సమంత అభిమానులను అలరించడానికి.. "ఓ బేబీ" టీజర్ వచ్చేసింది

సమంత అభిమానులను అలరించడానికి.. "ఓ బేబీ" టీజర్ వచ్చేసింది

టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత అక్కినేని (Samantha Akkineni) అభిమానులకు ఇక పండగే. వారు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఓ బేబీ’ టీజర్.. ఓ గంట క్రితమే విడుదలైంది. ఈ చిత్రంలో సమంత ప్లేబ్యాక్ సింగర్ పాత్రలో నటించడం విశేషం. కామెడీ, ఫన్, ఇమోషన్స్ కలగలిపిన చిత్రంగా.. ‘ఓ బేబీ’ని (Oh Baby) అభివర్ణిస్తూ ఇటీవలే ఈ సినిమా దర్శకులు పేర్కొన్నారు.


ఇదే చిత్రంలో సీనియర్ నటి లక్ష్మి కూడా ఓ ప్రధాన పాత్రను పోషించడం విశేషం. కొరియన్‌ చిత్రం ‘మిస్ గ్రానీ’కి తెలుగు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తీశారని సమాచారం. నాగశౌర్య,  రావు రమేశ్‌, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్‌ ముఖ్య పాత్రలను పోషిస్తున్న.. ఈ సినిమా ఫస్ట్ లుక్‌‌ను మంగళవారమే సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.'అలా మొదలైంది' చిత్రంతో డైరెక్టర్‌గా మారిన నందినిరెడ్డి ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తుండగా..  రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు. లక్ష్మీ భూపాల సంభాషణలు అందిస్తుండగా.. వివేక్ కూచిభొట్ల, వంశీ భండారు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


ఈ  సినిమా టీజర్‌ను బట్టి చూస్తే.. ఈ సినిమా అంతా కూడా.. సమంత, లక్ష్మి పాత్రల చుట్టూనే తిరుగుతుందని అనిపించక మానదు. ‘నా పేరు సావిత్రి.. చిన్నప్పుడు అందరూ నన్ను  భానుమతిలా ఉన్నావు అనేవాళ్లు’ అంటూ సీనియర్ నటి లక్ష్మి డైలాగ్‌తోనే ఈ సినిమా టీజర్ మొదలవుతుంది.


 


అలాగే మరో సన్నివేశంలో ‘మీకు బాయ్‌ఫ్రెండ్‌ ఎవరూ లేరుకదా?’ అని సమంతను నాగశౌర్య ప్రశ్నిస్తే.. ‘హా.. నేను మంచి వయసులో ఉన్నప్పుడే మా ఆయన పోయాడు. అప్పటికే  నానిగాడు పుట్టేశాడు. ఇంకా పెళ్లి, పెటాకులు ఎందుకని వాణ్ణి పెంచి, పెద్ద చేశా. వాడు పెళ్లి చేసుకుని ఇద్దర్ని కన్నాడు, వాళ్లు కూడా పెళ్లీడుకొచ్చేశారు.. నాకు వయసు అయిపోయింది’ అని ఆమె చెప్పే డైలాగ్‌కి శౌర్య పగలబడి నవ్వడం గమనార్హం. అలాగే చివరి సన్నివేశంలో ‘నాతో ఎంజాయ్‌మెంట్‌ మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి.. చూస్తారు గా..’ అని సమంతతో చాలా వెరైటీ డైలాగ్ చెప్పించారు దర్శకులు.


ఇప్పటికే మజిలీ, యూటర్న్, మహానటి.. లాంటి చిత్రాలలో సమంత మంచి ఫెర్ఫార్మర్‌గా పేరు తెచ్చుకుంది. అలాంటి సమంతతో పూర్తిస్థాయి ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రాన్ని తీయడానికి దర్శకురాలు సంకల్పించడం మంచి పరిణామమే. అనుష్క ఇప్పటికే సైజ్ జీరో, భాగమతి లాంటి ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రాలలో తనదైన శైలిలో రాణించారు.


కాజల్ కూడా ఇటీవలే "సీత" అనే సినిమాలో నటించారు. నయనతార (అనామిక), ఛార్మి (మంత్ర) మొదలైనవారు కూడా తమను తాము ప్రూవ్ చేస్తుకున్నారు. ఈ క్రమంలో ఈ స్టార్ హీరోయిన్ల మాదరిగా సమంత కూడా ఓ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీకి సైన్ చేయడం విశేషమే. 


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ


క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.


ఇవి కూడా చదవండి


"చైతూకి నాపై ఉన్న కంప్లైంట్.. అదొక్కటే" : సమంత


స్నేహితురాలి పెళ్లిలో.. సమంత సందడి చూశారా?


మజిలీ సినిమాతో అబ్బాయిలందరికీ.. ఓ డ్రీమ్ వైఫ్ దొరికేసింది..!