ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
స్వలింగ బంధంలో ఉన్నా.. ఆ అమ్మాయినే పెళ్లాడి జీవితంలో స్థిరపడతా: ద్యుతీ చంద్

స్వలింగ బంధంలో ఉన్నా.. ఆ అమ్మాయినే పెళ్లాడి జీవితంలో స్థిరపడతా: ద్యుతీ చంద్

ద్యుతీ చంద్ (dutee chand).. మన దేశంలో క్రీడల గురించి తెలిసిన ప్రతిఒక్కరికీ పరిచయం అవసరం లేని పేరు ఆమెది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని అథ్లెట్ (athlete) గా కెరీర్ కొనసాగించడంతో పాటు 100 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డును (11.24) సొంతం చేసుకున్న ఘనత ద్యుతీ సొంతం.

తన శరీరంలో టెస్టోస్టిరాన్ (మగవారి శరీరంలో ఎక్కువగా ఉండే హార్మోన్) ఎక్కువగా ఉండడంతో ఒకానొక సమయంలో ద్యుతి అమ్మాయే కాదంటూ వివాదం కూడా రేగింది. తాను ఆడపిల్లనే అంటూ నిరూపించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొందామె. అయినా వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని క్రీడల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

dutee9

ఇప్పుడు మరో అడుగు ముందుకేసి తన జీవిత భాగస్వామి గురించి ధైర్యంగా అందరితోనూ పంచుకుంది ద్యుతీ. తాను భవిష్యత్తులో తన బంధువైన ఓ అమ్మాయితోనే జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నానని బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చి స్వలింగ బంధం (Same sex relationship)లో ఉన్న విషయాన్ని వెల్లడించిన అతికొద్దిమంది అథ్లెట్లలో ఒకరిగా మారింది. మన దేశంలో స్వలింగ సంపర్కురాలినని ప్రకటించిన మొదటి క్రీడాకారిణి తనే. తాజాగా ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బంధం గురించి వెల్లడించింది ద్యుతీ.

ADVERTISEMENT

23 సంవత్సరాల ఈ క్రీడాకారిణి ప్రస్తుతం హైదరాబాద్‌లోనే శిక్షణ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తన స్వలింగ బంధం గురించి చెప్పుకొచ్చింది ద్యుతీ. నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నా. నన్ను అంతగా ప్రేమించే వ్యక్తి దొరకడం నా అదృష్టం. ప్రతిఒక్కరికీ తాము కోరుకున్న వారితో కలిసి జీవించే హక్కు ఉండాలి. నేను స్వలింగ సంపర్కుల హక్కుల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాను. ప్రస్తుతం వరల్డ్ ఛాంపియన్ షిప్స్, టోక్యో ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్నా. ఆ రెండూ పూర్తయ్యాక తనతో కలిసి జీవితంలో స్థిరపడాలనుకుంటున్నా.

dutee7

“గతేడాది సుప్రీం కోర్టు సెక్షన్ 377ని రద్దు చేసిన తర్వాత ఎల్ జీబీటీ కమ్యూనిటీ హక్కుల కోసం మాట్లాడడమే కాదు.. మా బంధం గురించి కూడా బహిరంగంగా మాట్లాడే ధైర్యం నాకు వచ్చింది. ఎప్పటినుంచో ప్రతిఒక్కరికీ తమకు నచ్చిన వ్యక్తిని ప్రేమించేందుకు, వారితో జీవితాన్ని పంచుకునేందుకు హక్కుండాలని భావించేదాన్ని. ప్రేమ కంటే గొప్పది ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. అందుకే దాన్ని గౌరవించాలి.

ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా ఇలాంటి బంధాలను ఒప్పుకుంటోంది కాబట్టి ఒక అథ్లెట్‌గా నన్నెవరూ తప్పుబట్టకూడదన్నది నా భావన. ఇది నా వ్యక్తిగత నిర్ణయం. ప్రతి ఒక్కరూ దీన్ని గౌరవించాలని నేను కోరుకుంటున్నా. నా వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా నేను దేశం కోసం అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూనే ఉంటా.

ADVERTISEMENT

అథ్లెట్‌గా నా కెరీర్ గురించి, నా గురించి అర్థం చేసుకొని నన్ను ప్రోత్సహించే వ్యక్తి నాకు భాగస్వామిగా రావాలని కోరుకునేదాన్ని. నేను గత పదేళ్ల నుంచి స్ప్రింటర్‌గా కెరీర్ కొనసాగిస్తోన్నా. మరో ఏడేళ్లైనా ఇలాగే కెరీర్ కొనసాగించగలను. నేను పోటీల కోసం ప్రపంచమంతా తిరుగుతుంటాను. అది అంత సులభం కాదు. నాకు వ్యక్తిగత జీవితంలో సపోర్ట్ అందించే వ్యక్తులు కూడా ఎవరో ఒకరు ఉండాలి.. అందుకే నా గురించి బాగా తెలిసిన ఆ అమ్మాయితో జీవితాంతం ఉండాలనుకుంటున్నా.

తను మా గ్రామానికి (ఒడిషాలోని చాకా గోపాల్ పూర్ గ్రామం ) చెందిన బంధువుల అమ్మాయి. తన వయసు పంతొమ్మిదేళ్లు. భువనేశ్వర్ కాలేజీలో బీఏ చదువుతోంది. నేను ఎప్పుడు మా గ్రామానికి వెళ్లినా మేమిద్దరం కలిసి సమయం గడుపుతాం. మేమిద్దరం ఐదేళ్ల నుంచి రిలేషన్ షిప్‌లో ఉన్నాం. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఎంతో ఇష్టం. అందుకే ఇద్దరం భవిష్యత్తులో కలిసి జీవించాలనుకుంటున్నాం అని వెల్లడించింది ద్యుతీ.”

dutee5

మన దేశంలో స్వలింగ సంపర్కులు చేసుకునే వివాహాలకు చట్టబద్ధత లేకపోయినా.. స్వలింగ సంపర్కం మాత్రం తప్పుకాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. దీంతో వారు కలిసి ఉండేందుకు ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. అయినా ఈ విషయాన్ని దాచి ఉంచేవారు ఎంతోమంది. అందుకే తాను స్వలింగ బంధంలో ఉన్నానని ఎంతో ధైర్యంగా చెప్పిన ద్యుతీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ట్విట్టర్‌లో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ ద్యుతీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా బయటకు వెల్లడించడం పట్ల ద్యుతీ కుటుంబం అంత ఆనందంగా ఉన్నట్లు లేదు. ఈ ఇంటర్వ్యూ బయటకు విడుదలైన తర్వాత తన తల్లిదండ్రులు తనని ఏమీ అనకపోయినా.. అక్క మాత్రం తనని ఇంటి నుంచి బయటకు పంపించేస్తానని, జైలుకి పంపుతానని బెదిరించిందని చెప్పుకొచ్చింది.

ADVERTISEMENT

మా పెద్ద అక్క కుటుంబంలో అందరిపై అధికారం చూపుతుంది. ఇంతకుముందు మా అన్న భార్య తనకు నచ్చలేదని వారిద్దరినీ ఇంటి నుంచి బయటకు పంపించేసింది. ఇప్పుడు నా విషయంలోనూ అలాగే చేస్తానని బెదిరిస్తోంది. అంతేకాదు.. జైలుకు కూడా పంపుతానని బెదిరించింది. కానీ నేను పెద్దదాన్ని.. నాకు స్వేచ్ఛ ఉంది. అందుకే నేను ఈ విషయాన్ని అందరికీ చెప్పాలనుకున్నా. నా భాగస్వామి నా ఆస్తికి ఆశపడి నాతో ఉంటోందని తను భావిస్తోంది. తను అలాంటిది కాదు. ఈ విషయాన్ని మీడియాకి వెల్లడించేముందు నేను తన అభిప్రాయం కూడా తీసుకున్నా. తను కూడా ఈ విషయాన్ని బయటకు వెల్లడించిన తర్వాత ఎదురయ్యే ఇబ్బందులను తట్టుకోవడానికి సిద్ధమైంది. నా దృష్టిలో మనం ఎవరితో జీవించాలనేది మన వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం. అది మనమే నిర్ణయించుకోవాలి.. అంటూ వెల్లడించింది ద్యుతీ.

dutee4

2018 ఏషియన్ గేమ్స్ లో రెండు రజత పతకాలు గెలుచుకున్న ద్యుతీ ప్రస్తుతం వరల్డ్ ఛాంపియన్ షిప్స్, టోక్యో ఒలింపిక్స్ కోసం హైదరాబాద్ లో కఠోర శిక్షణ తీసుకుంటోందట. ఆ రెండూ పూర్తయ్యాకే తన బంధాన్ని పూర్తి స్థాయి బంధంగా మార్చుకునే ప్రయత్నం చేస్తానంటోంది ద్యుతీ. దేశమంతా పాపులారిటీ సంపాదించిన ఆమె తాను ఈ విషయం బయటపెడితే పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలిసినా దాన్ని బయటపెట్టింది. అందుకే ద్యుతీ ధైర్యానికి మనం హాట్సాఫ్ చెప్పాల్సిందే.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీ

ADVERTISEMENT

కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !

ఇవి కూడా చదవండి.

ప్రపంచమంతా తిరిగినా టెర్రస్ పైనే పెళ్లి చేసుకుంది.. ఎందుకంటే..?

స్నేహితురాలి పెళ్లిలో.. సమంత సందడి చూశారా?

ADVERTISEMENT

ప్రేమ జీవితాంతం ఉండాలంటే.. గొడవ పెట్టుకోవాల్సిందే..!

Images : twitter

19 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT