Bigg Boss Telugu 3: అషు రెడ్డి హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవే..?

Bigg Boss Telugu 3: అషు రెడ్డి హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవే..?

"బిగ్ బాస్ తెలుగు 3"లో (Bigg Boss Telugu 3) అయిదవ వారం నామినేషన్ ముగిసింది. ఈ క్రమంలో ఈ వారం ఎలిమినేషన్‌లో భాగంగా అషు రెడ్డి (Ashu Reddy) హౌస్ నుండి బయటకి వచ్చేసింది. ఆమె ఇంటి నుండి వెళ్ళిపోతుందని అందరూ ముందుగానే ఊహించారు. సోషల్ మీడియాలో కూడా ఆమె ఎలిమినేట్ అవుతుందని వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు అందరూ అనుకున్నట్లుగానే ఆమె నిష్క్రమించడం జరిగింది.

అషురెడ్డి బిగ్ బాస్ ఇంటి నుండి నిష్క్రమించడానికి ప్రధాన కారణాలు 

పెర్ఫార్మెన్స్ విషయంలో అషు రెడ్డి.. ఇంట్లోని సభ్యులతో పోల్చితే కాస్త వెనుకబడి ఉండడం.. అలాగే టాస్క్‌లలో కూడా ఇతర సభ్యులతో సరిగ్గా పోటీ పడలేకపోతుండడం.. అన్నిటికన్నా ముఖ్యంగా "ఆటలో అరటిపండు"లా వ్యవహరించడం ఆమె ఎలిమినేట్ అవ్వడానికి.. ప్రధాన కారణాలని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి   

Bigg Boss Telugu 3: బిగ్‌బాస్ హౌస్‌లోని వెన్నుపోటుదారుల గురించి తెలుసా..?

అయితే ఆమె ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన మిగతా ఇంటి సభ్యుల మాదిరిగా.. బాధపడుతూ ఇంటిని విడిచిపెట్టలేదు. చాలా సంతోషంగా ఇంటి నుండి బయటకి వచ్చింది. తనకి బిగ్ బాస్ హౌస్ చాలా మంచి జ్ఞాపకాలని మిగిల్చింది అని చెబుతూ.. మరలా అవకాశం ఉంటే తప్పనిసరిగా బిగ్ బాస్ హౌస్ లో ఇంకాస్త తెలివితేటలు ప్రదర్శిస్తానని.. అలాగే పట్టుదలతో గేమ్ ఆడతానని చెప్పింది.

అలాగే మిగిలిన ఇంటి సభ్యులలో.. ఎవరెవరు ఇంటిలో కొనసాగాలి? ఎవరు ఎలిమినేట్ అవ్వాలి? అని నాగార్జున ఇచ్చిన టాస్క్‌లో.. తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా.. కంటెస్టెంట్స్ ఫోటోలని పగలగొట్టి మరీ చెప్పింది అషు రెడ్డి.

అషు రెడ్డి అభిప్రాయం ప్రకారం ఇంట్లో కొనసాగడానికి అర్హత ఉన్న వ్యక్తులు వీరే - శివజ్యోతి, శ్రీముఖి, పునర్నవి, బాబా భాస్కర్, రవికృష్ణ, అలీ రెజా, వరుణ్ సందేశ్.

అలాగే ఆమె అభిప్రాయం ప్రకారం ఇంట్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తులు - మహేష్ విట్టా, రాహుల్ సిప్లిగంజ్, వితిక 

అయితే అషు రెడ్డి పెట్టిన ఈ చిచ్చు.. మరోసారి ఇంటి సభ్యుల మధ్య గొడవలు క్రియేట్ చేసే అవకాశం లేకపోలేదని పలువురు అంటున్నారు.

ఇదిలావుండగా.. నిన్నటి ఎపిసోడ్‌లో అషురెడ్డి ఎలిమినేషన్ కాకముందే.. చాలా ఫన్నీ టాస్క్‌లు కూడా జరిగాయి. అందులో ఒకటి మాస్క్ టాస్క్.. ఈ టాస్క్‌లో ఇంటి కెప్టెన్ అయిన శివజ్యోతి.. బాక్స్‌లోని వివిధ మాస్క్‌లని ఇంటి సభ్యులకి పెట్టాలి. వారు ఆ మాస్క్‌కి తగట్టుగా వచ్చే పాటకి డ్యాన్స్ వేయాలి. అయితే ఈ సందర్భంగా బాబా భాస్కర్‌‌కి రెండు మాస్క్‌లు రావడం విశేషం. మిగతా ఇంటి సభ్యులకి మాత్రం ఒక్కొక్కటే రావడం జరిగింది.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 : అలీ రెజా Vs మహేష్ విట్టా & శ్రీముఖి Vs రాహుల్ సిప్లిగంజ్

ఆ తరువాత రోల్ ప్లే టాస్క్‌లో భాగంగా.. ఇంటి సభ్యులలో ఇద్దరిద్దరిని.. ఒక జంటగా విడదీశారు. ఈ ప్లేలో ఒక వ్యక్తి అవతలి వ్యక్తిలా ఫన్నీగా మాట్లాడాలి.  ఈ టాస్క్‌లో చాలా సరదాగా సాగిపోయింది.  ఇలా బిగ్ బాస్ హౌస్‌లో అయిదవ వారం ముగిసింది.

ఈరోజు ఆరవ వారం ప్రారంభమవుతుండగా.. ప్రతి సోమవారం లాగే ఈరోజు కూడా బిగ్ బాస్ ఇంటిలో నామినేషన్స్ ప్రక్రియ ఉండబోతుంది. దీనిపై అప్పుడే చర్చ కూడా మొదలైంది. అయితే ఈ సారి ఎక్కువ నామినేషన్స్ పొందే వ్యక్తులు - పునర్నవి & వితిక మాత్రమే అనే పలు సోషల్ మీడియా సర్వేలు చెప్పడం విశేషం. 

ఎందుకంటే.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సభ్యులందరూ మంచి పోటీ ఇచ్చే సత్తా ఉన్న వారే. అలాగే ఇప్పుడు ఇంటి సభ్యులలో.. ఎవరు హౌస్‌ని విడిచిపెట్టి వెళతారు అనే విషయాన్ని సులువుగా చెప్పే పరిస్థితులు లేవు.

అందుకోసమే ... బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఈ వారం  చాలా ఆసక్తికరంగా మారనుంది. చూడాలి.. వచ్చే వారం నుండి ఎటువంటి ఆసక్తికర పరిణామాలు మనం చూడాల్సి వస్తుందో...

బిగ్‌బాస్ తెలుగు 3 : బిగ్‌బాస్ ఇంటిలో సీక్రెట్ వీడియోస్ రేపిన చిచ్చు!