"బిగ్ బాస్ తెలుగు సీజన్ 3"లో.. ఇంటి తొలి మహిళా కెప్టెన్‌గా శివజ్యోతి ..!

"బిగ్ బాస్ తెలుగు సీజన్ 3"లో.. ఇంటి తొలి మహిళా కెప్టెన్‌గా శివజ్యోతి ..!

"బిగ్ బాస్ తెలుగు సీజన్ 3"కి (Bigg Boss Telugu) సంబంధించి హౌస్‌కి మూడవ కెప్టెన్‌గా.. అలాగే తొలి మహిళా కెప్టెన్‌గా శివజ్యోతి ఎంపికయ్యింది. నిన్న జరిగిన "పంతం నీదా నాదా" అనే కెప్టెన్సీ టాస్క్‌లో వితిక (Vithika) , శివ జ్యోతిలు పోటీపడగా.. అందులో శివజ్యోతి ( Shivajyothi ) విజయం సాధించింది. అసలు ఆ టాస్క్ వివరాల్లోకి వెళితే.. ఈ ఇద్దరిని క్రేన్స్ సహాయంతో గాలిలోకి పైకి తీసుకెళ్లి... వారికి రోప్స్ కట్టడం జరిగింది.

ఈ ఇద్దరు పోటీదారులకు మద్దతిస్తూ హౌస్‌మేట్స్ రెండు టీమ్స్‌గా విడిపోయారు. వీరు రోప్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ.. తాము మద్దతిచ్చే పార్టిసిపెంట్స్ కిందకి రాకుండా చూడాలి. అయితే ఈ టాస్క్ మొదలైన కొద్దిసేపటికే..  గాలిలో వేలాడిన పార్టిసిపెంట్స్ ఇద్దరూ చాలా ఇబ్బందులే ఎదుర్కొన్నారు. అప్పటివరకు మద్దతుదారులు బ్యాలెన్స్ చేయడం మాత్రమే ఈ టాస్క్‌‌లో ముఖ్యం అనుకోగా... గాలిలో వేలాడుతున్న ఈ ఇద్దరు ఎంత సేపు అలా ఉండగలరు అన్నది అసలైన టాస్క్‌గా మారింది. 

బిగ్‌బాస్ తెలుగు యాంకర్ నాగార్జున చేతిలో ఉన్న.. పండు (కోతి) బొమ్మ మీకు కావాలా?

అయితే ఈ ఇద్దరిలో వితిక ముందుగా.. "ఇక నేను గాలిలో అలా ఉండలేను" అని చెప్పి కిందకి రావడం జరిగింది. దీనితో మరొక కంటెస్టెంట్ శివజ్యోతిని కెప్టెన్‌గా బిగ్ బాస్ ప్రకటించారు. అలా ఈ సీజన్‌కి గాను తొలి మహిళా కెప్టెన్‌గా సావిత్రక్క అలియాస్ శివజ్యోతి ఎంపిక కావడం జరిగింది. ఈ టాస్క్‌లో భాగంగా వితికకి - రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి, వరుణ్ సందేశ్, మహేష్ విట్టాలు మద్దతు తెలపగా.. శివజ్యోతికి - అలీ రెజా, ఆషు రెడ్డి, హిమజ, రవికృష్ణలు మద్దతు పలికారు. 

ఇదిలావుండగా.. మొన్న నామినేషన్స్‌లో భాగంగా ఇంటి కెప్టెన్ అయిన అలీ రెజా.. బాబా భాస్కర్‌‌ని నేరుగా నామినేషన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ  నేపథ్యంలో దానికి సంబంధించి వారిరువురికి సంభాషణ జరుగుతున్న క్రమంలో.. మహేష్ విట్టా తన అభిప్రాయం తెలిపారు.

అప్పుడే అనుకోకుండా గొడవ మొదలైంది. "అనవసరంగా మా మధ్య నువ్వు పుల్లలు పెడుతున్నావు" అని మహేష్ విట్టాని అలీ రెజా అనడంతో.. వారి ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ ఇరువురిని.. మిగతా సభ్యులు ఆపడంతో ఇద్దరూ శాంతించారు. 

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 : అలీ రెజా మోసం చేశాడని.. కంటితడి పెట్టిన బాబా భాస్కర్ ..!

ఇక ఇలా 'పుల్లలు పెడుతున్నావు' అని ఇంకొకసారి ఎవరైనా అంటే.. తాను ఊరుకునేది లేదని తెలిపాడు మహేష్. అలాగే తన వల్ల ఇంట్లో ఎవరు గొడవపడ్డారో చెప్పిన తరువాత మాత్రమే.. ఇటువంటి కామెంట్స్ చేస్తే మంచిది అంటూ కాస్త గంభీరంగానే చెప్పాడు. అలా బాబా భాస్కర్ నామినేషన్ విషయంలో.. బిగ్ బాస్ హౌస్‌కి సంబంధించి కాస్త హాట్ హాట్ చర్చ జరగగా..

చివరికి రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ - "మీరు ఈ నామినేషన్ విషయమై అంతగా ఇబ్బంది పడక్కర్లేదు, ఎందుకంటే నన్ను 8 మంది సభ్యులు.. ఇంటి నుండి వెళ్ళడానికి నామినేట్ చేశారు. దానికి నేనెంతలా బాధపడాలి. అందుకే ఎక్కువగా నామినేషన్స్ గురించి ఆలోచించకండి" అని బాబా భాస్కర్‌కి హితవు పలికాడు.

అలాగే నిన్నటి రోజున.. బిగ్ బాస్ హౌస్‌లో వరుణ్ సందేశ్, వితికల పెళ్లి రోజు సందర్భంగా ఇరువురు దండలు మార్చుకోవడం జరిగింది. ఈ ఇద్దరి పెళ్లి వేడుకలు కూడా.. కోర్ట్ యార్డ్‌లో ఇంటి సభ్యులందరి సమక్షంలో జరిగాయి. బహుశా బిగ్ బాస్ హౌస్‌లో.. ఇలా పెళ్లి రోజు జరుపుకున్న తొలి జంట ఇదే కావొచ్చు. ఇక వచ్చే వారం వరకు కూడా.. ఈ ఇద్దరు బిగ్‌బాస్ హౌస్‌లో తప్పక ఉండనున్నారు. ఆ తరువాత నామినేషన్స్‌ను బట్టి వారి భవితవ్యం తెలుస్తుంది.

బిగ్‌బాస్ తెలుగు: రాహుల్ తప్ప.. అందరూ ఆమె అన్నదమ్ములేనట..!