ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ఆయన సినిమాల్లో.. “కథానాయిక పాత్రలు” చాలా స్పెషల్..!

ఆయన సినిమాల్లో.. “కథానాయిక పాత్రలు” చాలా స్పెషల్..!

కోడి రామకృష్ణ .. తెలుగు సినీ పరిశ్రమకు బాగా సుపరిచితమైన పేరు. ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ చిత్రాలతో.. పాటు ఫాంటసీ చిత్రాలలో సైతం ఒక వైవిధ్యాన్ని చూపించిన దర్శకుడు “కోడి” అనడంలో అతిశయోక్తి లేదు. అన్నింటికన్నా ముఖ్యంగా.. ఆయన చిత్రాలలో నటించిన హీరోయిన్ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం కూడా ఆశ్చర్యమే.

అగ్ర హీరోల చిత్రాలకు పోటీగా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు తీసి.. హిట్ కొట్టిన మేటి టాలీవుడ్ దర్శకుల్లో “కోడి” ఎప్పుడూ ముందంజలోనే ఉంటారు. విజయశాంతి, అర్చన, మీనా, సుహాసిని, సౌందర్య, అనుష్క మొదలైన హీరోయిన్స్‌కు “కోడి” తీసిన చిత్రాలు స్టార్ స్టేటస్‌నే తీసుకొచ్చాయి. ఇటీవలే ఆయన స్వర్గస్థులైన క్రమంలో.. దర్శకుడు కోడి రామకృష్ణ తీసిన చిత్రాల్లోని పలు ప్రభావవంతమైన కథానాయికల పాత్రల (women roles) గురించి ఈ కథనం ప్రత్యేకం

 

tarangini-movie-1

ADVERTISEMENT

శ్యామలగౌరి (తరంగిణి) – కోడి రామకృష్ణ తీసిన చిత్రాలలో “తరంగిణి”కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తొలుత “ఇంట్లో రామయ్య, వీధిలో క్రిష్ణయ్య” సినిమాతో దర్శకుడిగా మారగా.. తాను డైరెక్షన్ చేసిన ద్వితీయ చిత్రమే “తరంగిణి”. నటి శ్యామలగౌరిని ఈ చిత్రంతోనే హీరోయిన్‌గా ఆయన పరిచయం చేశారు. ఓ సగటు మధ్యతరగతి గృహిణిపై అఘాయిత్యానికి పాల్పడడానికి పథకం రచించే సైకో లాంటి వ్యక్తిని.. ఆమె ధైర్యంతో ఎలా ఎదిరించిందన్నదే ఈ చిత్రకథ. ఈ చిత్రంలో కథానాయిక పాత్రని చాలా ధైర్యంగా, ఛాలెంజింగ్‌గా తీర్చిదిద్దారు దర్శకులు.

suhasini-in-mukku-pudaka-movie

సుహాసిని (ముక్కుపుడక) – కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఓ ప్రత్యేక స్థానం ఉన్న చిత్రం “ముక్కుపుడక”. బాహ్య సౌందర్యం కన్నా.. మనో సౌందర్యం మిన్న అనే సందేశాన్ని ఈ చిత్రం అందిస్తుంది. తన భార్య నల్లగా ఉందని.. వేరొక అమ్మాయిని వివాహం చేసుకోవాలని భావించే హీరోకి.. కథానాయిక ఎలా కనువిప్పు కలిగించింది అనేదే ఈ చిత్రకథ. ఈ సినిమాలో సుహాసిని పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. “గోపురంగల్ సైవతిల్లాయ్” అని తమిళ చిత్రానికి ఈ సినిమా రీమేక్.

vijaya-shant-in-police-lock-up-movie

ADVERTISEMENT

విజయ శాంతి (పోలీస్ లాకప్) – ఒక పోలీస్ ఆఫీసరుగా, అలాగే ఓ సామాన్య యువతిగా నటి విజయశాంతి డ్యుయల్ రోల్ పోషించిన ఈ “పోలీస్ లాకప్” చిత్రం ఆమె స్టార్ ఇమేజ్‌ను అమాంతం పెంచింది. “కర్తవ్యం” సినిమా తర్వాత అదే స్థాయి ప్రశంసలు ఈ చిత్రం ద్వారా విజయశాంతికి దక్కాయి. అవినీతిపరులైన రాజకీయ నాయకుల ఆటకట్టించాలని ప్రయత్నించిన ఓ లేడీ పోలీస్ ఆఫీసర్.. చేయని నేరానికి జైలుకి వెళ్లిన తరుణంలో.. తన నిజాయతీని ఎలా నిరూపించుకుంటుంది అనేది ఈ చిత్ర కథ. ఈ సినిమా సక్సెస్ అయ్యాక.. విజయశాంతి కథానాయికగా లేడీ బాస్, భారత రత్న సినిమాలకు దర్శకత్వం వహించారు కోడి రామకృష్ణ.

TALAMBRALU-MOVIE

జీవిత (తలంబ్రాలు) – సినీ నటి జీవితకు తన కెరీర్‌లోనే బెస్ట్ చిత్రంగా “తలంబ్రాలు” నిలిచిపోతుంది. ఈ చిత్రంలో హీరో పాత్రలో విలనిజాన్ని చూపిస్తూ.. నరరూప రాక్షసుడైన భర్తను భార్యే హతమార్చే విధంగా కథను తెరకెక్కించారు దర్శకుడు. స్త్రీ ఆత్మగౌరవానికి సంబంధించి ఒక సరికొత్త కోణాన్ని కథలో చూపించడంతో.. ఆ సినిమా అప్పట్లోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.

allari-pilla-meena-movie

ADVERTISEMENT

మీనా (అల్లరి పిల్ల) – తాను అప్పటి వరకూ తీసిన చిత్రాలకు భిన్నంగా.. కథానాయిక పాత్రకు కాస్త కామెడీ అద్ది.. ఆమె చేత చిన్నపిల్ల మనస్తత్వం గల అమ్మాయి వేషాన్ని చేయించారు దర్శకులు.కాస్త గడసరి అమ్మాయి పాత్రలో ఈ చిత్రంలో కథానాయిక “మీనా” ఒదిగిపోయి నటించింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన “కిలుక్కమ్” చిత్రానికి ఈ చిత్రం రీమేక్. మలయాళంలో నటి రేవతి పోషించిన పాత్రని.. తెలుగులో మీనా పోషించడం గమనార్హం.

soundarya-ammoru-movie

సౌందర్య (అమ్మోరు) – తెలుగు సినీ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన చిత్రాల్లో “అమ్మోరు” చిత్రాన్ని కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో భక్తురాలిగా, ఇల్లాలిగా తన పాత్రకు పూర్తిస్థాయిలో నటి సౌందర్య న్యాయం చేయడం జరిగింది. ఈ చిత్రంలో నటనకు గాను సౌందర్య ఉత్తమ కథానాయికగా “ఫిల్మ్‌ఫేర్” అవార్డును కూడా కైవసం చేసుకున్నారు.

devi-telugu-movie-poster

ADVERTISEMENT

ప్రేమ (దేవి) – దర్శకుడు కోడి రామకృష్ణ చేసిన గ్రాఫిక్ మాయాజాలం “దేవి”.. 1999లో విడుదలై ఒక ట్రెండ్ సెట్టర్  సినిమాగా నిలిచిపోయింది. ఈ చిత్రంలో నాగిని పాత్రలో నటించిన నటి ప్రేమకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.

aavide-shyamala

రమ్యక్రిష్ణ (ఆవిడే శ్యామల) – మలయాళ చిత్రం “చింతవిష్టాయాయ శ్యామల” చిత్రాన్ని.. తెలుగు నేటివిటీకి తగినట్లుగా మలచి.. దర్శకుడు చేసిన ప్రయోగమే “ఆవిడే శ్యామల”. దూరపు కొండలు నునుపు అన్నట్లు.. అత్యాశతో అక్రమంగా డబ్బు సంపాదించాలని భావించి.. భార్య, బిడ్డలను వదిలేసి వెళ్లిపోయిన భర్తకు.. ఓ తెలుగింటి ఇల్లాలు ఎలాంటి గుణపాఠం నేర్పిందనేదే ఈ చిత్రకథ. ఆత్మస్థైర్యంతో, మనో నిబ్బరంతో ఎన్ని సమస్యలనైనా మహిళ అధిగమించగలదు అనే సందేశాన్ని ఈ చిత్రం అందిస్తుంది.

anushka-arundathi

ADVERTISEMENT

అనుష్క (అరుంధతి) – తెలుగు సినీ పరిశ్రమకు మరోమారు దర్శకుడు “కోడి” సత్తాను రుచి చూపించిన చిత్రం “అరుంధతి”. ఇందులో కథానాయిక జేజమ్మ పాత్రను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం అనేకమంది ప్రశంసలను అందుకుంది. అలాగే ఈ పాత్ర పోషించిన అనుష్కకూ తిరుగులేని స్టార్ హీరోయిన్ హోదాను కట్టబెట్టింది. ఈ చిత్రానికి 4 నంది అవార్డులు లభించగా.. అందులో ప్రత్యేకంగా స్పెషల్ జ్యూరీ అవార్డు అనుష్కను వరించడం గమనార్హం. అలాగే, అనుష్కకు ఉత్తమ కథానాయికగా ఈ చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డు లభించడం కూడా గొప్ప విషయమే.

avataram-movie

రాధిక కుమారస్వామి (అవతారం) – కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఆఖరి తెలుగు చిత్రం “అవతారం”. ఇందులో ఓ వైవిధ్యమైన పాత్ర పోషించిన నటి రాధిక కుమారస్వామికి కూడా మంచి పేరు వచ్చింది.

ఈ చిత్రాలలో కథానాయికలే కాక.. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన “లాఠీఛార్జీ” చిత్రంలో రోజా, “భారతం” చిత్రంలో సితార, “త్రినేత్రం” చిత్రంలో రాశి, “పుట్టింటి రా చెల్లి” చిత్రంలో మధుమిత మొదలైన వారు తమ పాత్రలకు మంచి పేరే పొందారు. ఈ క్రమంలో మనం కూడా.. తమ సినీ కెరీర్‌లో వైవిధ్యమైన స్త్రీ పాత్రలకు రూపకల్పన చేసిన దర్శకుల సరసన కోడి రామకృష్ణకి ఒక ప్రత్యేకమైన చోటుంటుందని ఘంటాపథంగా చెప్పవచ్చు.

ADVERTISEMENT

ఇవి కూడా చదవండి

స్త్రీల ఆత్మగౌరవానికి.. అభ్యున్నతికి పెద్దపీట వేసిన “కళా తపస్వి” చిత్రాలు..!

దేశాంతర వివాహాలు చేసుకున్న.. మన క‌థానాయిక‌లు వీరే..!

తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించిన.. యూట్యూబ్ ఛాన‌ల్స్ ఇవే..!

ADVERTISEMENT
24 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT