ADVERTISEMENT
home / Bollywood
దీపిక కోసం ఆ సినిమాలో.. నటించకూడదని అనుకున్నా: రణ్ వీర్ సింగ్

దీపిక కోసం ఆ సినిమాలో.. నటించకూడదని అనుకున్నా: రణ్ వీర్ సింగ్

రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పదుకొణె (Deepika Padukone).. కేవలం బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఎంతోమంది ఆరాధించే జంట. ఆరేళ్ల పాటు ప్రేమించుకున్న వీరు ఏడాది క్రితం ఇటలీలోని లేక్ కొమోలో సింపుల్‌గా వివాహమాడిన సంగతి తెలిసిందే. తమ వివాహం తర్వాత ఈ ఆలుమగలిద్దరూ కలిసి నటిస్తోన్న చిత్రం ’86’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. కపిల్ దేవ్ బయోపిక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో దీపిక.. కపిల్ భార్య రోమీ భాటియాగా నటిస్తోంది. తాజాగా యాక్టర్స్ రౌండ్ టేబుల్ అంటూ ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన షోలో పాల్గొన్న రణ్ వీర్.. తన జీవితంలో ఎవరికీ తెలియని ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు.

ఈ కార్యక్రమంలో భాగంగా ‘మీరు ముందు కాదని చెప్పి.. తర్వాత ఒప్పుకున్న పాత్ర ఏదైనా ఉందా?..’ అని అడగ్గా దీనికి రణ్ వీర్ ఎవరూ ఊహించని సమాధానం చెప్పాడు. ‘ముందు తను పద్మావత్ సినిమాలోని ఖిల్జీ పాత్ర చేయడానికి అంతగా ఆసక్తి చూపించలేదని.. కానీ తర్వాత ఒప్పుకున్నానని’ చెప్పాడు. ‘ఖిల్జీ పాత్ర చాలా అసహ్యమైనది, నీచమైనది, నెగెటివ్ షేడ్స్ కలిగి ఉన్నదని నాకు తెలుసు. అందుకే సంజయ్ సర్ నాకు మొదట ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు కాస్త భయంగా అనిపించింది. నేను ఈ పాత్ర చేస్తే.. అది నన్ను తిరిగి మళ్లీ బయటకు రాలేని గొయ్యిలో తోసేస్తుందేమో.. నా మానసిక పరిస్థితి మారిపోతుందేమో అని నాకు భయంగా అనిపించింది.

ముఖ్యంగా దీపికతో నా బంధం పై ఈ పాత్ర ప్రభావం పడుతుందేమో అని అనిపించేది. ఆ పాత్ర గురించి ఆలోచిస్తేనే నా మతి చెడినట్లుగా అనిపించేది. ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితిలో నాకు అది అవసరమా? అనిపించింది. నేను అప్పుడు ఉన్న స్థితిలో నేను చాలా సంతోషంగా ఉన్నా.. దీపిక నా జీవితంలో ఉంది. మేమిద్దరం పెళ్లి చేసుకోవడానికి సిద్దమవుతున్నాం. అంతా పూల బాటలా సాగుతోంది. అలాంటప్పుడు ఇది అవసరమా? అనిపించింది. అదే విషయాన్ని సంజయ్ సర్‌తో చెప్పాను. సర్.. కొన్నాళ్లలో దీపిక, నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతున్నాం. ఇప్పుడు ఈ పాత్రలో నటించడం అవసరమా? అనిపిస్తోంది అని చెప్పాను’

