మా అమ్మ నాకంటే గొప్పది.. తన నుండి ఎన్నో నేర్చుకున్నాను : సమంత అక్కినేని

మా అమ్మ నాకంటే గొప్పది.. తన నుండి ఎన్నో నేర్చుకున్నాను : సమంత అక్కినేని

'My Mom is my Inspiration' says Samantha Akkineni

సమంత అక్కినేని.. టాలీవుడ్ అగ్ర కథానాయిక. 'ఏ మాయ చేశావె' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనా.. ఆ తర్వాత నాగచైతన్యని వివాహం చేసుకొని.. అక్కినేని వారి కోడలుగా కూడా మారింది. యూటర్న్, ఓ బేబీ లాంటి చిత్రాలతో సోలో హీరోయిన్‌గా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్న సమంత.. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను కూడా చేస్తోంది. ఇటీవలే తన ఫౌండేషన్‌కు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది సమంత. తన సేవా గుణానికి ప్రేరణ.. తన తల్లి అందించిన స్ఫూర్తే అని ఆమె పేర్కొంది. 

"చైతూకి నాపై ఉన్న కంప్లైంట్.. అదొక్కటే" : సమంత

"ప్రస్తుతం ఇతరులకు సహాయం చేసే స్థితిలో నేను ఉన్నాను. భగవంతుడు నాకు అందించిన ఈ అవకాశాన్ని నేను కచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ విషయంలో నేను మా అమ్మ నుండే ప్రేరణను పొందాను. తనకు ఒకరికి ఇచ్చే స్థోమత లేకపోయినా.. తనకు చేతనైన రీతిలో ఎదుటివారికి సాయం చేసేది. ఆ గుణమే నాకు కూడా వచ్చింది. నా సినిమాలు ఎంత బాగా ఆడినా.. అమ్మ చలించదు. కానీ నా వల్ల ఒకరికి ఏదైనా మేలు జరుగుతుందంటే చాలు.. తాను ఎంతగానో సంతోషిస్తుంది" అని తన మదిలోని భావాలను బయట పెట్టింది సమంత. 

సమంత శరీరంపై ఉన్న ఈ సీక్రెట్ టాటూ.. ఏం చెబుతుందో తెలుసా?

"భవిష్యత్తులో ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలను చేయాలని ఉంది. చైతూ కూడా నాకు తోడుగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. నాకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి తాను ఎప్పుడూ ముందుంటాడు. తన వంతు సపోర్టు అందిస్తూ ఉంటాడు" అని తెలిపింది సమంత. 2017లో సమంత చేనేత పరిశ్రమలను ప్రమోట్ చేసే బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా తెలంగాణ ప్రభుత్వం చేత నియమించబడింది. ప్రస్తుతం "96" తెలుగు రీమేక్‌లో నటిస్తున్న సమంత.. ఓ వెబ్ సిరీస్‌కు కూడా సైన్ చేయడం గమనార్హం.    

 

View this post on Instagram

My favourite pic ... ❤️ . Thankyou for this @raj.rj

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

సమంత తన ఫౌండేషన్ "ప్రత్యూష సపోర్ట్" ద్వారా అణగారిన వర్గాలకు చెందిన మహిళలు, చిన్నపిల్లలకు ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. తన బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ ఫౌండేషన్‌కే సమంత డొనేట్ చేయడం గమనార్హం. ప్రముఖ వైద్యురాలు మంజుల అనగానితో కలిసి.. సమంత ఈ ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఫౌండేషన్ కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించడం.. సెలబ్రిటీ ఫ్యాషన్ షోలు నిర్వహిస్తూ.. తద్వారా వచ్చే ఆదాయాన్ని సంస్థకు అందివ్వడం లాంటి వినూత్న పద్థతులకు సమంత శ్రీకారం చుట్టడం విశేషం.

అదే సంవత్సరం... అదే తేదిన నాకు బిడ్డ పుడతాడు : సమంత అక్కినేని

ఇక సినిమాల విషయానికి వస్తే.. 2019లో "రంగస్థలం" చిత్రంలోని నటనకు గాను.. సైమా పురస్కారాన్ని అందుకుంది సమంత. అలాగే 2018లో దక్షిణ భారతదేశంలో అత్యంత ఎక్కువ ఫాలోయింగ్ కలిగిన కథానాయికగా.. "సోషల్ మీడియా సమ్మిట్" అవార్డును కూడా కైవసం చేసుకుంది సమంత. కేరళలో పుట్టి పెరిగిన సమంత తల్లి ఓ మలయాళీ కాగా.. తండ్రి ఓ తెలుగు వ్యక్తి. ఆ బాల్యం అంతా కూడా తమిళనాడులోని పల్లవరంలోనే గడిచింది. తమిళ, తెలుగు భాషలతో పాటు.. హిందీ చిత్రం "ఏక్ దీవానా థా"లో అతిథి పాత్రలో కూడా నటించింది సమంత.

Images: Instagram.com/Samantha Akkineni

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.