అప్పుడప్పుడూ.. బాయ్ ఫ్రెండ్ కూడా లింగ వివక్ష చూపిస్తాడు..!

అప్పుడప్పుడూ.. బాయ్ ఫ్రెండ్ కూడా లింగ వివక్ష చూపిస్తాడు..!

ఒక అమ్మాయి ఎవరైనా అబ్బాయితో ఎక్కువ కాలం కలిసి ఉంటే.. కొంతకాలం తర్వాత అతడు ఎలా మాట్లాడినా సరే ఆమెకు చాలా సాధారణంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు అతడు మాట్లాడే మాటల్లో చులకన భావం కూడా కనిపించవచ్చు. మన సమాజంలో అమ్మాయిలను ఒక రకంగా.. అబ్బాయిలను మరో రకంగా పెంచడమే దీనికి కారణం. ఆడపిల్లలుగా చిన్నప్పటి నుంచి మనకు చాలా కట్టుబాట్లు విధిస్తుంటారు. మనం ఎదిగే కొద్దీ వాటిలో ఎంత వివక్ష ఉందో తెలుస్తుంది.


అమ్మాయిలూ..! మీ Boy friend కూడా అదే సమాజం నుంచి వచ్చాడు. కాబట్టి అతని ఆలోచనల్లోనూ లింగ వివక్ష కనిపిస్తుంటుంది. కానీ వాటిని మనం అప్పుడు గుర్తించలేం. సాధారణంగా కొందరు మన స్నేహితురాళ్లు, మన అక్కచెల్లెళ్ల విషయంలో కూడా వివక్షాపూరితంగా మాట్లాడుతుంటారు.


అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న అమ్మాయిలు, సమాజంలో మార్పు తేవడానికి కృషి చేస్తున్న మ‌హిళ‌లు, స్వతంత్రంగా వ్యవహరిస్తున్న ఆడవాళ్ల విషయంలో చాలా దారుణంగా వివక్షాపూరితమైన ( sexist) కామెంట్స్ చేస్తుంటారు. అయితే అందరూ అలాగే ఉంటారని అనలేం. కానీ పలువురు బాయ్ ఫ్రెండ్స్ ఎలాంటి విషయాల్లో అమ్మాయిలను కించపరుస్తూ మాట్లాడుతుంటారో కొన్ని ఉదాహరణలు చూద్దాం.


1. ఇంత పెద్ద కారున్న అమ్మాయిలు.. డ్రైవర్‌ని ఎందుకు పెట్టుకోరో నాకు అర్థం కాదు..!


అమ్మాయిలు కారు సరిగ్గా నడపలేరని వారి భావన. పైగా నడిపే సామర్థ్యాన్ని, కారు సైజుకి నేరుగా లంకె పెట్టేస్తుంటారు. అలా ఎందుకు చేస్తారో వారికే అర్థం కావాలి.


1-sexist-things-boyfriends-say-deepika-padukone-driving-car


2. బండి ఇంత నెమ్మదిగా వెళ్తోందేంటి? కచ్చితంగా ఎవరో ఆంటీ డ్రైవింగ్ చేస్తుంటుంది. 


వీరి ఉద్దేశం అదే కదా.. అమ్మాయిలు సరిగ్గా డ్రైవ్ చేయలేరని. ఇలాంటి వారికి వరల్డ్ ఫేమస్ విమెన్ బైకర్స్ గురించి తెలపాలి.


3. అమ్మాయి మిలటరీలో అస్సలు చేరకూడదు. పొరపాటున శత్రు సైన్యానికి చిక్కితే ఆమె అత్యాచారానికి గురవుతుంది.


అమ్మాయిల‌కు పుట్టుకతోనే ఓ లోపం ఉంది. అదే వెజీనా! ఇదీ కొందరి అబ్బాయిల దురభిప్రాయం. ఇలాంటి పనికిమాలిన కామెంట్స్ చేసే ఫ్రెండ్స్‌కి దూరంగా ఉండడం బెటర్.


మీరు ప్రతిపాదించడానికి చేయగల విషయాలు


4. ఎందుకలా కోప్పడుతున్నావు? నువ్వేమైనా పీరియడ్స్‌లో ఉన్నావా?


అమ్మాయిల ఎమోషన్స్ వెనుక ఉన్న ఒకే ఒక్క రీజన్ పీరియడ్స్ మాత్రమేనా? ఇంకేమీ కారణం కాకూడదా? ఇలాంటి మినిమమ్ నాలెడ్జి లేని బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు.


2-sexist-things-boyfriends-say-lily-how-i-met-your-mother


Also Read: పీరియడ్స్ విషయంలో అబ్బాయిలకు.. ఎలాంటి అపోహలుంటాయో మీకు తెలుసా?


5. నీకు మీసాలు ఉన్నాయేంటి?


అమ్మాయిలకు ఫేషియల్ హెయిర్ పెరగకూడదు. హార్మోన్ల ప్రభావమైనా సరే..! ఇదీ కొందరు అబ్బాయిల తలతిక్క అభిప్రాయం.


6. స్కర్ట్ వేసుకొన్నావేంటి. నువ్వు వ్యాక్సింగ్ చేయించుకోలేదు కదా..


అమ్మాయిల శరీరంపై ఒక్క వెంట్రుక కూడా ఉండకూడదంటారు. వ్యాక్సింగ్ చేయించుకోవడానికి వెళితే డబ్బులు పార్లర్‌కి తగలేస్తున్నావంటారు. ప్రతీ ఒక్కడికీ అమ్మాయిల శరీరం పై జోకులు వేయడం అలవాటు అయిపోయింది. వారేదో నవ మన్మధుల్లా ఫీలైపోతూ ఉంటారు.


7. డబ్బుల గురించి పెద్దగా ఆలోచించకు. అంతా నేను చూసుకుంటాలే.


మీ కంటే మేం తక్కువ కాబట్టి.. మా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా తక్కువగానే ఉంటుందన్నది వారి భావన. సినిమాల్లో కూడా అమ్మాయిలను ఆర్థిక స్వేచ్ఛ తక్కువగా ఉన్నవారిగా చూపిస్తుంటారు. కానీ ఈ రోజు అన్ని రంగాల్లోనూ అబ్బాయిలను మించి కూడా అమ్మాయిలు సేలరీలు తీసుకుంటున్న సందర్భాలున్నాయి. ఈ విషయం వారికి ఎప్పుడు అర్థమవుతుందో..?


3-sexist-things-boyfriends-say-what-did-you-say


8. ఎవరికో కమిట్‌మెంట్ ఇచ్చింది. కాబట్టే ఆమెకు ఉద్యోగం వచ్చింది. లేకపోతే ఆమెకు అంత టాలెంట్ ఎక్కడిది?


ఇది ఓ దురహంకారపూరితమైన కామెంట్. కమిట్‌మెంట్ అంటే ఇక్కడ అమ్మాయి.. ఉద్యోగం పొందడానికి  ఎవరి లైంగిక అవసరాలో తీర్చిందని భావిస్తుంటారు కొందరు. ఇదీ వారికి స్త్రీలపై ఉండే నీచమైన భావాన్ని తెలియజేస్తుంది. ఇలాంటి  కామెంట్స్ చేసే బాయ్ ఫ్రెండ్స్ ఉంటే.. వారు చెబుతుంది తప్పు అని ధైర్యంగా చెప్పండి.


9. వాడు చాలా లక్కీ. వాడి గర్ల్ ఫ్రెండ్‌కి ఫుట్ బాల్ అంటే ఇష్టం. అమ్మాయిల‌కు స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉండటం చాలా అరుదు కదా!


కొందరి ఉద్దేశంలో అమ్మాయిలకు క్రీడలు అర్థం కావు. అంతేనా? పాపం.. ఇంత కాలం వారికి మన కరణం మల్లీశ్వరి, సైనా నెహ్వాల్, సానియా మీర్జీ, మేరీ కోమ్.. లాంటి పేర్లు గుర్తు లేనందుకు చింతిస్తున్నాం.


10. అమ్మాయిలు లెక్కల్లో వీక్..!


4-sexist-things-boyfriends-say-professor-mcgonagal


అంకెలు అమ్మాయిలను భయపెట్టేస్తాయని.. కొందరి అబ్బాయిల భావన. వీరికి గణితశాస్త్రంలో ప్రపంచాన్నే అబ్బురపరిచిన శకుంతలా దేవి కథను చెప్పాలి.


11. నువ్వు అందరి అమ్మాయిల్లాంటిదానివి కాదు.


నిజమే.. నేను బయటకు రావడానికి ఒప్పుకొన్నా కదా..!


Also Read: తన జీవితంలో జరిగే ఈ సంఘటనలను ఏ ఆడపిల్ల ఎప్పటికీ మరచిపోదు..


12. మీ ఫ్రెండ్సందరిలోనూ నువ్వే అందంగా ఉంటావు.


మిగిలిన అమ్మాయిల కంటే బెటర్‌గా ఉండటం వల్ల అందంగా కనిపించానన్నమాట.


13. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అంతా క్రేజీ గర్ల్స్


5-sexist-things-boyfriends-say-rachel-green-angry


"ఓహ్.. వార్నింగ్ ఇస్తున్నారా?" మంచిది. ఇలాంటి బాయ్ ఫ్రెండ్స్‌ని, తిరిగి వారి గర్ల్ ఫ్రెండ్స్ వద్దకే వెళ్లిపోమంటే సరి.


14. అమ్మాయిలు పద్ధతిగా మాట్లాడాలి. ఇలా నోరు జారకూడదు.


ఇది కొందరి అబ్బాయిల అభిప్రాయం. కానీ అలా మాట్లాడటం మాకు సూట్ అవదేమో. ఎందుకంటే నిజాయితీగా మాట్లాడే అమ్మాయిలంటే.. ఏ అబ్బాయికైనా అలుసే. పొగరుబోతని ముద్ర వేసేస్తారు. 


15. మేకప్ వేసుకొనే అమ్మాయిలు నాకు అంతగా నచ్చరబ్బా


"నేచురల్ బ్యూటీయే బెస్ట్. మిగతావారంతా ఫేక్".. ఇదే కదా కొందరి అబ్బాయిల ఉద్దేశం. ఇలాంటి మాటలు అనేవారు మెన్స్ బ్యూటీ పార్లర్, సెలూన్, మసాజ్.. లాంటి మాటలకు ఎందుకు టెంప్ట్ అవుతారో.


16. నా ప్రేయసి మంచి తిండిపోతు.


6-sexist-things-boyfriends-say-eleven-stranger-things


ఏం.. తిండి విషయంలో అమ్మాయిలకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటే తప్పేమిటి. ఏమిటి ఆకలి అబ్బాయిలకే గానీ.. అమ్మాయిలకు ఉండదా ఏంటి?


17. నువ్వు ఇప్పటి నుంచే రెడీ అవడం మంచిది. నేనెంత ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతా.


"అమ్మాయిలు రెడీ అవ్వడానికి అంత టైం పడుతుందా మహాశయా??" అని ఇలాంటి సందర్భాల్లో అడగాలని ఉంటుంది కదూ. ఒక్కప్పుడు అమ్మాయిలు ఇలా ఉండేవారేమో..! కానీ మోడరన్ అమ్మాయిలు అబ్బాయిల కంటే ఫాస్ట్‌గా ఉంటున్నారు. చీరలు.. సింగినాదాలని టైం వేస్ట్ చేయడం లేదు. తమకు సౌకర్యవంతమైన బట్టలను వేసుకొని.. అబ్బాయిల కంటే ఫాస్ట్ గానే తయారవుతున్నారు. 


18. ఎంత మంది అబ్బాయిలతో తిరిగావేమిటి..?


ఇలాంటి డైలాగ్స్ మనం సినిమాలతో పాటు నిజ జీవితంలో కూడా వింటూ ఉంటాం. మగాడు లెక్కలేనంత అమ్మాయిలతో తిరిగినా ఫర్వాలేదు. కానీ ఓ అమ్మాయి తన జీవితంలో లవ్ ఫెయిల్యూర్ అయినా.. రిలేషన్ షిప్ చెడి విడాకులు తీసుకున్నా.. తర్వాత ఆమె జీవితంలోకి వచ్చే వ్యక్తి ఇలాంటి మాటలు ఆడితే.. అటువంటి బంధాన్ని కొనసాగించకపోవడమే మంచిది. 


19.  నువ్వు విస్కీ తాగుతావా?


7-sexist-things-boyfriends-say-haley-dunphy


ఏం అమ్మాయిలు ఓడ్కాయే తాగుతారా ఏంటి? అమ్మాయికుండే వ్యక్తిగత అలవాట్లను బట్టి.. తన వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం చాలా మంది అబ్బాయిలకు అలవాటు. ఈ ఆధునిక యుగంలో కూడా.. ఇంకా పాత చింతకాయ పచ్చడి ఆలోచనలను మన పై రుద్దడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. 


Also Read: ఇంట్లో ఒంటరిగా ఉంటే.. అమ్మాయిలు ఎలాంటి చిలిపి పనులు చేస్తారో తెలుసా?


20. ఎక్కువ నవ్వకు..


అమ్మాయిలు నవ్వితే కొంపలు మునిగిపోతాయన్నది కొందరి అభిప్రాయం. ఇలాంటి ఆలోచనలు అబ్బాయిల్లోని పొజెసివ్ ఫీలింగ్స్‌ని తెలియజేస్తాయి. తాము ప్రేమించే అమ్మాయిలు తాము గీసిన గీత దాటకూడదని వారు అనుకుంటూ ఉంటారు.


అమ్మాయిలు ఆటలు ఆడకూడదు... స్వతంత్రంగా వ్యవహరించకూడదు అని ఆలోచించే వ్యక్తి మీ బాయ్ ఫ్రెండ్ అయితే.. ఏం చేయాలో మేం చెప్పాల్సిన అవసరం లేదు కదా..!


GIFs: Giphy, Tumblr