అందాల బుజ్జి పాపకు జన్మనిచ్చిన.. సమీరా రెడ్డి..!

అందాల బుజ్జి పాపకు జన్మనిచ్చిన.. సమీరా రెడ్డి..!

సమీరా రెడ్డి (sameera reddy).. 34 సంవత్సరాల ఈ అందాల నటి మార్చిలో తాను తల్లి కాబోతున్నానని ప్రకటించినప్పటి నుంచి.. ప్రతి విషయమూ పెద్ద వార్తగానే మారిపోయింది. బాడీ పాజిటివిటీ విషయంలో ఎంతో మందికి స్పూర్తినిస్తూ తాను గర్భంతో ఉన్న ఫొటోలను మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకూ పోస్ట్ చేస్తూ వచ్చింది సమీర. ఇప్పుడు అందాల బుజ్జి పాపకు (Baby girl) అమ్మయింది. తాను కోరుకున్నట్లే కూతురికి జన్మనిచ్చిన సమీర.. ఈ ఆనందాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

బాడీ పాజిటివిటీని ప్రమోట్ చేస్తూ కేవలం రెండు రోజుల క్రితమే మేకప్ లేకుండా వీడియో తీసి #imperfectlyperfect అనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేసిన సమీర.. నిన్న రాత్రి ముంబైలోని బీమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చేరింది. ఈ రోజు ఉదయం ముద్దుల పాపాయికి జన్మనిచ్చినట్లు ఆమె ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

దాంతో పాటు తన పాప చేతిని.. తన చేత్తో పట్టుకున్న ఫొటొను కూడా షేర్ చేసింది. "మా లిటిల్ ఏంజెల్.. మా కూతురు ఈ ఉదయం మా దగ్గరకు వచ్చేసింది. అందరికీ మీరు చూపించిన ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.." అంటూ పోస్ట్ చేసింది సమీర. తల్లీ, బిడ్డ ఆరోగ్యం నిలకడ ఉన్నట్లు ఆ ఆసుపత్రి వర్గాలు కూడా ప్రకటించాయి.

అండర్ వాటర్ ఫొటోషూట్‌తో.. అబ్బురపరుస్తోన్న సమీరా రెడ్డి..!
Instagram

గర్భం ధరించిన మొదటి రోజు నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న సమీర.. తన ఫోటోలను షేర్ చేస్తూ వచ్చింది. తాజాగా విడుదల చేసిన వీడియోలో గర్భం ధరించడంలోని అసలు ఆనందాన్ని ప్రకటించింది సమీర.

అందులో "సూపర్ మామ్, సూపర్ వుమన్..నేను రియల్‌గా ఇలాగే ఉంటాను. మేకప్, డ్రామా లాంటివేవీ లేకుండా.. గతంలో నేను ఎలా కనిపిస్తున్నానో అని చాలా బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు. మనం ఎలా ఉన్నా దాన్ని కవర్ చేసుకోకుండా దాన్ని మరింత అద్భుతంగా కనిపించేలా చేద్దాం. నేను అలాగే చేశాను. పాజిటివిటీని ఎంచుకున్నా. నన్ను నేను ఎలా ఉన్నానో అలా ఒప్పుకున్నా. ఎందుకంటే మనమంతా #imperfectlyperfect .. అంటూ వీడియోలో చెప్పింది సమీర.

అమ్మతనంలోని ఆనందం ఇదే.. తన సీమంతం ఫోటోలు షేర్ చేసిన సమీరారెడ్డి

దీన్ని షేర్ చేస్తూ.." నిజంగా నేను ఇలాగే ఉంటాను. ప్రసవానికి చాలా దగ్గరగా ఉన్నా.. నా శరీరం ఎలా ఉందని నేను అస్సలు బాధపడను. ఎందుకంటే నేను తిరిగి అందంగా మారతానని నాకు నమ్మకం ఉంది. ఒకవేళ మారకపోయినా ఇతరులు ఏమంటున్నారు అని నా గురించి నేను తప్పుగా ఆలోచించడం నేను చేయను. నేను మేకప్ లేకుండా ఎలా ఉంటానో షేర్ చేయాలనిపించింది. ఉదయం లేవగానే నేను ఇలాగే ఉంటాను. మన జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనది మనం ఎలా ఉన్నామో దాన్ని గుర్తించి.. మనల్ని మనం ప్రేమించడం.. నేను అదే చేస్తున్నా" అంటూ పోస్ట్ చేసింది.

మీ ట్రోలింగ్ కోసం నా లైఫ్‌స్టైల్ మార్చుకోను.. అంటోన్న స‌మీర‌..!
Instagram

అంతకుముందు గర్భం ధరించిన తర్వాత దాన్ని ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ అండర్ వాటర్ ఫొటోషూట్ని కూడా సమీర నిర్వహించడం విశేషం. ఈ ఫొటొషూట్లో భాగంగా ఆకుపచ్చ, గులాబీ రంగుల బికినీ వేసుకొని చున్నీలు పట్టుకొని నీటి అడుగున ఫొటోలు దిగి వాటిని షేర్ చేసింది సమీర.

తన ప్రెగ్నెన్సీ సందర్భంగా "సోషల్ మీడియాలో అందరూ అందంగా ఉంటారు. మనం ఉన్న తీరును, మనల్ని మనం ప్రేమించుకోవాలి. అప్పుడే మిగిలిన వారు ప్రేమిస్తారుష అంటూ అవగాహన పెంచే ప్రయత్నం చేసింది సమీర. అంతేకాదు.. ప్రెగ్నెన్సీ ఫొటోలు షేర్ చేసినందుకు ట్రోల్ చేసిన చాలామందికి దిమ్మదిరిగే సమాధానం కూడా చెప్పింది.

2014 జనవరిలో ప్రముఖ వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను వివాహమాడింది సమీర. మహారాష్ట్రియన్ పద్ధతిలో జరిగిన ఈ పెళ్లికి అక్షయ్ బైక్ పై రావడం అప్పట్లో అందరినీ ఆకర్షించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె 2015లో ఓ బాబుకి జన్మనిచ్చింది.

రెండోసారి తల్లిదండ్రులైన సమీర, అక్షయ్‌ల జంటకు మనం కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్పేద్దాం.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.