విజువల్ మ్యాజిక్ చేసే శంకర్.. మెగాస్టార్‌తో మరో వండర్ క్రియేట్ చేస్తారా?

విజువల్ మ్యాజిక్ చేసే శంకర్.. మెగాస్టార్‌తో మరో వండర్ క్రియేట్ చేస్తారా?

దర్శకుడు శంకర్(Shankar).. ఈ పేరు చెబితే మన కళ్ళ ముందు జెంటిల్ మేన్, జీన్స్ లాంటి చిత్రాలతో పాటు.. రోబో, ఐ,  2.0 లాంటి విజువల్ వండర్స్ మన మనసులో మెదలడం ఖాయం. ఇవే కాదు.. భారతీయుడు, ఒకేఒక్కడు, అపరిచితుడు, శివాజీ లాంటి సామాజిక అంశాల నేపథ్యంగా‌ తెరకెక్కిన చిత్రాలూ కనిపిస్తాయి.


శంకర్ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. శంకర్ నుంచి వచ్చే సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని సగటు సినీ ప్రేక్షకుడు సైతం ఎదురు చూస్తుంటాడు. వాస్తవానికి ఇండియన్ సినిమా స్క్రీన్ కు భారీ హంగులను పరిచయం చేసింది శంకర్ అనే చెప్పుకోవాలి.


అలాంటి వైవిధ్యమైన దర్శకుడు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో(Chiranjeevi) కలసి సినిమా రూపొందించనున్నారనే వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవితో కథాపరమైన చర్చలు కూడా శంకర్ పూర్తి చేశారనే వార్తలు ఫిలింనగర్ వర్గాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ భారీ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించబోతున్నారట.
 

 

 


View this post on Instagram


A couple of pictures for you from #KhaidiNo150 look test!


A post shared by Konidela Production Company (@konidelapro) on
ప్రస్తుతం శంకర్ భారతీయుడు - 2 చిత్ర షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో విశ్వనటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తోన్న విషయం మనకు తెలిసిందే. చిరంజీవి కూడా ‘సైరా’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో నటించనున్నారు. ఇది కూడా పూర్తయ్యాక శంకర్ దర్శకత్వంలో నటించనున్నారని సమాచారం.


ఈ రెండు చిత్రాలు పూర్తయ్యేనాటికి శంకర్ సైతం భారతీయుడు - 2 పూర్తి చేసేస్తారు. ఆ తర్వాత చిరంజీవితో కలసి చేసే ప్రాజెక్ట్ కోసం కథ సిద్ధం చేయనున్నారట. అంతేకాదు.. ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించనున్నారనే మరో వార్త సైతం తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది. 
 

 

 


View this post on Instagram


A post shared by Shankarshanmugham (@director.shankar) on
శంకర్ భారీ చిత్రాల దర్శకుడు.. మెగాస్టార్ మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుడు.. అల్లు అరవింద్ మంచి అభిరుచి ఉన్న నిర్మాత.. ఈ ముగ్గురి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


మెగాస్టార్‌తో శంకర్ సినిమా గురించి ప్రస్తుతం స్పష్టత రానప్పటికీ.. అభిమానులు మాత్రం ఈ కాంబినేషన్లో సినిమా రావాలని బలంగా కోరుకొంటున్నారు. గతంలో సైతం తనకు శంకర్ దర్శకత్వంలో నటించాలనుందని చిరు కొన్ని సందర్భాల్లో తన మనసులోని మాటను చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రవార్త ప్రస్తుతం అందరి చూపునీ తనవైపు తిప్పుకొంటోంది.


ఇవి కూడా చదవండి


కొరటాల దర్శకత్వంలో చిరంజీవి.. త్వరలో షూటింగ్ ప్రారంభం


రామ్ చరణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


మన్మథుడు కుటుంబంతో సహా వచ్చేశాడు.. ఈయన కుటుంబం చాలా పెద్దదే సుమా


అద్భుత‌మైన వార్త‌.. ఇప్పుడు POPxo షాప్ ఓపెన్ అయింది. చ‌క్క‌టి మ‌గ్స్, ఫోన్ క‌వ‌ర్స్‌, కుష‌న్స్‌, లాప్‌టాప్‌స్లీవ్స్ ఇంకా మ‌రెన్నో ఇక్క‌డ 25 శాతం డిస్కౌంట్‌తోనే ల‌భిస్తున్నాయి. POPXOFIRST అనే కూప‌న్ కోడ్‌ని ఉప‌యోగించండి. దీంతో మ‌హిళ‌ల‌కు ఆన్‌లైన్ షాపింగ్ ఎంతో సులువైపోతుంది.


మీరు సోషల్ మీడియాలో రాక్ స్టార్‌గా వెలిగిపోతున్నారా? అయితే Plixxo లో వెంటనే చేరిపోండి. ఇండియాలోనే అతి పెద్ద ఇన్‌ఫ్లూయెన్సర్ నెట్‌వర్కులో చేరి.. టాప్ బ్రాండ్స్‌తో కలసి పనిచేసే అవకాశం అందుకోండి.