ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ & వైఎస్ జగన్ లకి అభినందనలు |POPxo | POPxo

ప్రధాని మోదీకి, జగన్‌కి... తెలుగు సెలబ్రిటీల అభినందనల వెల్లువ..!

ప్రధాని మోదీకి, జగన్‌కి... తెలుగు సెలబ్రిటీల అభినందనల వెల్లువ..!

నిన్న వచ్చిన సాధారణ ఎన్నికల ఫలితాలతో మన దేశానికి మరోమారు ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ (Narendra Modi) ఎన్నికయ్యారు. ఇక ఆధిక్యం విషయానికి వస్తే.. ఆయన ఇంతకు ముందెన్నడూ కూడా చూడనంత ఆధిక్యంతో ఇప్పుడు భారత ప్రధానిగా ప్రమాణ స్వీకరం చేయబోతున్నారు. 


ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, వైఎస్ఆర్సీపీ (YSRCP) అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికి (YS Jaganmohan Reddy)  ప్రజల నుండి పూర్తి స్థాయిలో మద్దతు లభించడం విశేషం. ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తను బాధ్యతలు చేపట్టబోతున్నారు.


ఈ క్రమంలో అటు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు.. ఇటు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువలా వస్తున్నాయి. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలిపిన ట్వీట్స్ ఇక్కడ మీకోసం -


* రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)


శుభాకాంక్షలు జగన్.  * మహేష్ బాబు (Mahesh Babu)


ముందుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మీ అపూర్వ విజయానికి శుభాకాంక్షలు. మీ హయాంలో రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను. * పీవీ సింధు  (PV Sindhu)


నరేంద్ర మోదీ గారు.. మీకు శుభాకాంక్షలు.


జగన్ గారు. మీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉజ్వలంగా ఉంటుందని ఆశిస్తున్నాను. మీ ఘనవిజయానికి శుభాకాంక్షలు

* రామ్ పోతినేని   (Ram Pothineni)


ప్రజలు తమ వాణిని వినిపించేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు, ఇక్కడ రాష్ట్రంలో జగన్ గారు ప్రజల మద్దతుని పొందగలిగారు. వీరిద్దరి పాలనలో దేశం & రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను. 
* హరీష్ శంకర్  (Harish Shankar)


 జగన్ గారు... నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్న మీకు శుభాభినందనలు.
* సానియా మీర్జా  (Sania Mirza)


అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న నరేంద్ర మోదీ గారికి నా శుభాకాంక్షలు.
* నాగార్జున  (Nagarjuna)


బీజేపీ పార్టీకి మరియు నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు మరల తిరిగి ఎన్నికైనందుకు డబల్ కంగ్రాట్స్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే యంగ్ ముఖ్యమంత్రి జగన్‌కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

*  సైనా నెహ్వాల్ (Saina Nehwal)


భారీ విజయాన్ని అందుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు.
*  రవితేజ (Ravi Teja)


 కంగ్రాట్స్ యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీ పరిపాలన సుభిక్షంగా సాగాలని కోరుకుంటున్నాను.
* వెన్నెల కిషోర్  (Vennela Kishore)


 శుభాకాంక్షలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు...
* కాజల్ అగర్వాల్  (Kajal Aggarwal)


నరేంద్ర మోడీ గారు.. మీరు సాధించిన ఈ అసాధారణ విజయానికి మీకు అభినందనలు తెలుపుతున్నాను. రాబోయే అయిదేళ్ళు మీరు సమర్ధవంతంగా పరిపాలించాలి అని కోరుకుంటున్నాను.


మీరు & మీ పార్టీ ఘన విజయానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీ పరిపాలనలో ముందుకి సాగాలని ఆశిస్తున్నాను.
 * మంచు విష్ణు (Manchu Vishnu)


ఇది ప్రజల విజయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇది ఒక ఆత్మగౌరవ పోరాటంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు.
* మంచు లక్ష్మి (Manchu Lakshmi)


ప్రజలు కోరుకుంటున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గెలిచారు. ప్రజలు మీ పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారు.


మరొక అయిదేళ్ల కోసం ఎన్నికైన ప్రధాని నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు.
 


* నాని  (Nani)


శుభాకాంక్షలు జగన్మోహన్‌రెడ్డి గారు. కచ్చితంగా మీరు ఈరోజు జెర్సీ సినిమాలోని 'అరుపు' మూమెంట్‌ని ఎంజాయ్ చేసుంటారు.
* అనిల్ రావిపూడి (Anil Ravipudi)


 మీ నుండి సమర్ధమైన & సుస్థిరమైన పాలన కోసం ఎదురు చూస్తున్నాము. శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి గారు...
* నరేష్ (Naresh)


నరేంద్ర మోదీ గారికి & జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. మీ ఇద్దరి పాలన బాగుండాలని ఆశిస్తున్నాను.
*  మోహన్ బాబు (Mohanbabu) 


ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే.. శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు తన బిడ్డ జగన్‌కి ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు ఇచ్చాడు. జగన్ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నాడు. ప్రజలు ఆశీస్సులు అందచేసి ముఖ్యమంత్రిని చేసారు. కచ్చితంగా ప్రజలకు మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్.
* కోన వెంకట్ (Kona Venkat)


ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమయ్యే విజయం. మీ విజయం అపూర్వం & అనిర్వచనీయం.


ఇలా పలువురు సెలబ్రిటీలు దేశానికి కాబోయే.. నూతన ప్రధాని నరేంద్ర మోదీ గారికి & ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు.ఇవి కూడా చదవండి


ఈ బాలీవుడ్ నటులు.. ఓటు ఎందుకు వేయలేదంటే..?


‘ఓటు’కి మాటలు వస్తే... అది ఇచ్చే సమాధానాలు మీరు ఊహించగలరా??


"మేము ఓటేశాం.. మరి మీరు ? " అంటున్న సెలబ్రిటీలు.. ఫొటోలతో అవగాహన కల్పించే యత్నం