ADVERTISEMENT

‘కానీ నేను ఇదే విషయాన్ని సంజయ్ సర్‌కి చెప్పినప్పుడు ఆయన రకరకాల కారణాలు చెప్పి నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. నాకింకా గుర్తు.. ఓ రోజు సాయంత్రం ఆయన బాల్కనీలో కూర్చొని మేం భోజనం చేస్తున్నాం. చేపల కూరతో భోజనం చేస్తున్నా. నేను అప్పుడు ఆ పాత్రలో నటించాలా? వద్దా? అని ఆలోచిస్తున్నా. నేను ఊగిసలాడుతూ ఉండేసరికి సంజయ్ సర్‌కి కోపం వచ్చింది. అన్నం తింటున్న వ్యక్తల్లా తన స్పూన్‌ని ప్లేట్‌‌లో గట్టిగా పడేసి.. ఈ పాత్ర చేయడానికి నీకేం ఇబ్బందిగా అనిపిస్తోంది? అంటూ అడిగారు. నేను అప్పుడు ‘సరే’ అన్నాను’ అంటూ ఆ పాత్ర ఒప్పుకోవడానికి వెనుక జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చాడు రణ్ వీర్.

దీపికా పదుకొణె, షాహిద్ కపూర్, రణ్ వీర్ సింగ్‌లు నటించిన ‘పద్మావత్’ సినిమాలోని అల్లాఉద్దీన్ ఖిల్జీ రణ్ వీర్ జీవితంలోనే విభిన్నమైన పాత్ర అని చెప్పుకోవచ్చు. ఎంతో క్రూరమైన చక్రవర్తిని.. తన పాత్ర ద్వారా అందరికీ చూపించిన రణ్ వీర్ ఈ పాత్ర తయారీకి నెల రోజుల పాటు ఎవరితో సంబంధం లేకుండా.. గదిలో కూర్చొని అల్లాఉద్దీన్ ఖిల్జీ గురించి పుస్తకాలు చదివి, డాక్యుమెంటరీలు చూశాడట.

దీనివల్ల తనను తాను ఆ పాత్రలో లీనం చేయగలిగాడు. సినిమా షూటింగ్ తర్వాత కూడా తనలో ఖల్జీ లక్షణాలు కనిపిస్తున్నాయని గుర్తించిన రణ్ వీర్.. ఆ పాత్ర స్వభావాలను తన నుంచి తొలిగించుకోవడానికి సైకాలజిస్ట్ సాయం కూడా తీసుకున్నాడట. ఆ పాత్ర ప్రభావం తన జీవితం పై, తన ప్రేమపై పడకూడదని.. దీపికతో తాను సంతోషంగా జీవించాలని ఈ నిర్ణయం తీసుకున్నాడట రణ్ వీర్.

ADVERTISEMENT

తన నెచ్చెలిపై ప్రేమను చాటడానికి రణ్ వీర్ ఎప్పుడూ వెనుకాడడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన ప్రేమ గురించి చెప్పుకొచ్చాడీ హీరో. ‘మా బంధం ప్రారంభమై ఆరు నెలలు కాగానే.. నా జీవితం మొత్తం తనతోనే గడపాలని నిర్ణయించుకున్నా. తనని చూడగానే నా పిల్లలకు తల్లిగా ఊహించుకున్నా. ఆరు నెలలు తనతో ప్రేమలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని… మా బంధాన్ని అలా కొనసాగించాం. తను ఎంతో మంచిది. తన మనస్తత్వం అద్బుతమైంది. తను నా జీవితంలోకి అడుగుపెట్టడం నా అదృష్టం.

మా పెళ్లికి మూడు సంవత్సరాల ముందు నుంచి.. పెళ్లి గురించి ఆలోచించడం ప్రారంభించాం. అయితే తన ఇష్టప్రకారం తనకు నచ్చిన సమయానికి తనకు నచ్చినట్లుగా మా పెళ్లి జరగాలని నేను కోరుకున్నా. నువ్వు ఎప్పుడు ‘ఓకే’ అంటే.. అప్పుడు చేసుకుందాం అని నేను చెప్పాను. అందుకే మా పెళ్లికి కాస్త ఆలస్యం అయింది. తను పెళ్లి కాస్త ఆలస్యం అయినా.. అంతా పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంది. తన ఇష్టప్రకారమే అంతా చేశాం’ అంటూ చెప్పుకొచ్చాడు రణ్ వీర్.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

17 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT