టిక్ టాక్ ప్రస్తుతం... యువతరాన్ని బాగా ఆకర్షిస్తున్న పేరు. టిక్ టాక్ యాప్ ద్వారా తమ వీడియోలు పోస్ట్ చేస్తూ.. చాలా మంది ఫేమస్ అవుతున్నారు. అలా బాగా ఫేమస్ అయిన అమ్మాయే మృణాళిని రవి (Mrinalini Ravi).
తన వీడియోల ద్వారా లెక్కలేనంత మంది అభిమానులను సంపాదించుకున్న ఈమె..ప్రసుత్తం తెలుగు తెరకు హీరోయిన్‌గా కూడా పరిచయం కానుంది.
పవన్ కళ్యాణ్‌కు గబ్బర్ సింగ్ లాంటి తిరుగులేని హిట్ అందించిన దర్శకుడు హరీష్ శంకర్ తీస్తున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం తమిళ హిట్ చిత్రం "జిగర్ తండా"ని హరీష్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రాన్ని "వాల్మీకి" పేరుతో తెలుగులో వరుణ్ తేజ్‌ను హీరోగా పెట్టి తెరకెక్కిస్తున్నారు. ఈ సంవత్సరం డిసెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
మృణాళిని రవికి ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా లెక్కలేనంత మంది ఫాలోవర్స్ ఉన్నారు.
ఇప్పటికే ఆమె తమిళంలో నటించిన "సూపర్ డీలక్స్" చిత్రం సూపర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. అలాగే ఈమె తమిళంలో కూడా ఓ హారర్ సినిమాకి సైన్ చేసింది.
అద్భుతమైన వార్త.. ఇప్పుడు POPxo షాప్ ఓపెన్ అయింది. చక్కటి మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్‌టాప్‌స్లీవ్స్ ఇంకా మరెన్నో ఇక్కడ 25 శాతం డిస్కౌంట్‌తోనే లభిస్తున్నాయి. POPXOFIRST అనే కూపన్ కోడ్‌ని ఉపయోగించండి. దీంతో మహిళలకు ఆన్‌లైన్ షాపింగ్ ఎంతో సులువైపోతుంది.
View this post on Instagram
View this post on InstagramSensitive & Savage ! Happy Sunday 🖤 PC : @vijayvendhan MUA : @makeupartistrybykavithasekar