ఆకాశమంత పందిరి.. భూదేవంత పీట.. అంటూ పెళ్లి గురించి చెబుతుంటే మనం అతిశయోక్తి అనుకొంటాం. కానీ అంబానీ ఇంట జరిగిన పెళ్లిని చూస్తే.. అది అతిశయోక్తి కాదు నిజమే అనిపిస్తుంది. ఆ పెళ్లి మండపం, ఆ అలంకరణ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు.. చూడాలంటే రెండు కళ్లు సరిపోవు. విశాలమైన పెళ్లి వేదిక.. వావ్ అనిపించేలా చేసిన పూల అలకంరణలు.. ఒకటా రెండా.. ఆకాశ్-శ్లోకా వివాహం గురించి చెప్పాలంటే ఎన్నో ప్రత్యేకతలున్నాయి. మూడు నెలల క్రితం జరిగిన ఇషా-ఆనంద్ పెళ్లి ఇంకా కళ్ల ముందు మెదులుతూ ఉండగానే.. అంతకంటే గ్రాండ్ గా జరిగింది ఆకాశ్ అంబానీ-శ్లోకా మెహతా వివాహం. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో పందిరేసినట్టుగా.. దేశమంతా చర్చించుకొనేంత ముచ్చటగా జరిగిన ఈ వివాహ వేడుక ప్రత్యేకతలేంటో ఓసారి చూద్దాం..
అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ(Akash Ambani). రోజీ బ్లూ డైమండ్స్ సీఈవో రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతా(Shloka Mehta). శనివారం రాత్రి వీరిద్దరికీ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగింది. మూడు రోజుల పాటు ముచ్చటగా సాగే వివాహ వేడుక ఇది. తొమ్మిదవ తేదీన వివాహం, పదోతేదీన మంగళ పర్వ్ జరగగా పదకొండో తేదీన అంటే ఈ రోజు మంగళ ఆశీర్వాద్ తో పాటు రిసెప్షన్ కూడా జరగనుంది.
ఆకాశ్, శ్లోక ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో కలసి చదువుకొన్నారు. గతేడాది శ్లోకా మెహతాకు ఆకాశ్ అంబానీ పెళ్లి ప్రతిపాదన చేసిన తర్వాత ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది.
తమ కుమారుడి పెళ్లి బారాత్లో ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ ఇద్దరూ ఉత్సాహంగా స్టెప్పులేశారు. వీరితో పాటు షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్ కూడా స్టెప్పులేశారు.
View this post on Instagram
ఇక ఆకాశ్ - శ్లోకల పెళ్లి వేడుకలో మరో ఆకర్షణ మ్యూజికల్ వాటర్ ఫౌంటెయిన్ కమ్ డ్యాన్స్. దాదాపు 150 మంది జాతీయ, అంతర్జాతీయ డ్యాన్సర్లు నృత్యప్రదర్శన చేశారు. ఈ పెళ్లి వేడుకలో మరో హైలైట్.. నీతా అంబానీ అతిథులను ఆహ్వానిస్తూ చేసిన ప్రత్యేక నృత్యప్రదర్శన మొత్తం పెళ్లి వేడుకలకే హైలైట్గా నిలవడం విశేషం.
View this post on Instagram
ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన వివాహ మహోత్సవానికి బాలీవుడ్ తారాతోరణం దిగి వచ్చింది. రజనీ కాంత్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోణ్, అలియా భట్.. తదితరులు విచ్చేసి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వీరందరితో పాటు ఇటీవల క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న సోనాలీ బింద్రే కూడా ఈ వేడుకలకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
View this post on Instagram
ఆకాశ్ – శ్లోకా వివాహ వేడుకలకు దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఆయన భార్య చెరీ బ్లెయిర్ దంపతులు, ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ దంపతులు ఆకాశ్ - శ్లోకాల వివాహ వేడుకకు హాజరయ్యారు. రతన్ టాటా, లక్ష్మీ మిత్తల్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వంటి హేమాహేమీలు హాజరయ్యారు. ఇక క్రీడారంగం నుంచి సచిన్ తెందుల్కర్, పీవీ సింధు, హార్థిక్ పాండ్య, కృనాల్ పాండ్య, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్.. తదితరులు కూడా హాజరయ్యారు.
మంగళ పర్వ్ కార్యక్రమానికి అభిషేక్, ఐశ్వర్య దంపతులు, అరుంధతీ భట్టాచార్య, గౌతమ్ అదానీ, శశీరుయా, బోనీకపూర్, శిల్పాశెట్టి, రేఖ, సచిన్ తెందుల్కర్ వంటి విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
View this post on Instagram
మరో విశేషమేంటంటే.. మంగళ పర్వ్ రోజున ఆకాశ్, శ్లోక ఇద్దరూ కలసి నృత్యం చేశారు. ప్రముఖ గాయకుడు ఆడమ్ లెవీన్ పాడిన ‘షి విల్ బి లవ్డ్’ అనే పాటకు స్లో డ్యాన్స్ చేశారు. గోల్డ్ లెహంగా లో శ్లోకా మెరిసిపోగా.. రాయల్ బ్లూ కలర్ షేర్వాణీలో ఆకాశ్ రాజసంగా కనిపించాడు.
పెళ్లి అంటే మనకు గుర్తొచ్చేది విందు భోజనం. అందులోనూ అంబానీ ఇంట్లో పెళ్లి అంటే.. ఆ విందు మహరంజుగా ఉంటుంది. వధూవరులను ఆశీర్వదించడానికి విచ్చేసిన అతిథులకు వడ్డించడానికి వివిధ రకాల వంటకాలను సిద్ధం చేశారు.
View this post on Instagram
అంబానీల ఇంట పెళ్లి వైభవం పెళ్లి మండపం డెకరేషన్ లోనూ కనిపిస్తోంది. అందుకే దానిని వివిధ రకాల పూలతో అలంకరించారు. రంగురంగుల పూలతో కళ్లు చెదిరేలా వివిధ రకాల ఆకృతులను పేర్చారు.
Images: Pallav_Paliwal
ఇవి కూడా చదవండి
భార్యాభర్తల బంధం ఎలా ఉండాలో ఈ అక్కినేని జంటను చూసి నేర్చుకోవాల్సిందే..
ఈ న్యాయవాది.. మనదేశంలోనే కులం, మతం లేని మొదటి వ్యక్తి
కూతురిపై ప్రేమతో.. అమ్మ ఎక్కువగా అడిగే ప్రశ్నలు, ఇచ్చే సూచనలు ఇవే..!