తారల రాత్రి జీవితం గురించి.. మనకు చెప్పడానికి వచ్చేస్తోంది మంచు లక్ష్మి ..!

తారల రాత్రి జీవితం గురించి.. మనకు చెప్పడానికి వచ్చేస్తోంది మంచు లక్ష్మి ..!

సాధారణంగా మనం మన అభిమాన తారలకు (Movie Stars) సంబంధించిన వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటాం. వారు ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి నిద్రపోయే వరకూ ఏం చేస్తుంటారో  అందరికీ తెలుసు. షూటింగ్‌లో పాల్గొనడం.. ఫొటోషూట్స్, ప్రమోషన్స్‌లో బిజీగా ఉండడం.. అలాగే ఫిట్‌నెస్‌కి సంబంధించిన వ్యాయామాలు చేస్తూ గడిపేడం.. ఇవన్నీ వారి దినచర్యలో భాగమే.

అయితే ఎవరికీ తెలియకుండా వారు జీవితంలో ఏం చేస్తారు? రాత్రుళ్లు షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వెళ్లాక వారి జీవితం ఎలా ఉంటుంది? అన్న సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? ఈ విషయాలను తెలియజేయడానికే ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ (Feet Up With Stars) అనే షో ప్రారంభమవబోతోంది. ఈ షోకి ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

ఇప్పటికే హిందీలో ప్రసారమవుతున్న ఈ షో రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రముఖ సెల్రబిటీ స్టైలిస్ట్ అనితా ష్రాఫ్ అద్జానియా దీనికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వయా కామ్ 18 సంస్థ వారు ఈ కార్యక్రమాన్ని తెలుగులోనూ ప్రారంభించనున్నారు. దీనికి హోస్ట్‌గా మంచు లక్ష్మి వ్యవహరిస్తారు. స్టార్లతో వారు నిద్రించే బెడ్ పై కూర్చొని.. వారి రాత్రి అలవాట్ల గురించి మాట్లాడడమే ఈ షో ముఖ్యోద్దేశం.

బెడ్ పై ఎవరి కాళ్లైనా పైనే ఉంటాయి కాబట్టి.. దీనికి 'ఫీట్ అప్ విత్ స్టార్స్' అనే పేరు వచ్చింది. ఈ కార్యక్రమం గురించి లక్ష్మీ మంచు మాట్లాడుతూ  "ఈ చాట్ షో తెలుగు వర్షన్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ షో చాలా ఫన్‌గా, ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నా. ఇది చాలా క్యాజువల్. ఎంతో ప్రత్యేకమైనది. మనందరి అభిమాన తారలు తమ సీక్రెట్లన్నీ చెప్పే షోగా ఇది మారుతుంది.

దీన్ని ఎంతో సరదాగా, వినోదాత్మకంగా మార్చేందుకు నేను ప్రయత్నిస్తాను. ఇది నాకు మాత్రమే కాదు.. నేను ఇంటర్వ్యూ చేసే సెలబ్రిటీలకు.. కూడా చాలా ప్రత్యేకమైన షోగా మారుతుంది. అంతే కాదు.. ఇది సెలబ్రిటీలను వారి ఫ్యాన్స్‌కి మరింత దగ్గర చేస్తుంది" అని తెలిపారు మంచు లక్ష్మి.

"నేను ఇంటర్వ్యూ చేసే వ్యక్తుల్లో చాలామంది నా స్నేహితులు. ఇండస్ట్రీలో నాకు సన్నిహితులు. వారితో ఈ చాట్ షో నిర్వహించేందుకు నేను ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నా. ఇది నాక్కూడా ఓ అద్బుతమైన అనుభవంగా మారుతుంది. అందుకే ఈ షో కోసం నేను వేచి చూస్తున్నా" అని తెలిపారు మంచు లక్ష్మి.

ఈ షో వూట్ యాప్‌తో పాటు వెబ్ సైట్‌లో సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ షోకి సంబంధించి మంచు లక్ష్మి ఫొటోలతో పాటు..  హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ సమంతలను ఆమె ఇంటర్వ్యూ చేసిన ఎపిసోడ్లకు సంబంధించిన ఫొటోలు కూడా విడుదలయ్యాయి. సెప్టెంబర్ 23న మొదటి ఎపిసోడ్‌లో భాగంగా వరుణ్ తేజ్ ఇంటర్వ్యూ ప్రసారం కానుందట.

తారల జీవితానికి సంబంధించి ఇప్పటివరకూ.. బయటకు రాని విషయాలను బయటపెట్టేందుకు ఇప్పటికీ ఎన్నో షోలు వచ్చాయి. అందులో మంచు లక్ష్మి హోస్ట్ చేసిన ప్రేమతో మీ లక్ష్మి, రానా హోస్ట్‌గా నంబర్ వన్ యారీ, ప్రదీప్ యాంకర్‌గా కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా లాంటి వాటిని ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. మరి ఈ షోలన్నింటికీ భిన్నంగా.. ఫీట్ అప్ విత్ స్టార్స్‌లో ఎలాంటి కొత్త విషయాలు తెలుస్తాయన్నది చూడాల్సిందే.

గతంలో ప్రేమతో మీ లక్ష్మి, లక్కుంటే లక్ష్మి, దూసుకెళ్తా, మేము సైతం వంటి పాపులర్ షోలకు హోస్ట్‌గా వ్యవహరించింది మంచు లక్ష్మి. అటు సినిమాలతో పాటు.. ఇటు టీవీ షోల్లోనూ కనిపిస్తూ ఆమె తన ప్రత్యేకత చాటుకుంటోంది. ప్రస్తుతం 'జీ టీవీ'లో ప్రసారమవుతోన్న 'జీ హీరోస్' కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తోందామె. హిందీలో రూపొందిన 'ఖత్రోంకీ ఖిలాడీ'కి తెలుగు వర్షన్ లాంటిది ఈ షో.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.