భాగ్యనగరంలో బీజింగ్ కళ చూస్తారా.. అయితే ఈ చైనీస్ రెసార్టెంట్లకు వెళ్లాల్సిందే..!

భాగ్యనగరంలో బీజింగ్ కళ చూస్తారా.. అయితే ఈ చైనీస్ రెసార్టెంట్లకు వెళ్లాల్సిందే..!

ఒక్కో దేశం ఒక్కో వంటకానికి పెట్టింది పేరంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే మ‌న దేశంలో మాత్రం ఇటు భారతీయ వంటకాలతో పాటు ఇటలీ, థాయ్ లాండ్, మ‌లేసియా దేశాల వంటకాలను కూడా జనాలు ఇష్టపడడం గమనార్హం. గతకొంత కాలంగా ఈ జాబితాలో చైనీస్ ఫుడ్ (Chinese Food) కూడా చేరిపోవడం విశేషం.


ఈ రోజుల్లో ఎక్క‌డ చూసినా ఫాస్ట్ ఫుడ్ క‌ల్చ‌ర్ బాగా పెరిగిపోయింది. భాగ్యనగరంగా పేరుగాంచిన మ‌న హైద‌రాబాద్‌లో అయితే  ఈ మధ్యకాలంలో ఈ కల్చర్ మరింత పెరిగింది..! వీధికో ఫుడ్ జాయింట్ ద‌ర్శ‌నమివ్వడమే అందుకు ప్రధాన కారణం. ఈ ఫుడ్ జాయింట్స్‌లో కూడా చైనీస్ వంటకాలు విరివిగా లభిస్తున్నాయి.


అలాగే హైద‌రాబాద్‌లోనే పేరెన్నిక గల టాప్ రెస్ట‌ారంట్స్ కూడా పలు స్పెషల్ చైనీస్ రెసిపీస్‌ను ప్ర‌త్యేకంగా అందిస్తున్నాయి. లోక‌ల్ ఫుడ్ జాయింట్స్‌తో పోలిస్తే వీటి ధ‌ర కాస్త ఎక్కువే అయిన‌ప్ప‌టికీ.. అస‌లు సిస‌లు చైనీస్ వంట‌కాల రుచిని ఆస్వాదించాలంటే ఈ రెస్ట‌ారంట్స్‌కు వెళ్ల‌క త‌ప్ప‌దు మ‌రి! అయితే మన హైద‌రాబాద్‌లో చైనీస్ వంట‌కాల‌కు స్పెష‌ల్ అనిపించుకునే ఆ రెస్ట‌ారంట్స్ ఎక్క‌డెక్క‌డ ఉన్నాయో మీకు తెలుసా??


చైనీస్ ఫుడ్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచే ఆ రెస్ట‌ారంట్స్ వివరాలివే..!


"నాన్ కింగ్ రెస్టారంట్" (Nanking Restaurant) - ఇది సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ సర్కిల్ ప్రాంతంలో ఉంది. ఈ హోటల్లో చైనీస్‌తో పాటుగా సీ ఫుడ్ కూడా లభిస్తుంది.


"డైన్ ఓ చైనా" (Dine O China)- ఈ రెస్టారెంట్ గచ్చిబౌలిలో ఉంది. ఇక్కడ చైనీస్‌తో పాటుగా ఏషియన్ & మోమోస్ వంటి వంటకాలు లభిస్తాయి.


"చైనా బిస్ట్రో" (China Bistro) - జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఈ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ చైనీస్‌తో పాటుగా థాయ్, ఏషియన్ & మోమోస్ వంటి ప‌దార్ధాలను రుచి చూడవచ్చు.


"ది వన్ టన్" (The Wonton)- గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ఈ రెస్టారెంట్‌లో మలేసియన్, థాయ్ & చైనీస్ వంటకాలు ల‌భ్య‌మ‌వుతాయి.


chinease-dim-sum-and-momos


సాఫ్ర‌న్ మంత్ర" (Saffron Mantra)- సికింద్రాబాద్ దగ్గర్లోని ఖార్ఖానాలో ఉంది ఈ రెస్టారంట్. ఇందులో ప్రత్యేకించి చైనీస్‌తో పాటుగా నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా భోజ‌న ప్రియుల‌కు అందుబాటులో ఉంటుంది.


"కిమ్ ఫున్గ్" (Kim Fung) - తార్నాకలో ఉన్న ఈ రెస్టారంట్‌కి సంబంధించి వివరాలు చూస్తే - ఇక్కడ చైనీస్‌తో పాటుగా రుచికరమైన వెజ్ - నాన్ వెజ్ మోమోస్ కూడా దొరుకుతాయి.


"అరోమాస్ అఫ్ చైనా" (Aromas Of China) - చైనీస్‌తో పాటుగా థాయ్, ఏషియన్ & సీ ఫుడ్ దొరికే ఈ రెస్టారెంట్ బంజారా హిల్స్‌లో ఉంది. ఇక్కడ పదార్ధాలు బహు రుచిగా ఉంటాయి అని వినికిడి.


chinease-food-colours


"మెయిన్ ల్యాండ్ చైనా" (Mainland China)- హైటెక్ సిటీలో ఉన్న ఈ రెస్టారెంట్‌కి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చైనీస్‌తో పాటుగా మోమోస్ & సీ ఫుడ్ లభిస్తాయి.


"అలెక్స్ కిచెన్" (Alex's Kitchen) - ఈ రెస్టారెంట్ హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో ఉంది. ఇక్క‌డ రుచికరమైన మోమోస్ & చైనీస్ ఫుడ్ ఐటమ్స్ ల‌భిస్తాయి.


"షాంగై చెఫ్ 2" (Shanghai Chef 2)- పేరుతో పాటుగా ఇక్కడ పదార్థాలు కాస్త వైవిధ్యంగానే ఉంటాయి. హైదరాబాద్‌లో ఇండోనేషియన్ ఫుడ్ (Indonesian Food) దొరికే అతి తక్కువ రెస్టారెంట్స్‌లో ఇది ఒకటి. ఇక్కడ చైనీస్‌తో పాటుగా థాయ్ & ఏషియన్ వంటకాల్ని కూడా రుచి చూడవచ్చు. ఈ రెస్టారెంట్ గచ్చిబౌలిలో ఉంది.


 

ఈ పైన పేర్కొన్న రెస్టారెంట్స్‌తో పాటుగా.. జిగ రెస్టరంట్ (Zega Restaurant) కూడా మార్చి 18 నుండి ఏప్రిల్ 30 వరకు డిమ్ సమ్ ఫీస్ట్ (Dim Sum Feast) ని నిర్వ‌హిస్తోంది. ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో ప్రత్యేకంగా అందిస్తోన్న వంటకాలు -


* తుక్పా సూప్ (Thukpa Soup)


* ప్యాన్ ఫ్రైడ్ చికెన్ గ్యోజా ( Pan Fried Chicken Gyoza)


* సీషువాన్ స్పైసి పోర్క్ డిమ్ సమ్ (Sichuan Spicy Pork Dim Sum)


* ప్రాణ్ క్రిస్టల్ డంప్లింగ్ (Prawn Crystal Dumpling)


* క్రిస్పీ ఫిష్ చిల్లీ ఇన్ ప్లమ్ సాస్ ( Crispy Fish Chilli in Plum Sauce)


ఇక ఈ ఫెస్టివల్‌లో నాన్ -వెజ్ (Non-Veg) తినని వారికి రుచికరమైన వెజ్ (Veg) వంటకాలను కూడా ఆ మెనూలో చేర్చారు. ఇంత‌కీ ఆ పదార్ధాలు ఏంటంటే -


* బీజింగ్ డంప్లింగ్ (Beijing Dumpling)


* బ్రెయిజ్డ్ వంటన్స్ (Braised Wontons)


* బోక్ చోయ్ రోస్టెడ్ గార్లిక్ (Bok Choi Roasted Garlic)


* నాపా క్యాబేజ్ క్రిస్టల్ (Napa Cabbage Crystal)


* క్రిస్పీ ఫ్రైడ్ టర్నిప్ (Crisp Fried Turnip)


* షిటాకె కేక్స్ (Shitake Cakes)


ఇక చివరగా వీటితో పాటుగా నోరూరించే మీరు మెచ్చిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్‌తో పాటుగా ఒక బనానా టాఫీ (Banana Toffee)ని కూడా ఇక్క‌డ రుచి చూడవచ్చు. ఈ డిమ్ సమ్ ఫెస్టివల్‌లో పాల్గొని పైన పేర్కొన్న రుచికరమైన పదార్ధాలను టేస్ట్ చేయాలంటే చెల్లించాల్సిన మొత్తం రూ 799/- మాత్రమే.. ఇంతకి ఈ జిగ రెస్టారెంట్ ఉన్నది ఎక్క‌డో తెలుసా?? గచ్చిబౌలి (Gachibowli) లోని షెరటాన్ హోటల్స్ (Sheraton Hotels)లో...


అన్ని వివరాలు తెలుసుకున్నారు క‌దా..! మరింకెందుకు ఆలస్యం... త్వరగా ఈ ఫుడ్ ఫెస్టివల్‌కి వెళ్లి రుచికరమైన చైనీస్ వంటకాల్ని రుచి చూసేయండి.


ఇవి కూడా చ‌ద‌వండి


బాబోయ్.. పెళ్లి శుభలేఖలను ఎంపిక చేయాలంటే.. చాలా కష్టమే సుమండీ..!


క్రికెట్ లోనే కాదు.. సోష‌ల్ మీడియాలోనూ రికార్డు సృష్టిస్తోన్న కోహ్లీ..!


'మా' ఎలక్షన్స్‌లో మహిళల సత్తా.. కీలక పదవుల్లో జీవిత రాజశేఖర్, హేమ..!