అలాంటి సినిమాలు నేను చేయను.. పాత్రల విషయంలో పక్కాగా ఉంటా: రష్మిక

అలాంటి సినిమాలు నేను చేయను.. పాత్రల విషయంలో పక్కాగా ఉంటా: రష్మిక

"గీత గోవిందం" చిత్రంలో తన నటనతో టాలీవుడ్ మొత్తాన్ని ఆకర్షించిన కథానాయిక రష్మిక మందాన (Rashmika Mandanna). "ఛలో" చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తన కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. ఆ తర్వాత నాగ్, నాని నటించిన "దేవదాస్" చిత్రంలోనూ కనువిందు చేసింది. ప్రస్తుతం "డియర్ కామ్రేడ్" చిత్రంలో కూడా నటిస్తోంది. ఇటీవలే ఓ ప్రముఖ వెబ్ సైటుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది రష్మిక. అందులో తన కెరీర్, ఫ్యూచర్ ప్లాన్స్ మొదలైన విషయాలన్నీ కూడా తన అభిమానులతో పంచుకుంది.

ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న "సరిలేరు నీకెవ్వరూ" చిత్రంలో.. రష్మిక కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే అల్లు అర్జున్ నటిస్తున్న "ఐకాన్" చిత్రంలో కూడా ఆమె నటిస్తోంది. ఈ రెండు చిత్రాలలో తాను నటిస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నానని.. ప్రేక్షకులు తనను ఆదరించడం వల్లే తనకు ఈ అవకాశాలు దక్కాయని తెలిపారామె. "గీత గోవిందం" హిట్ అయ్యాక.. తనకు చాలా చిత్రాలలో ఆఫర్స్ వచ్చాయని.. కాకపోతే కేవలం గ్లామర్ పాత్రలవైపే తాను మొగ్గుచూపనని.. పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న చిత్రాలకే తన మొదటి ప్రాధాన్యమని ఈ సందర్భంగా తెలియజేశారు రష్మిక. నితిన్ నటిస్తున్న "భీష్మ" చిత్రంలో కూడా నటిస్తున్న రష్మిక... ఆ సినిమా టీమ్‌తో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. "ఛలో" చిత్రాన్ని తీసిన వెంకీ కుడుముల.. భీష్మ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. 

ప్రస్తుతం రష్మిక తెలుగు, మలయాళం, తమిళ సినిమాలలో బిజీగా ఉన్నారు. ఇంకా మరెన్నో భాషల్లో కూడా తనకు సినిమాలు చేయాలని ఉందని ఈ సందర్భంగా రష్మిక తెలియజేశారు. తనకు బిజీగా ఉండడం అంటేనే నష్టమని.. అలాగే నటిస్తూ ఉండడం అంటే మరింత ఇష్టమని ఆమె అన్నారు. కాకపోతే కమర్షియల్ చిత్రమా.. ఆర్ట్ చిత్రమా అనే విషయాన్ని తాను పట్టించుకోనని.. కేవలం పాత్ర నచ్చితేనే ఆ చిత్రాన్ని చేస్తానని రష్మిక తెలిపారు. ప్రస్తుతం నటుడు కార్తీ హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో కూడా నటిస్తున్నారు రష్మిక.

ఈ కథనం కూడా చదవండి: పుట్టిన రోజు నాడు.. ర‌ష్మిక ఎందుకు అలిగిందో మీకు తెలుసా..?

రష్మిక కర్ణాటకలోని కొడగు జిల్లాలో జన్మించింది. జర్నలిజంలో డిగ్రీ చేసింది. చదువుకుంటున్న రోజుల్లోనే మోడలింగ్ వైపు మొగ్గుచూపింది. 2017లో రక్షిత్ శెట్టి అనే నటుడితో డేటింగ్ చేసింది. ఆ తర్వాత వారి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల వారు తర్వాత బ్రేకప్ అయ్యారు. కన్నడ చిత్రాలతో తన కెరీర్ మొదలుపెట్టిన రష్మిక.. 2016లో "కిరాక్ పార్టీ" అనే కన్నడ చిత్రంలో నటించింది. ఆ చిత్రం పెద్ద హిట్. ఆ చిత్రంతోనే దక్షిణాది దర్శకుల దృష్టిలో రష్మిక పడింది. "కిరాక్ పార్టీ" చిత్రం తెలుగులో కూడా.. నిఖిల్ హీరోగా తెరకెక్కిన విషయం తెలిసిందే. 

ఈ కథనం కూడా చదవండి: మహేష్ బాబు vs అక్కినేని అఖిల్.. ఈ ఇద్దరిలో రష్మిక ఓటు ఎవరికి?

కన్నడంలో తాను నటించిన "కిరాక్ పార్టీ" చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకున్న రష్మిక .. గీత గోవిందం చిత్రంలో నటనకు గాను.. ఫిల్మీబీట్ అవార్డు, జీ సినీ అవార్డు కూడా అందుకోవడం విశేషం. 

ఈ కథనం కూడా చదవండి: ఈ ముద్దుకు... కథకు సంబంధముంది: 'డియర్ కామ్రేడ్' కథానాయిక రష్మిక

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.