Rajinikanth's Darbar Movie Public Talk : ఇండస్ట్రీ షాక్.. మొదటి రోజే రూ.112 కోట్ల బిజినెస్

Rajinikanth's Darbar Movie Public Talk : ఇండస్ట్రీ షాక్.. మొదటి రోజే రూ.112 కోట్ల బిజినెస్

Superstar Rajinikanth 'Darbar' Public Talk

సూపర్ స్టార్  రజనీకాంత్ ... ఈ పేరుకి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమా విడుదలైతే.. ఆయన అభిమానులకి మాత్రం ఒక పెద్ద పండగే.

Darbar Trailer Talk : 'ఐ యామ్ ఏ బ్యాడ్ కాప్' అంటూ రెచ్చిపోయిన 'సూపర్ స్టార్' రజినికాంత్

ఎందుకంటే రజినీ అంటేనే ఒక స్టైల్.. ఒక ఎనర్జీ.. అంతకుమించి వెండితెర దైవం. ఇన్ని రకాలుగా ఆయన తన అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. దాదాపు 70 ఏళ్ళ వయసులో కూడా ఇసుమంతైనా తడబాటు లేకుండా.. ఒక జింక పిల్లలా దూసుకుపోతూ.. తెర పై ఆయన చేసే యాక్టింగ్ చూపరుల దృష్టిని ఆకట్టుకోక మానదు. ఇక నిన్న విడుదలైన 'దర్బార్' చిత్రం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు.

ఈ క్రమంలో దర్బార్ చిత్రం పబ్లిక్ టాక్  మీకోసం 

దర్బార్ ట్రైలర్ విడుదలయ్యాక.. ప్రేక్షకులు మరోమారు రజనీకాంత్ స్టైల్‌తో పాటు.. ఎనర్జీకి కూడా ఫిదా అయిపోయారు. అలాగే ఈరోజు ఈ సినిమా చూసాక.. అసలు రజనీకాంత్‌కి 70 ఏళ్ళు అంటే నమ్మలేమని.. ఒక 25 ఏళ్ళ యువకుడిగా మంచి ఎనర్జీతో ఆయన నటించారని జనాలు అంటున్నారు. 

సినిమాల్లో చాలా కాలం తరువాత ఒక పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన రజనీకాంత్ .. బ్యాడ్ కాప్ అంటూ అటు విలన్స్‌తో పాటు.. బాక్స్ ఆఫీస్‌ని కూడా ఇరగదీసేశాడట. తొలి రోజు వచ్చిన కలెక్షన్సే ఇందుకు ఋజువని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా మొత్తాన్ని రజనీకాంత్ ఒక్కడే తన భుజాల పై మోసుకెళ్లగా .. ఆయన కూతురు పాత్ర పోషించిన నివేత థామస్ నటనకు కూడా మంచి ప్రశంసలే వస్తున్నాయి.

అలాగే ఈ సినిమాలో సునీల్ శెట్టి, యోగి బాబు, నయనతారలు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే ఎపిసోడ్ సినిమా మొత్తానికే హైలైట్ అని అంటున్నారు.

సూపర్ స్టార్ అనే పదానికి.. అసలైన నిర్వచనం చెప్పిన 'రజినికాంత్'

అదేవిధంగా తండ్రీకూతుళ్ళ సెంటిమెంట్ కూడా ఈ సినిమాకి మరొక ప్రధాన ఆకర్షణగా నిలిచిందట. రజనీకాంత్ - నివేత థామస్‌ల అభినయం చూడముచ్చటగా ఉందని అభిమానులు అంటున్నారు. అయితే ఈ సినిమాకి ఇంత క్రేజ్ రావడానికి గల కారణాలలో ఒకరైన దర్శకుడు మురుగదాస్.. మరోమారు తన మార్కు సన్నివేశాలతో ఆకట్టుకోవడం జరిగిందని టాక్. 

మరి ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ఎపిసోడ్ చిత్రీకరించిన విధానం ప్రేక్షకుల చేత ఔరా అనిపిస్తోంది. దీనికి తోడుగా లెజెండరీ కెమెరామెన్ సంతోష్ శివన్ కెమెరా పనితనం.. ఆడియన్స్‌ని కథలోకి లీనమయ్యేలా చేసిందట. ఇక మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన సంగీతం, సమకూర్చిన నేపధ్య సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లేలా చేశాయని అంటున్నారు. సాంకేతికంగా కూడా ఈ సినిమా చాలా ఉన్నత స్థాయిలో ఉందని పలు సమీక్షలు (Darbar Review) వస్తున్నాయి.

అయితే సినిమా మొదటి భాగంతో పోలిస్తే.. రెండవ భాగం అంత ఎఫెక్టివ్‌గా లేదనే అభిప్రాయం ఉంది. అలాగే కథ కూడా కాస్త రొటీన్‌గా ఉందనే వాదన వినిపిస్తోంది. అయితే వీటన్నిటిని మరిపించే విధంగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ తనదైన శైలిలో నటించడంతో సినిమా హిట్టేనని అంటున్నారు అభిమానులు. ఇక ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ.112 కోట్లు దాటాయని ట్రేడ్ ఎనలిస్ట్ రమేష్ బాల ఓ ప్రకటనలో తెలిపారు. 

మొత్తానికి ఈ సంక్రాంతి పండుగకి.. తన ఫ్యాన్స్‌కి 'తలైవా' ఒక మంచి హిట్ ఇచ్చాడని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

కొత్త కథలకే.. ప్రేక్షకుల ఓటు : 2019 టాప్ టెన్ టాలీవుడ్ చిత్రాలివే..!