ADVERTISEMENT
home / Fitness
బర్త్ డే గర్ల్ శిల్పా శెట్టి అంత అందంగా, ఫిట్‌గా ఉండేందుకు కారణాలేంటో మీకు తెలుసా?

బర్త్ డే గర్ల్ శిల్పా శెట్టి అంత అందంగా, ఫిట్‌గా ఉండేందుకు కారణాలేంటో మీకు తెలుసా?

శిల్పా శెట్టి (Shilpa shetty).. బాలీవుడ్ అందాల బ్యూటీ. అద్భుతమైన నటనతో పాటు అందమైన చర్మం, నాజూకైన శరీరం (fit body) ఆమె సొంతం. ఇటీవలి కాలంలో సినిమాల్లో కనిపించకపోయినా.. వివిధ షోలు, ఫంక్షన్లలో పాల్గొంటూ.. తన ఫిట్‌నెస్‌తో ప్రతి ఒక్కరి మనసుల్లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది శిల్ప. అందుకే 44 సంవత్సరాల వయసులోనూ ఎంతో ఆనందంగా, యాక్టివ్‌గా కనిపిస్తోందీ అందాల రాశి. మరి, 44 ఏళ్ల వయసులోనూ ఈ బర్త్ డే బ్యూటీ ఇంత అందంగా ఎలా ఉండగలుగుతోంది.. తన అందమైన నాజూకైన శరీరానికి తను పాటించే చిట్కాలేంటి? మనమూ తెలుసుకుందాం రండి.

sh2 2065386

శిల్ప తన కెరీర్‌ని బాజీఘర్ సినిమాతో ప్రారంభించింది. తను కెరీర్ ప్రారంభించి ఇరవై ఆరేళ్లు అయినా తన ఫిజిక్‌ని ఆమె చక్కగా మెయింటైన్ చేయడం విశేషం. ఈ బోల్డ్ బ్యూటీ తన ఫిజిక్‌ని అంత అద్భుతంగా మలచుకోవడానికి ముఖ్య కారణం యోగా.

ఆమెకు కొన్ని సంవత్సరాల క్రితం ఓసారి మెడనొప్పి వచ్చినప్పుడు.. దాని నివారణకు యోగా చేయమని ఫిజియోథెరపిస్ట్ చెప్పారట. ఆ తర్వాత నొప్పి తగ్గాక కూడా.. అదే యోగాను కొనసాగిస్తూ వచ్చింది శిల్ప. అష్టాంగ యోగా, ప్రాణాయామం నేర్చుకొని.. తర్వాత అందరికీ నేర్పేందుకు ఆడియో విజువల్ సీడీలు కూడా విడుదల చేసింది.

ADVERTISEMENT

ఈ సీడీలను డబ్బు కోసం కాకుండా.. అందరికీ యోగాపై అవగాహన పెంచేందుకు తక్కువ ధరకే విడుదల చేసింది. యోగా మాత్రమే తన ఫిట్‌నెస్‌కి కారణమని శిల్ప చాలాసార్లు చెప్పింది. ప్రసవం తర్వాత కూడా ఆమె సైక్లింగ్, వాకింగ్ లాంటి చిన్న వ్యాయామాలతో ప్రారంభించి కసరత్తులు చేసింది. అలా పది నెలల్లోనే గర్భం సమయంలో తను పెరిగిన.. 20 కేజీలు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది.

శిల్ప పాటించే వర్కవుట్ ప్లాన్, మీల్ ప్లాన్‌తో పాటు.. ఆమె సౌందర్య రహస్యాలు తెలుసుకోవాలనేది ప్రతి అమ్మాయి కోరిక. వాటిని ఫాలో అవుతూ తామూ ఆమెలా నాజూగ్గా, మెరుపుతీగలా, దేవకన్యలా కనిపించాలని కోరుకోవడమూ సహజమే. ఈ  క్రమంలో మనం కూడా.. ఆ సాగర కన్య వర్కవుట్, ఆహారపు అలవాట్లు, బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకుందాం రండి.

శిల్ప డైట్ ప్లాన్

ఏ వ్యక్తి అయినా ఆరోగ్యంగా, నాజూగ్గా ఉండాలంటే దానికి ముఖ్య కారణం డైట్. శిల్ప ఈ విషయాన్ని బాగా నమ్ముతుంది. అందుకే రోజూ కేవలం 1800 క్యాలరీలు అందించే ఆహారాన్నే తీసుకుంటుంది.  ఉదయాన్నే కలబంద రసం లేదా ఉసిరికాయ రసంతో తన రోజును ప్రారంభిస్తుంది శిల్ప. ఆ తర్వాత కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతుంది. బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా ఓట్స్‌తో చేసిన కిచిడీ, బ్రౌన్ షుగర్ వేసిన టీ తీసుకుంటుంది.

మధ్యాహ్న భోజనంలో బ్రౌన్ రైస్ లేదా చపాతీ తినడానికి శిల్ప ఆసక్తి చూపుతుంది. ఇందులోకి పప్పు, చికెన్ కర్రీ, ఉడికించిన లేదా పచ్చి కూరగాయలు తీసుకుంటుంది. వీటిని కూడా ఆలివ్ ఆయిల్‌‌తో వండుకొని తీసుకుంటుంది.  వర్కవుట్ తర్వాత ప్రొటీన్ షేక్, కిస్ మిస్‌లు, ఖర్జూర పండ్లు తీసుకుంటుంది. సాధారణంగా ఆమె మీల్స్ మధ్యలో స్నాక్స్ తినడానికి ఆసక్తి చూపించదు. కానీ ఎప్పుడైనా ఆకలి వేస్తే నట్స్ తీసుకుంటుంది. ఆమె బ్యాగ్‌లో ఎప్పుడూ ఏవో ఒక పండ్లు, కొన్ని నట్స్ అందుబాటులో ఉంటాయి.

ADVERTISEMENT

ఇక రాత్రి ఎనిమిది లోపే శిల్ప తన డిన్నర్ పూర్తి చేస్తుంది. పడుకోవడానికి మూడు గంటల ముందు డిన్నర్ చేయడం వల్ల జీర్ణ క్రియ సజావుగా సాగుతుంది. రాత్రి డిన్నర్‌లో భాగంగా సలాడ్, సూప్, చికెన్ లేదా చేపతో తయారుచేసిన వంటకాలు ఉంటాయి.

వారంలో ఆరు రోజుల పాటు.. ఇలా నియమాలు పాటించే శిల్ప ఆదివారం రోజు మాత్రం తనకు నచ్చిన ఆహారం తీసుకుంటుంది. ఆమె సోషల్ మీడియా ఛానల్స్‌లో ఇలాంటి సండే బింజ్‌  వీడియోలు మనం చాలా వరకూ చూడొచ్చు.

వర్కవుట్ ఇలా..

కేవలం సరైన ఆహారం తీసుకోగానే సరిపోదు. తగినంత వ్యాయామం కూడా చేయాలి. అప్పుడే అందమైన ఫిగర్ కొనసాగించే వీలుంటుంది. దీనికోసం శిల్ప వారానికి రెండు రోజులు యోగా, ప్రాణాయామం, ధ్యానం చేస్తుంది. మరో రెండు రోజుల పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్ సైజులు చేసే ఆమె.. ఇంకో రెండు రోజుల పాటు కార్డియో వ్యాయామాలు చేస్తుంది. ఈ వ్యాయామాలు చాలా కఠినంగా ఉంటాయి. ఆమె చేసే హెవీ వెయిట్ ఎక్సర్ సైజులు చాలా ఎక్కువ బరువుతో ఉండడం వల్ల.. అవి ఆమె కండరాలకు మంచి షేప్‌ను ఇచ్చేందుకు తోడ్పడుతున్నాయి.

sh1 1463922

శిల్ప అందమైన చర్మానికి చిట్కాలు..

కేవలం నాజూకైన శరీరమే కాదు.. వయసును దాచిపెట్టే శిల్ప అందమైన మెరిసే చర్మం అంటే కూడా అందరికీ ఇష్టమే. దీనికి ఆమె వాడే చిట్కాలేంటంటే..

ADVERTISEMENT

రోజూ ఉదయాన్నే తొలుత వేడి నీళ్లతో.. ఆ తర్వాత చన్నీటితో ముఖం కడుక్కొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటుంది శిల్ప.

శిల్ప స్నానానికి సహజమైన స్క్రబ్స్, నలుగుపిండితో పాటు షవర్ జెల్స్ ఉపయోగిస్తూ ఉంటుందట. రాత్రి నిద్రపోయే ముందు తన చర్మాన్ని ఆలివ్ ఆయిల్, బయో ఆయిల్, బేబీ ఆయిల్‌ల మిశ్రమంతో క్లెన్స్ చేసుకొని.. ఆ తర్వాత వేడినీటిలో ముంచిన టవల్‌తో శుభ్రం చేసుకుంటుందట.

రోజూ వీలైనంత ఎక్కువ నీటిని తాగడానికి ఇష్టపడే శిల్ప.. దానివల్లే తన చర్మం అందంగా తేమతో మెరుస్తూ కనిపిస్తుందని చెబుతుంది. అప్పుడప్పుడూ స్పా మసాజ్‌లు కూడా చేయించుకోవడం తనకెంతో ఇష్టం. 

సాధారణంగా మేకప్‌కి దూరంగా ఉండే ఆమె.. ఐలాష్ కర్లర్స్ అంటే మాత్రం ఇష్టపడుతుంది.  తన జుట్టును బ్లోడ్రై చేయడానికి ఆసక్తిచూపించే శిల్ప కర్లింగ్, స్ట్రెయిటెనింగ్ ఇలా దేనికైనా దాన్నే ఉపయోగిస్తుందట.

ADVERTISEMENT

r2

ఇవీ ఈ అందాల రాశి సౌందర్య రహస్యాలు. అయితే బరువు తగ్గడం ఎవరైనా చేయొచ్చని చెప్పే శిల్ప.. దానికోసం ప్రతి ఒక్కరికీ వ్యాయామాల నుంచి వెయిట్ లాస్ రెసిపీల వరకూ విశదీకరించి చెబుతుంది. ఆ టిప్స్ అన్నింటినీ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందిస్తోంది. ఎంతో ఖరీదైన సమాచారాన్ని కూడా ఫ్రీగా అందిస్తూ “అందరినీ ఆరోగ్యంగా చూడడమే తన లక్ష్యం” అనే ఈ అందాల సుందరి పుట్టినరోజు సందర్భంగా మనమూ ఈ ఏజ్ లెస్ బ్యూటీకి హ్యాపీ బర్త్ డే చెప్పేద్దాం.

ఇవి కూడా చదవండి.

ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలని భావించిన ఏక్తా.. సింగిల్‌గా ఎందుకు మిగిలిందో తెలుసా?

ADVERTISEMENT

తారక రాముడి గురించి ఈ విశేషాలు మీకు తెలుసా? (ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్)

బరువు తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఇంటి చిట్కాలు పాటించండి

07 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT