ అయ్యే పరిస్థితికి కారణం పునర్నవి. తనని వరుసగా మూడవ వారం కూడా నామినేట్ చేస్తున్నారని.. అలాగే ఇంట్లోని వ్యక్తులు గ్రూప్స్‌గా ఏర్పడి తననే టార్గెట్ చేస్తున్నారని ఆమె తెలిపింది. పదే పదే తనలోని లోపాలని బయటకి చూపుతూ.. తన మనసుని గాయపరుస్తున్నారని ఉద్వేగంతో మాట్లాడింది. తనకు ఎవరితోనైనా ఏదైనా ఇబ్బంది వస్తే.. వారితో కలిసి మాట్లాడి ఆ సమస్యను ఒక కొలిక్కి తీసుకొస్తానని.. అలా చేస్తున్న కూడా.. తాను ఎవరితోనూ కలవడం లేదని చెప్పి..  నామినేట్ చేయడం ఎంతవరకు రైట్ అని చెప్పింది. ఈ క్రమంలో తనని తాను సెల్ఫ్ నామినేట్ చేసుకుంది.

ఆ క్రమంలో బిగ్ బాస్ బదులిస్తూ - ఎవరిని వారు సెల్ఫ్ నామినేట్ చేసుకునే అవకాశం లేదు. ఒకవేళ ఇలా గనుక చేస్తే, నామినేషన్ ప్రక్రియ రద్దయిపోయి.. ఇంటిలోని వారంతా నేరుగా నామినేట్ అవుతారు. అలాగే సెల్ఫ్ నామినేట్ చేసుకున్న వారు.. ఈ సీజన్ మొత్తం నామినేట్ అవుతారు" అని  ఒక హెచ్చరిక జారీ చేశారు. ఆ హెచ్చరిక తరువాత కూడా ఆమె నుండి ఎటువంటి స్పందన రాకపోవడం కొసమెరుపు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రివ్యూ.. టైటిల్ గెలిచే కంటెస్టెంట్ ఎవరు?

ఆ తరువాత ఇంటి కెప్టెన్ వరుణ్ సందేశ్ ఆమెకి పరిస్థితిని వివరించి చెప్పి... ఇలాగే ప్రతివారం నామినేషన్ ప్రక్రియ ఉంటుందని.. అనవసరంగా కావాలనే సీజన్ మొత్తం నామినేట్ అవ్వడం సరికాదని సూచించాడు. ఆ సూచన మేరకు, ఆమె తిరిగి నామినేషన్ ప్రక్రియలో పాల్గొంది. ఈ క్రమంలో పునర్నవి ఇంటి సభ్యులైన బాబా భాస్కర్, శివ జ్యోతిలని నామినేట్ చేయడం జరిగింది.

ఇలా ఇన్ని గందరగోళాల మధ్య నిన్నటి నామినేషన్ల ప్రక్రియ పూర్తైంది. ఇక నామినేషన్స్‌లో ఎక్కువగా ఓట్లు పొందిన తమన్నా సింహాద్రి (5) , పునర్నవి  (4), వితిక  (4), రాహుల్ సిప్లిగంజ్  (4),  బాబా భాస్కర్‌లు  (3)..  ఈ వారం ఇంటి నుండి బయటకి వెళ్ళేందుకు.. నామినేషన్స్‌లో ఉన్నట్టుగా బిగ్‌బాస్ ప్రకటించారు.

మొత్తానికి ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ.. బిగ్‌బాస్ హౌస్‌లో తీవ్ర అనిశ్చితికి దారి తీసిందనే చెప్పాలి. ఈరోజు జరిగిన ఎపిసోడ్ బట్టి అయితే.. ఈ వారం ఇంటి నుండి బయటకి వెళ్ళేది ఎవరన్నది చెప్పడం చాలా సులభం.

ఒక్కసారి మేకప్ వేసుకుంటే... అది జీవితాంతం మనల్ని వదిలిపెట్టదు ('కాజోల్' బర్త్ డే స్పెషల్)