ఆమెను ట్రోల్ చేసి.. ఆ తర్వాత క్షమాపణ చెప్పిన సల్మాన్ అభిమాని

ఆమెను ట్రోల్ చేసి.. ఆ తర్వాత క్షమాపణ చెప్పిన సల్మాన్ అభిమాని

తమ అభిమాన నటుడు లేదా నటి గురించి ఎవరైనా ఒక్క కామెంట్ చేస్తే చాలు.. వారిని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ట్రోల్ చేయడం ఈ రోజు ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి అవకాశాలను వాడుకుంటూ.. ఫ్యాన్స్ ముసుగులో కొందరు ఇతరులను ట్రోల్ చేస్తున్న సంఘటనలు కూడా లేకపోలేదు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ గాయని సోనా మోహాపాత్రకు (Sona Mohapatra) కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.


ప్రస్తుతం సోనా మోహాపాత్ర పై ట్విట్టర్‌లో ట్రోల్స్ వర్షం కురుస్తోంది. దీనికి కారణం ప్రముఖ బాలీవుడ్ నటుడి గురించి ఆమె ట్వీట్ చేయడమే. అసలు ఏం జరిగిందంటే.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan), కత్రినా కైఫ్ (Katrina Kaif) జంటగా నటించిన చిత్రం భారత్ (Bharat) విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో మొదట కథానాయికగా ప్రియాంక చోప్రాని (Priyanka Chopra) ఎంపిక చేసుకున్నప్పటికీ కొన్ని కారణాల రీత్యా ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకున్న విషయం అందరికీ విదితమే.


తాజాగా భారత్ చిత్రం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో సల్మాన్, కత్రినా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రియాంక సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణమేంటని సల్మాన్‌ని ప్రశ్నించగా- "ఇంతమంచి సినిమా కోసం చాలామంది తమ భర్తలని వదిలేస్తారు. అటువంటిది ప్రియాంక చోప్రా ఈ చిత్రాన్నే వదిలేసింది. పైగా ఈ సినిమా కథ ప్రియాంక చోప్రాకి బాగా నచ్చింది. కాబట్టి ఇప్పుడు తను కూడా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయాలి..’’ అంటూ సెటైరికల్ గా మాట్లాడాడు.అయితే ఓ కార్యక్రమంలో సల్మాన్ మాట్లాడిన ఈ మాటల గురించి.. గాయని సోనా మోహాపాత్ర ట్విట్టర్ వేదికగా స్పందించింది. అలా ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఇంతకీ సోనా మోహాపాత్ర ఏమని ట్వీట్ చేసిందంటే- ‘ప్రియాంకకు ఈ చిత్రంలో నటించడం కన్నా ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. తనకు నచ్చిన వ్యక్తితో కలిసి జీవించడం, తన జీవిత ప్రయాణంతో ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తినివ్వడం..’ అని ట్వీట్ చేసింది సోనా.


ఈ ఒక్క ట్వీట్‌తో సల్మాన్ అభిమానులు ఆగ్రహానికి లోనయ్యారు. వెంటనే ఆమెను ట్విట్టర్ వేదికగా ట్రోల్ చేస్తూ; ఈ మెయిల్స్ ద్వారా బెదిరించడం మొదలుపెట్టారు. ఆమె ఈ విషయంలో అనవసరంగా తలదూర్చారని కొందరు అంటే; ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు.. ఇకనైనా ఆపండి.. అంటూ ఇంకొందరు సలహా ఇచ్చారు. మరికొందరతైే మరో అడుగు ముందుకేసి నోరు అదుపులో పెట్టుకోకపోతే "ఇంటికి వచ్చి మరీ చంపుతాం.. ఇదే నీకు చివరి హెచ్చరిక.. తర్వాత జరిగే పరిణామాలు నువ్వు ఊహించలేవంటూ" బెదిరించారు కూడా.


 అలా ఆమెకు వచ్చిన ట్వీట్స్‌లో కొన్నింటిని సోనా రీ ట్వీట్ చేశారు. సల్మాన్ అభిమానుల నుంచి వస్తున్న బెదిరింపులన స్క్రీన్ షాట్లను పోస్టు చేస్తూ.. నెటిజన్లతో పంచుకున్నారు. కొందరు ఈ ట్రోలింగ్ గురించి ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేయమని  ఆమెకు సలహా ఇవ్వగా; "ముంబయి పోలీసులకు దీని కంటే ముఖ్యంగా పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయంటూ" ట్విట్టర్ వేదికగానే బదులిచ్చింది సోనా మోహాపాత్ర.


అయితే ఇంత జరుగుతున్నా సల్మాన్ ఈ వివాదం గురించి ఇప్పటివరకు స్పందించింది లేదు. సల్మాన్ చేసిన వ్యాఖ్యల పట్ల సోనా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని ప్రకటించింది. అంతమాత్రానికి ఆమె భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ ట్విట్టర్‌లో ట్రోల్ చేయడం, బెదిరింపు మెయిల్స్ పంపడం.. వంటివి సరికాదన్నది ఎక్కువగా వినిపిస్తున్న మాట.


అయితే ఆమెను చంపుతానని ట్రోలింగ్ చేసిన సల్మాన్ అభిమాని.. ఆ తర్వాత సోనాని క్షమించమని కోరుతూ ఓ ఈమెయిల్ పెట్టడం గమనార్హం. "నా అభిమాన నటుడి గురించి మీరు మాట్లాడిన మాటలు నాకు నచ్చలేదు. అందుకే ఆ సమయంలో విచక్షణ కోల్పోయి, మీ పట్ల దురుసుగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి" అని ఓ అభిమాని తెలిపాడు. 


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీ


కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !


ఇవి కూడా చదవండి


 నాని తన సినిమాకి.. అతన్నే హీరోగా ఎందుకు సెలెక్ట్ చేశాడంటే..?


నాన్నకు ప్రేమతో: తన తండ్రికి.. ప్రిన్స్ మహేష్ బాబు ఇచ్చే బర్త్‌డే కానుక ఇదేనా?


సీత అని కాకుండా.. శూర్ఫణక అని పేరు పెట్టాలా: టైటిల్ కాంట్రవర్సీలో కాజల్ సినిమా