"పడి పడి లేచే మనసు" అంటూ.. ఓ సరికొత్త పాత్రలో కనువిందు చేస్తున్న సాయి పల్లవి

 "పడి పడి లేచే మనసు" అంటూ..  ఓ సరికొత్త పాత్రలో కనువిందు చేస్తున్న సాయి పల్లవి

సాయి పల్లవి (Sai Pallavi) ఫిదా సినిమాలో హీరోతో ఒక డైలాగ్ చెబుతుంది.. నేను "ఒక్కటే పీస్" అని. అది నిజమేనేమో.. ఎందుకోగాని సాయి పల్లవిని చూసినప్పుడల్లా మనకి ఎవరో ఒక స్పెషల్ అమ్మాయిని చూస్తున్న ఫీలింగ్ మాత్రం కలుగుతుంటుంది. ఇప్పటికే మిడిల్ క్లాస్ అబ్బాయి, ఫిదా, కణం మొదలైన తెలుగు చిత్రాల్లోనూ... అలాగే కలి, ప్రేమమ్ లాంటి మలయాళ సినిమాలలోనూ నటించి .. దక్షిణాదిలో మంచి పాపులారిటీ తెచ్చుకున్న కథానాయికగా సాయి పల్లవి అందరికీ సుపరిచితమే. కొద్ది గంటల క్రితమే విడుదలైన "పడి పడి లేచే మనసు" (Padi Padi Leche Manasu) సినిమా ట్రైలర్ లో సాయి పల్లవి మరోసారి తన అభినయంతో అందరిని సమ్మోహితులని చేసేసింది.


తనదైన స్వరంతో, ముఖకవళికలతో, ఎమోషనల్ సన్నివేశాలలో సాయి పల్లవి తన యాక్టింగ్ స్కిల్స్ చూపించింది. మరోసారి తాను ఎంత స్పెషల్ అనేది ప్రూవ్ చేసుకుంది. "పడి పడి లేచే మనసు" చిత్రం కోల్ కత్తాలో చిత్రీకరణ జరపుకోగా.. మనకి బెంగాలీ అమ్మాయిగా ఈ సినిమాలో సాయి పల్లవి కనిపిస్తోంది. బెంగాలీ అమ్మాయి పాత్రలో కూడా ఇప్పటికే సాయి పల్లవి అదుర్స్ అనిపించేస్తుంది.


ఇప్పటికే తెలుగులో తనకంటూ ఒక మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సాయి పల్లవికి ఈ సినిమా అదనపు మైలేజ్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సాయి పల్లవి గత చిత్రాలలో కొన్ని పరాజయం పాలైనప్పటికీ కూడా ఆమెకి ఇక్కడ ఉన్న అభిమానం ఏమాత్రం కూడా తగ్గలేదు అన్నది అక్షరసత్యం.


ఫిదా (Fidaa) సినిమా తరువాత మరోసారి ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో రాబోతున్న సాయి పల్లవికి ఈ చిత్రం మరో ఫిదా అవ్వనుంది అని ఆమె అభిమానులు ఇప్పటినుండే ఫిక్స్ అయిపోతున్నారు.


ఈ చిత్రంలో హీరోగా శర్వానంద్ (Sharwanand) కూడా తన మార్క్ ప్రతిభని చాటుకున్నాడు. ఒక ప్రేమికుడిగా , తాను ప్రేమించిన అమ్మాయి కోసం తపించే ఒక అబ్బాయిగా ట్రైలర్ లో మనకి కనిపిస్తాడు. హృద్యమైన ప్రేమ కథలని తెరకెక్కించే హను రాఘవపూడి (Hanu Raghavapudi) మరోసారి తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తీసినట్టు మనకు విడుదలైన ట్రైలర్ ని చూస్తే అర్ధమైపోతుంది.


ఇక ఈ చిత్రం సాయి పల్లవి కెరీర్ లో నిలిచిపోయే చిత్రమవుతుందా? లేదా? అనేది తేలాలంటే ఈ నెల 21 వరకు ఆగాల్సిందే!