ప్రేమ కోసం ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాను : శ్రుతి హాసన్

ప్రేమ కోసం ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాను : శ్రుతి హాసన్

శ్రుతి హాసన్ (Shruthi Haasan).. తెలుగు, తమిళ భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న అందాల నటి. కేవలం నటనతోనే కాదు.. తన గాత్రంతోనూ అందరినీ ఆకట్టుకుంటోంది ఈమె. ఐదేళ్ల పాటు లాస్ ఏంజలిస్‌కి చెందిన బ్రిటిష్ నటుడు మైఖేల్ కోర్సలే (Michael Corsale) తో ప్రేమలో ఉన్న శ్రుతి.. కొన్ని నెలల క్రితమే అతడితో విడిపోయింది. వీరిద్దరూ ఒకరి ఫొటోలను మరొకరు డిలీట్ చేసుకోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. అయితే వీరి బ్రేకప్ గురించి ఇప్పటివరకూ ఎవరూ మాట్లాడలేదు.

తాజాగా మంచు లక్ష్మి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'వూట్ ఫీట్ అప్ విత్ స్టార్స్' తెలుగు కార్యక్రమంలో పాల్గొన్న శ్రుతి తన ప్రేమతో పాటు.. బ్రేకప్‌కు సంబంధించిన వివరాలను కూడా పంచుకుంది. 'ప్రేమలో పడడం చాలా అద్భుతమైన అనుభూతి' అని చెప్పిన శ్రుతి.. నిజమైన ప్రేమ కోసం ఎప్పుడూ వేచి చూస్తూనే ఉంటానని చెప్పడం విశేషం. కెరీర్ ప్రారంభంలోనే ప్రేమలో పడడం ఎలా అనిపించింది? అని లక్ష్మి ప్రశ్నించినప్పుడు దానికి చాలా కూల్‌గా సమాధానమిచ్చింది శ్రుతి.

"నేను చాలా కూల్ టైప్.   పెద్దగా ఎవరితోనూ మాట్లాడకుండా ఉండేదాన్ని. నన్ను చూసి ప్రతి ఒక్కరూ నాపై ఆధిపత్యాన్ని చూపాలని భావించేవారు. నేను చాలా ఎమోషనల్.. అందుకే వాళ్లు నాతో వారికి నచ్చినట్లుగా వ్యవహరించేవారు. కానీ అది నాకు చాలా మంచి అనుభవాన్ని అందించింది. ప్రేమలో పడడం కూడా నాకు ఎంతో నేర్పించింది. అయితే 'ఇప్పటికీ ఇలాగే ఉండాలి.. ఇలాగే వ్యవహరించాలనే' ఫార్ములా ఏమీ లేదు. మంచి వ్యక్తులు మంచి సమయాల్లో మంచిగా వ్యవహరిస్తారు. అదే మంచి వ్యక్తులు.. కొన్ని చెడు సమయాల్లో తప్పుగా కూడా వ్యవహరించవచ్చు. దానికి మనం ఏం చేయలేం.

ప్రేమలో పడినందుకు.. ఆ బంధం విఫలమైనందుకు నేనేమీ బాధపడట్లేదు. నేను ఇప్పటికీ నిజమైన ప్రేమ కోసం వేచి చూస్తూనే ఉంటా. అలాంటి ఓ వ్యక్తి నాకు దొరికిన తర్వాత ప్రపంచానికి "ఇదిగో.. ఇన్నాళ్లూ నేను ఇలాంటి వ్యక్తి కోసమే వేచి చూశాను. తను నా జీవితంలోకి వచ్చేశాడు అంటూ పరిచయం చేస్తాను"  -  అంటూ చెప్పుకొచ్చింది శ్రుతి.

భవిష్యత్తులో తన బంధం ఎలా ఉండాలన్న దానిపై స్పందిస్తూ.." నాకు రొమాంటిక్ సినిమా టైప్ ప్రేమ అవసరం లేదు. నేను సినిమా నటినే. కానీ ప్రేమ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య పెరుగుతూ ఉండే బంధం. ఒకరి కోసం మరొకరు అన్నట్లు ఉండే బంధం అది. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మనల్ని జడ్జ్ చేస్తారు.

కానీ ప్రేమలో ఉన్న ఇద్దరు మాత్రం.. ఒకరినొకరు అర్థం చేసుకొని.. ఒకరితో మరొకరు కమ్యూనికేట్ చేసుకోవడం వల్ల ఆ ప్రేమ బలంగా ఉంటుంది. అలాంటి ప్రేమే నాకు కావాలి" అంటూ చెప్పుకొచ్చింది శ్రుతి. అంతేకాదు.. వాలెంటైన్స్ డే అంటే తనకు అస్సలు నమ్మకం లేదని.. ఫూల్స్ మాత్రమే అలాంటివి జరుపుకుంటారని" చెప్పింది శ్రుతి. తనకు ఫ్రెష్‌గా ఉండే మగవారు నచ్చుతారని.. చెమట వాసన వచ్చేవారిని అస్సలు దగ్గరికి రానివ్వనని ఆమె చెప్పడం విశేషం. 

మైఖేల్ కోర్సలే లండన్‌కి చెందిన నటుడు, మ్యుజీషియన్. శ్రుతితో తన బ్రేకప్ గురించి కొన్ని నెలల క్రితం ఆయన పోస్ట్ చేశాడు. "ఈ అమ్మాయి ఎప్పుడూ నాకు తోడుగా.. నా స్నేహితురాలిగా ఉంటుంది. లవ్ యూ.." అంటూ పోస్ట్ చేశాడు. వీరిద్దరూ ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఈ ఐదేళ్లలో కొన్నాళ్లు శ్రుతి సినిమాల్లో నటిస్తూ.. లాస్ ఏంజెలీస్‌కి, ఇండియాకి మధ్య తిరుగుతూ ఉండేది. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. లాస్ ఏంజెలీస్‌కి మారిపోయి.. అక్కడే తన మ్యూజిక్ కెరీర్ కొనసాగించింది శ్రుతి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.