భవిష్యత్తు కోసం పెళ్లి చేసుకోకూడదని భావించా.. అందుకే విడిపోయా : రష్మిక

భవిష్యత్తు కోసం పెళ్లి చేసుకోకూడదని భావించా.. అందుకే విడిపోయా : రష్మిక

రష్మిక మంధన (Rashmika Mandanna).. కన్నడంలోని 'కిరాక్ పార్టీ' సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. 'ఛలో' సినిమాతో తెలుగు తెరకు కూడా పరిచయమైంది. చాలా కొద్ది కాలంలోనే గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలతో అగ్ర కథానాయికగా మారింది. ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు, భీష్మ'  చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ఈ అమ్మడు తెలుగు తెరకు పరిచయం కాకముందే 'కిరాక్ పార్టీ' సినిమాలో.. తనకు జంటగా నటించిన రక్షిత్ శెట్టిని ప్రేమించింది. వీరిద్దరికీ ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది.  రెండు సంవత్సరాల తర్వాత వివాహం చేసుకోవడానికి కూడా వీరిద్దరూ నిర్ణయించుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల.. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. దీనికి గల కారణాలను రష్మిక కానీ, రక్షిత్ (Rakshit Shetty) కానీ బయటకు వెల్లడించలేదు.

అయితే రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ ఈ విషయమై రష్మికను చాలా నిందించారు. రకరకాల కామెంట్లు కూడా చేశారు. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంది రష్మిక. కష్టపడి ఇండస్ట్రీలో టాప్ కథానాయికగా పేరు సంపాదించుకుంది. వచ్చే సంవత్సరం బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టబోతోంది. తాజాగా తాను నటించిన 'అతడే శ్రీమన్నారాయణ' సినిమా ప్రమోషన్లలో భాగంగా.. తాను రష్మికతో విడిపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు రక్షిత్.

తమ బంధం సుదీర్ఘంగా కొనసాగపోవడానికి కారణం 'రష్మిక' అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు చాలా సంచలనం రేపాయి. రక్షిత్ మాట్లాడుతూ.. 'తను చాలా పెద్ద పెద్ద కలలు కంటుంది. తన గతం గురించి నాకు తెలుసు. అందుకే ఆ కలల వెనుక ఉన్న కారణాలు కూడా నాకు తెలుసు. ఈ సంవత్సరం తన కలలన్నీ నెరవేరాలని నేను కోరుకుంటున్నా' అని చెప్పుకొచ్చాడు.

వయసు ఎంతైనా ఫర్వాలేదు.. అలాంటివాడినే పెళ్లి చేసుకుంటా : రష్మిక

అంతేకాదు.. తన అభిమానులందరికీ రష్మికను టార్గెట్ చేయొద్దని చెప్పిన రక్షిత్.. 'మీ అందరికీ రష్మిక విషయంలో కొన్ని అభిప్రాయాలున్నాయి. కొన్ని అపోహల వల్ల మీరు అలా భావించడంలో తప్పులేదు. కానీ నాకు రష్మిక గత రెండు సంవత్సరాలుగా తెలుసు. మీ అందరి కంటే నాకు రష్మిక గురించి ఎక్కువ తెలుసు. ఇక్కడ కేవలం మీరు అనుకుంటున్న కారణం మాత్రమే కాదు.. ఇంకా చాలా అంశాలు మేం విడిపోవడానికి కారణమయ్యాయి. అందుకే తన గురించి అభిప్రాయాలు ఏర్పర్చుకొని తనని ఇబ్బంది పెట్టడం మానేయండి. కొన్ని విషయాలను మర్చిపోవడమే మంచిది' అంటూ చెప్పుకొచ్చాడు.

దీనిపై రష్మిక కూడా తాజాగా స్పందించింది. 'కిరాక్ పార్టీ' సినిమా షూటింగ్ సమయంలో నేను, రక్షిత్ ప్రేమించుకున్నాం. 2017లో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాం. రెండేళ్ల తర్వాత వివాహం చేసుకోవాలనుకున్నాం. కానీ మా ఇద్దరికీ సినిమా రంగంలో రాణించాలనే కోరిక ఉంది. ఎంగేజ్ మెంట్ తర్వాత నాకు తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. వరుస అవకాశాలతో నా కెరీర్ సక్సెస్ ఫుల్‌గా సాగుతోంది. ఈ సమయంలో వివాహం చేసుకొని నా నిర్మాతలను ఇబ్బంది పెట్టాలనుకోలేదు. అందుకే మా ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాం' అంటూ చెప్పుకొచ్చింది.

గతంలోనూ ఈ విషయం గురించి మాట్లాడింది రష్మిక. 'నా గురించి చాలా ఆర్టికల్స్, కామెంట్లు రావడం చూస్తున్నారు. ఇవి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మిమ్మల్ని తప్పుబట్టాలని నేను భావించట్లేదు. మీరు నమ్మిందే మీరు నిజమనుకుంటున్నారు. నేను ఎవరికీ సంజాయిషీ చెప్పాలనుకోవడం లేదు. కానీ రక్షిత్, నేను లేదా ఇండస్ట్రీలో ఉన్న ఇంకెవరైనా సరే.. ఇలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు. ప్రతి నాణేనికి రెండు వైపులు ఉన్నట్లే.. ప్రతి కథకు రెండు వైపులు కూడా ఉంటాయి. అవి గుర్తించాలని నేను అందరికీ మనవి చేస్తున్నా' అని చెప్పుకొచ్చింది రష్మిక. 

నా అభిమానులు.. నాకు గుడి కడితే బాగుంటుంది : రష్మిక మందాన

పెళ్లి, బ్రేకప్ వంటి విషయాలు పక్కన పెడితే.. ఇప్పుడు కన్నడం, తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా హీరోయిన్‌గా అడుగు పెట్టి పేరు సంపాదించుకోనుంది రష్మిక. ప్రస్తుతం తెలుగులో రష్మిక నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా జనవరి 10 న విడుదలకు సిద్ధమవుతుండగా.. భీష్మ ఫిబ్రవరి 21 న విడుదల కానుంది. 

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.