బిగ్ బాస్ తెలుగు : ఇంటి సభ్యులని ఏడిపించిన రవికృష్ణ, బాబా భాస్కర్, శ్రీముఖి & మహేష్ విట్టా

బిగ్ బాస్ తెలుగు : ఇంటి సభ్యులని ఏడిపించిన రవికృష్ణ, బాబా భాస్కర్, శ్రీముఖి & మహేష్ విట్టా

"బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3" రెండవ వారం చివరికి వచ్చేసింది. ఈ సీజన్‌లో ఇంటికి మొదటి కెప్టెన్‌గా వరుణ్ సందేశ్ ఎన్నిక కావడంతో.. బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరికి కేటాయించిన విభాగంలో వారు పనులు చేయడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో నిన్నటి ఎపిసోడ్ మొత్తం కాస్త ఎమోషనల్‌గా గడిచిందనే చెప్పాలి.

ఫ్రెండ్‌షిప్ డే గిఫ్ట్ ఐడియాస్ & గ్రీటింగ్ కార్డ్స్ (Friendship Day Gift Ideas In Telugu)

దానికి కారణం - ఇంటిలోని సభ్యులు తమ జీవితాల్లో జరిగిన ఎమోషనల్ సంఘటనల గురించి మిగతా సభ్యులతో పంచుకోమని బిగ్‌బాస్ కోరడం జరిగింది. దానితో ఇంటి సభ్యులందరూ తమ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలిపారు. అందులో ఒక ఇద్దరు, ముగ్గురు సభ్యులు పంచుకున్న విషయాలు.. తోటి సభ్యులనే కాకుండా ఆ షో చూస్తున్న వీక్షకులను కూడా కంటతడి పెట్టించాయి.

ఆ వివరాల్లోకి వెళితే, తొలుత రవికృష్ణ (Ravi Krishna) మాట్లాడుతూ - ఆర్టీసి డ్రైవరైన తన తండ్రి చిన్నతనం నుండి బాగా చదువుకోవాలని, చదువుకుంటూనే జీవితం బాగుంటుంది అని చెప్పినప్పటికి.. తనకి ఇష్టమైన ఈ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చానని తెలిపారు. అయితే సినిమాల్లో రాణించకపోయినా.. కనీసం టీవీ రంగంలో అయినా నిలదొక్కుకున్నందుకు ఆనందంగా ఉందని తెలిపాడు. అయితే తన తండ్రి అనుకున్న విధంగా తాను కాలేకపోయినా.. తాను ఎంచుకున్న రంగంలో అయినా సరే మంచి పేరు తెచ్చుకుని.. ఆయనను బాగా చూసుకుంటానని చెబుతూ కంట నీరు పెట్టుకున్నాడు.

ఆ తరువాత శ్రీముఖి (Sreemukhi) తన అనుభవాన్ని పంచుకుంటూ - తనంటే తాతయ్యకి చాలా ఇష్టమని, అయితే ఆయనకి పక్షవాతం రావడంతో.. ఆఖరి రోజుల్లో తనతో సరిగా గడపలేకపోయానని తెలిపింది. చివరికి ఆయన చనిపోయాడని తెలిసిన వేళ.. ఆయన పక్కన తన తండ్రి ఒక్కడే కూర్చుని ఏడవటం తాను చూడలేకపోయానని చెప్పింది. అలాగే గత మూడేళ్ళుగా తన తల్లిదండ్రులకి దూరంగా బ్రతకడం చాలా కష్టంగా ఉందని కూడా తెలిపింది.

ఇక కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ (Baba Bhaskar) మాట్లడుతూ - తాను చిన్నతనం నుండి చదువుకోకుండా డ్యాన్స్ అంటూ తిరిగితే తన తండ్రి ఎంతగానో ప్రోత్సహించారని తెలిపారు. కానీ డ్యాన్సర్‌గా మారిన తర్వాత.. తన తల్లిదండ్రుల మాట వినేవాడిని కాదని ఆయన బాధపడుతూ చెప్పారు. చివరికి పెళ్లి జరిగి కొడుకు పుట్టాక కూడా.. తనలో ఏ మార్పు రాలేదని, తన బిడ్డ పుట్టిన వేళప్పుడు కూడా.. మందు తాగుతూ బయట ఎక్కడో ఉన్నానని తెలిపారు.

అయితే తనకి కూతురు పుట్టిన తరువాత చాలా మారానని..  తన తల్లిదండ్రులని కూడా చూసుకోవాలని అనుకున్నానని.. కానీ అదే సమయంలో తన తండ్రి చనిపోవడం చాలా బాధించిందని తెలిపారాయన. అందుకే "మన తల్లిదండ్రులు మనతో ఉన్నప్పుడే బాగా చూసుకోవాలని.. అంతే కాని వారు మనల్ని విడిచి పెట్టి వెళ్ళిపోయాక బాధపడి ప్రయోజనం ఉండదు" అని చెప్పుకొచ్చాడు బాబా భాస్కర్.

రాక్షసుడు మూవీ రివ్యూ - థ్రిల్లర్స్‌ని ఇష్టపడే వారి కోసం...

చివరలో మాట్లాడిన మహేష్ విట్టా (Mahesh Vitta) " తాను హైదరాబాద్ వచ్చి ఏవో కోర్సులు చేసిన తరువాత పని దొరకలేదని తెలిపారు. చేతిలో డబ్బులు లేక ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో తన ఫ్రెండ్ తనకి ఆశ్రయం ఇచ్చి ఆరు నెలల పాటు జాగ్రత్తగా చూసుకున్నాడని చెప్పారు. ఆ తరువాత కొన్నాళ్ళకి మహేష్‌కి అవకాశాలు దొరికి స్థిరపడ్డాక, తనకి సహాయం చేసిన ఫ్రెండ్ కష్టాల్లో ఉంటే తాను చూసుకున్నాడట.

అయితే ఆ సమయంలో తన ఫ్రెండ్‌కి ఉన్న ఆరోగ్యపరమైన సమస్య తెలుసుకోలేకపోయాడట. ఒకరోజు తిరుపతికి వెళ్లి కాలి నడకన కొండ ఎక్కుతూ ఆ స్నేహితుడు గుండె ఆగి చనిపోయాడట. తన ఫ్రెండ్ పక్కన ఉన్నప్పుడు ..కనీసం ఆరోగ్యం ఎలా ఉంది? అని అడగనందుకు ఇప్పటికి కూడా బాధపడుతుంటాను అని చెప్పి, ఇప్పుడు తనకి ఎవరైనా ఆరోగ్యం సరిగ్గా లేదంటే.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళడం ఒక అలవాటుగా చేసుకున్నాను అని చెప్పాడు.

ఇలా వీరందరూ తమ జీవితంలో జరిగిన చేదు సంఘటనల గురించి చెప్పుకుంటే, హిమజ మాత్రం తన తల్లి చిన్నతనంలో ఎదుర్కొన్న కష్టాలు చూసాక, "జీవితంలో ఏది జరిగినా అది మన మంచికే" అన్న విధంగా తీసుకోవాలి తప్ప.. జరిగిన విషయాల గురించి ఎక్కువగా బాధపడుతూ.. మిగిలిన జీవితాన్ని పాడు చేసుకోకూడదని తాను జీవితాన్ని చూసే కోణం గురించి వివరించింది.

బిగ్‌బాస్ తెలుగు: వరుణ్ సందేశ్ పై.. వితిక అలగడానికి అసలు కారణం ఇదేనా!