సింగర్ గీతా మాధురి - యాక్టర్ నందు ల గారాలపట్టి పేరేంటో తెలుసా

సింగర్ గీతా మాధురి - యాక్టర్ నందు ల గారాలపట్టి పేరేంటో తెలుసా

మాస్ బీట్ తో పాటుగా క్లాస్ పాటలని సైతం ఎంతో చక్కగా ఆలపించి శ్రోతల చేత ఔరా అనిపించుకున్న గాయిని గీతా మాధురి (geetha madhuri). గత ఏడాది బిగ్ బాస్ తెలుగు (bigg boss telugu) సీజన్ 2లో కంటెస్టెంట్ గా ప్రవేశించడం, ఆ సీజన్ లో చాలా మంచి ప్రదర్శన ఇచ్చి ఫైనలిస్ట్ గా ఎంపికవడం.. ఫైనల్ 2 వరకూ చేరడం.. వంటి వాటితో ఆమెకి ప్రజల్లో ఆదరణ మరింతగా పెరిగింది అనే చెప్పాలి. 

మాది 100 % 'లవ్ స్టోరీ' - సింగర్ గీతా మాధురి & యాక్టర్ నందు ..!

అలాగే ఆమె భర్త నందు(nandu) (100% లవ్ ఫేమ్) కూడా సినిమాల్లో కొన్ని కీలకమైన పాత్రల్లో నటించాడు. ప్రస్తుతం తనని తాను నిరూపించుకునే పాత్రల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తాజాగా సవారీ అనే చిత్రం ద్వారా సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రానికి సంబంధించి టీజర్స్ కూడా ప్రజల్లోకి బాగానే చేరాయి. 'సవారి' (savari) చిత్రం త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

 

ఇలా ఈ ఇద్దరు కూడా తమ వ్యక్తిగత & వృత్తిపరమైన జీవితాల్లో సంతోషంగా ఉన్న సమయంలో ఆగష్టు 9, 2019 నాడు వారింట చంటి పాపాయి పుట్టడంతో వారిరువురి ఆనందానికి అడ్డులేకుండా పోయింది. తమకి బ్లాక్ బస్టర్ బేబీ పుట్టింది అంటూ వీరిద్దరూ ఆనందంలో మునిగిపోయారు. అలాగే గీతా మాధురి కూడా తల్లిగా తన అనుభూతులని & తన చిన్నారి పాప గురించిన చిన్ని చిన్ని విషయాలని తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటోంది.

'ఉప్పెనంత ప్రేమ'కి సాక్ష్యం అంటున్న.. డ్యాన్స్ మాస్టర్ రఘు & సింగర్ ప్రణవి

ఈ మధ్యే ఈ చంటి పాపాయికి నామకరణ మహోత్సవం (naming ceremony) ఇరువురి కుటుంబసభ్యుల మధ్య చాలా ఘనంగా జరిగిందట. దీనికి సంబందించిన ఫోటోలని & అలాగే ఆ పాప ఫోటో షూట్ ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది గీతా మాధురి. ఇంతకి గీతా & నందు తమ బిడ్డకి పెట్టిన పేరేంటో తెలుసా - దాక్షాయణి ప్రకృతి. ఈ ఫొటోలను గో లక్కీ డైరీస్ ఫొటోగ్రఫీ అనే సంస్థ తీయడం విశేషం. పేరుకు తగినట్లే బుజ్జి పాపాయిని ప్రకృతి మధ్యలో ఉంచి తీసిన ఈ ఫొటోలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 

"అందరికి నమస్కారం ,నా పేరు దాక్షాయణి ప్రకృతి (dakshayini prakruthi). మీ గీత,నందు-ల బ్లాక్ బస్టర్ బేబీ (Blockbuster Baby) ని నేనే!" అంటూ తమ పాప పేరుని ఈ ప్రపంచానికి తెలియచేశారు ఈ జంట. ఈ పోస్ట్ చూడగానే పేరు భలేగా ఉంది కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు వీరి ఫ్యాన్స్. మరి ముఖ్యంగా ప్రకృతి అంటూ పెట్టిన పేరుని చాలామంది అభినందిస్తున్నారు కూడా.. మరికొందరు పాప అచ్చుగుద్దినట్లుగా తండ్రిలా ఉందని తను ఎంతో ఉన్నతస్థాయికి వెళ్తుందని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

ఇక ఈరోజుల్లో పిల్లలకి పెట్టే పేర్లలో ఎంతో కొంతమేర వైవిధ్యం ఉండాలనే ప్రయత్నం కనిపిస్తోంది. కొంతమందేమో ఇలా మన జీవితంతో ముడిపడిన వాటిని పేర్లు గా పెడుతుంటే మరికొందరేమో తమ పేర్లు కలిసి వచ్చేలా పిల్లలకి పేర్లు పెడుతున్నారు. ఏదేమైనా.. పిల్లల పేర్లు ఈరోజుల్లో చాలామంది దృష్టిని ఆకర్షిస్తున్నాయి, దీనికి ప్రధాన కారణం ఆ పేర్లలో ఉన్న ప్రత్యేకతలే.

ఆఖరుగా.. ఈ చంటి పాపాయి గీతా మాధురి - నందు (nandu) ల జీవితాల్లోకి ప్రవేశించిన వేళ.. వీరిరువురి వారి జీవితంలో అంతా మంచే జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదే సమయంలో ఆ పాపకి కూడా భవిష్యత్తు చక్కగా ఉండాలని ఆశిద్దాం.

'ప్రతి ప్రేమకథ కంచికి చేరదు' అని తెలిపే.. 'పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్‌'ల లవ్ స్టోరీ ..!