ADVERTISEMENT
home / Celebrity Life
రాధికా ఆప్టే తన పెళ్లికి రంధ్రాలు పడిన పాత చీర ఎందుకు కట్టుకుందో తెలుసా?

రాధికా ఆప్టే తన పెళ్లికి రంధ్రాలు పడిన పాత చీర ఎందుకు కట్టుకుందో తెలుసా?

రాధికా ఆప్టే(radhika apte).. తెలుగు, తమిళ భాషల్లోనే కాదు.. బాలీవుడ్ లోనూ అద్భుతమైన నటిగా పేరు ప్రఖ్యాతలు సాధించిందీ బ్యూటీ. కేవలం నటనతో మాత్రమే కాదు.. సినిమా ఇండస్ట్రీలోని వివిధ సమస్యలపై కూడా తన గళాన్ని వినిపించడంలో రాధిక ముందుంటుంది. తన మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం ఆమె నైజం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన దుస్తుల గురించి పంచుకుంది. దుస్తుల పై పెద్దగా ఖర్చు పెట్టనని చెప్పిన రాధిక తన పెళ్లి (wedding)కి కూడా చాలా సింపుల్ గా ఉండే దుస్తులు ధరించానని చెప్పింది.

నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఆ తర్వాత రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నాం. నా పెళ్లికి నేను మా నానమ్మ పాత చీర కట్టుకున్నా. ఆ చీర అంటే నాకెంతో ఇష్టం. తనంటే నాకున్న ప్రేమ వల్ల నా పెళ్లికి తన చీరే కట్టుకోవాలనుకున్నా. ఈ ప్రపంచంలో నాకు ఇష్టమైన వ్యక్తుల్లో తను ఒకరు.. నా దగ్గర తన చీర ఒక్కటే ఉంది. దానికి చిన్న చిన్న రంధ్రాలు పడి ఉన్నాయి. అయినా నేను అదే కట్టుకోవాలనుకున్నా. నేను దుస్తులపై పెద్దగా ఖర్చు చేసే వ్యక్తిని కాదు.. ఖరీదైన దుస్తులు ధరించడం నాకు అంత ఇష్టం ఉండదు. నేను అందంగా కనిపించాలని అనుకుంటా. అందుకే నా పార్టీ కోసం అందంగా ఉండే ఓ డ్రస్ కొనుక్కున్నా. దాని ఖరీదు కూడా పది వేల కంటే తక్కువే.. అసలు డ్రస్ కొనుక్కోవాలన్న విషయం కూడా మర్చిపోయా. ఆఖరి నిమిషంలో గుర్తొచ్చి కొనుక్కున్నా. దుస్తుల విషయంలో నేను పెద్దగా పట్టించుకోను. అంటూ చెప్పుకొచ్చింది.

ADVERTISEMENT

లండన్ కి చెందిన మ్యుజీషియన్ బెనెడిక్ట్ టైలర్ ని ఆరేళ్ల క్రితం వివాహం చేసుకుంది రాధిక. వీరిద్దరూ ఎక్కువ బయట కనిపించకపోయినా ఈ జంట ముంబై, లండన్ మధ్య తిరుగుతూ ఒకరితో ఒకరు సమయం గడుపుతుంటారు. తన వ్యక్తిగత జీవితం గురించి.. భర్త గురించి ఎలాంటి విషయాలను బయటకు వెల్లడించడానికి రాధిక అంతగా ఇష్టపడదు. కానీ తాజా ఇంటర్వ్యూలో మాత్రం తన పెళ్లి గురించి చాలా వివరాలు వెల్లడించింది రాధిక. నా విషయంలో పెళ్లి అనేది పెద్ద ముఖ్యమైన విషయం కాదు. పెళ్లి కాకుండా కూడా ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ప్రేమిస్తూ ఒకరికొకరు కట్టుబడి ఉంటారని నేను నమ్ముతాను. ఇద్దరు వ్యక్తులను కలిపి ఉంచేది వారి మధ్య ప్రేమే కానీ పెళ్లి కాదు.. కానీ చాలామందికి పెళ్లి అనేది చాలా ముఖ్యమైన, పవిత్రమైన విషయం. పెళ్లిని నేను ఇద్దరు వ్యక్తులను కలిపే బంధంగా మాత్రమే చూస్తాను. ఇద్దరూ ఒకరికొకరు వాగ్దానం చేసుకోవడాన్ని నేను నమ్ముతాను. పెళ్లిని అంత ఘనంగా ఎందుకు జరుపుతారో మాత్రం నాకు అర్థం కాదు. చిన్నతనంలోనూ నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలని భావించేదాన్ని కాదు.. అంటే నాకు పెళ్లంటే ఇష్టం లేదని కాదు.. అలా అనిపించేది అంతే.. నా పెళ్లి కేవలం ఓ రిజిస్టర్ మ్యారేజ్ అయినా ఆరోజు నాకెంతో ప్రత్యేకం. ఆరోజు కి సంబంధించి ఎన్నో మరపురాని అనుభూతులు నాకు గుర్తున్నాయి.

మేమిద్దరం వేర్వేరు మతాలకు చెందినవాళ్లం. అందుకే మా పెళ్లిని ఏ ఆచారాల ప్రకారం నిర్వహించాలని భావించలేదు. పెళ్లి సందర్భంగా మేం వచ్చే అతిథులందరికీ విత్తనాలను అందించి మాకోసం ఓ మొక్క నాటాలని కోరాం. అలా మా పెళ్లికి హాజరైన ప్రతి కుటుంబ సభ్యులు ఒక మొక్క నాటారు. అలా పెళ్లికి వచ్చిన 80 మంది కలిసి 30 నుంచి 40 మొక్కలు నాటాం. పెళ్లి అనగానే ప్రతి ఒక్కరూ ఖరీదైన దుస్తులు ధరించారు. అయినా సరే.. మట్టి తవ్వడం.. నీళ్లు పోయడం వంటివి చేస్తే దుస్తులు పాడైపోతాయని కూడా వాళ్లు ఆలోచించలేదు. ఆ తర్వాత మొక్కలు కాయలు కాస్తే అవి మీకే ఇస్తాను అని వాళ్లకు చెప్పాను. ఇలాంటి గ్రూప్ యాక్టివిటీస్ అంటే నాకెంతో ఇష్టం. అంటూ తమ పెళ్లి వేడుకల గురించి చెప్పుకొచ్చింది రాధిక.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

16 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT