మ‌న‌సులోని దేశ‌భ‌క్తిని.. మువ్వ‌న్నెల అవుట్‌ఫిట్స్‌తో ప్ర‌తిబింబించండి..!

మ‌న‌సులోని దేశ‌భ‌క్తిని.. మువ్వ‌న్నెల అవుట్‌ఫిట్స్‌తో ప్ర‌తిబింబించండి..!

స‌గ‌టు భార‌తీయులుగా మ‌న దేశంపై ప్ర‌తిఒక్క‌రికీ దేశ‌భ‌క్తి ఉండ‌డం స‌హ‌జం. అయితే మిగ‌తా స‌మ‌యాల‌తో పోలిస్తే స్వాతంత్య్ర దినోత్స‌వం (ఆగ‌స్టు 15), గ‌ణ‌తంత్ర దినోత్స‌వం (Republic day)(జ‌న‌వ‌రి 26) నాడు చాలామంది త‌మ మ‌న‌సులో ఉన్న దేశ‌భ‌క్తిని భిన్న‌మైన మార్గాల్లో అంద‌రికీ తెలిసేలా చేయాల‌ని అనుకుంటూ ఉంటారు.


ఈ క్ర‌మంలోనే చాలామంది మ‌న దేశ ప‌తాకంలోని రంగులను త‌మ అవుట్ ఫిట్స్ లో భాగం చేసుకుంటారు. అయితే ఈ త‌ర‌హా వ‌స్త్రధార‌ణ ప్ర‌య‌త్నించిన‌ప్పుడు ఏమాత్రం అజాగ్ర‌త్త వ‌హించినా మొత్తం లుక్ పై ఆ ప్ర‌భావం క‌నిపిస్తుంది. అందుకే గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా మువ్వ‌న్నెల జెండాలోని రంగుల‌ను ఉప‌యోగించి మ‌న దేశ‌భ‌క్తిని తెలియ‌జేస్తూనే హుందాగా కూడా క‌నిపించాలంటే అందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.


tricolour saree


Shop the above look: Madhubani Print Pure Silk Saree (Rs 6,999), Handblock Print Handwoven Cotton Blouse (Rs 1,709)


దేశ‌భ‌క్తిని ప్ర‌తిబింబించాలి.. మ‌న సంప్ర‌దాయానికి అద్దం ప‌ట్టాలి. ఈ రెండూ ఒకేసారి జ‌ర‌గాలంటే అది అంద‌మైన‌, ఆక‌ట్ట‌కునే చీర‌తోనే సాధ్యం. అలాగ‌ని త్రివ‌ర్ణ ప‌తాకంలోని మూడురంగులు క‌ల‌గ‌లిసిన చీర క‌ట్టుకోమ‌ని మా ఉద్దేశం కాదు. వాటిలో ఏవైనా రెండు రంగులు చీర‌లో ఉండేలా చూసుకొని మ‌రొక రంగుని బ్లౌజ్ కి ఎంపిక చేసుకుంటే స‌రిపోతుంది.


సాధార‌ణంగా ఆరెంజ్, గ్రీన్ క‌ల‌ర్ కాంబినేష‌న్‌లో ర‌క‌ర‌కాల డిజైన్ల‌లో చీర‌లు ల‌భిస్తుంటాయి. వాటిలో ఇత‌ర‌త్రా ఫ్యాబ్రిక్స్ ఏవీ కాకుండా కాట‌న్ లేదా చేనేత చీర‌ను ఎంపిక చేసుకోవాలి. దానికి ప్లెయిన్ తెలుపు రంగు బ్లౌజ్ జ‌త చేస్తే స‌రిపోతుంది. ఈ వ‌స్త్రధార‌ణ‌కు త‌గిన విధంగా ఉండే యాక్సెస‌రీస్ ని ఎంపిక చేసుకుంటే చాలు!


A line Skirt


Shop the above look: Handloom Cotton Striped High-Low Skirt (Rs 2,800), Knitted White Stole (Rs 1,250), Three Pleated Jacket (Rs 5,800)


రోజంతా చీర‌ను క్యారీ చేయ‌డం క‌ష్టం అని భావించేవారు.. రోజూ ఫాలో అయ్యే ఫ్యాష‌న్స్ లోనే ఈ ట్రై క‌ల‌ర్స్ (Tricolours) ని ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. అంటే ఒక ఏ లైన్ స్క‌ర్ట్ తీసుకొని దానికి జ‌త‌గా ఆక‌ర్ష‌ణీయ‌మైన జాకెట్ వేసుకోండి.


అలాగే మ‌రో రంగుని దానిపై వేసుకునే స్టోల్ లో భాగం చేయండి. ఇలా సింపుల్‌గానే ప్లెయిన్ క‌ల‌ర్స్ ఉప‌యోగించే అంద‌మైన‌, ఆక‌ర్ష‌ణీయ‌మైన లుక్ ని మన సొంతం చేసుకోవ‌చ్చు.


Kurta


Shop the above look: Green A-Line Kurta (Rs 719), Pashmina Cashmere Stole In Orange (Rs 1,999), White chikankari Embroidered Palazzo (Rs 630)


సాధార‌ణంగా మ‌నంద‌రి ద‌గ్గ‌ర ప్లెయిన్ వైట్ క‌ల‌ర్ లో ఉన్న బాట‌మ్ త‌ప్ప‌నిసరిగా ఉండే ఉంటుంది. అది లెగ్గింగ్, జీన్స్, ప‌లాజో, ప్యాంట్స్.. ఇలా ఏదైనా కావ‌చ్చు.


దీనిని ఆరెంజ్ లేదా గ్రీన్ క‌ల‌ర్ కుర్తాకు జ‌త చేయ‌డం ద్వారా కూడా చ‌క్క‌ని లుక్ లో మెరిసిపోవ‌చ్చు. కావాలంటే ఫొటోలో చూడండి. తెలుపు రంగు ప్లెయిన్ బాట‌మ్ కి గ్రీన్ క‌ల‌ర్ కుర్తా జ‌త చేసి దానికి ఆరెంజ‌క క‌ల‌ర్ స్టోల్ మ్యాచ్ చేశారు. పాదాల‌కు షూస్, బోల్డ్ లిప్స్.. వంటి సింపుల్ యాక్సెస‌రీస్, మేక‌ప్ తోనే మ‌న లుక్ సుల‌భంగా పూర్తి చేసేయ‌చ్చు.


Flared Palazzo


Shop the pieces above: Ankle-Length Palazzo Pants (Rs 1,019), Embroidered Tunic with Bell Sleeves (Rs 779), Handloom Pure Silk Tussar Dupatta (Rs 2,999)


ఇవేవీ కాకుండా మ‌రింత సింపుల్ గా క‌నిపిస్తూనే హుందాగా మెరిసిపోవాల‌ని అనుకునేవారు త్రివ‌ర్ణ ప‌తాకంలోని ఏదైనా ఒక‌టి లేదా రెండు రంగుల‌నుత‌మ దుస్తుల్లో భాగం చేసుకున్నా స‌రిపోతుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఒక ఫెమినైన్ కుర్తా తీసుకొని దానికి ఫ్లేర్డ్ ప‌లాజోని జ‌త చేసి చూడండి. లేదా ప్లెయిన్ క‌ల‌ర్ చుడీదార్ ధ‌రించి దానికి మువ్వ‌న్నెల జెండాలోని ఒక రంగుని ఎంపిక చేసుకొని ఆ రంగులోని హెవీ దుప‌ట్టా వేసుకొని చూడండి. ఎంత బాగుంటుందో!!


ట్రై క‌ల‌ర్స్ ధ‌రించ‌డానికి ఇవి కొన్ని సూచ‌న‌లు మాత్ర‌మే. మ‌న సృజ‌నాత్మ‌క‌త‌కు కాస్త ప‌దును పెట్టాలే కానీ ఇలాంటి ఐడియాలు చాలానే వ‌స్తాయి. మ‌రొక ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే.. జెండాలోని రంగుల‌ను కేవ‌లం అవుట్ ఫిట్స్ లో మాత్ర‌మే కాదు.. యాక్సెస‌రీస్ లో కూడా భాగం చేసుకోవ‌చ్చు. మ‌రి, ఈ గ‌ణ‌తంత్ర దినోత్స‌వానికి మీరు ఎలాంటి దుస్తులు ధ‌రించాల‌నుకుంటున్నారు??


ఇవి కూడా చ‌ద‌వండి


నవరాత్రి ఫ్యాషన్ గురించి వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి


ఇండిపెండెన్స్ డే రోజు వేసుకోవాల్సిన సల్వార్ సూట్స్ గురించి ఆంగ్లంలో చదవండి


కాలేజీ స్పెషల్ కుర్తాల గురించి ఆంగ్లంలో చదవండి