బిగ్‌బాస్ తెలుగు: వరుణ్ సందేశ్ పై.. వితిక అలగడానికి అసలు కారణం ఇదేనా!

బిగ్‌బాస్ తెలుగు: వరుణ్ సందేశ్ పై.. వితిక అలగడానికి అసలు కారణం ఇదేనా!

"బిగ్ బాస్ తెలుగు సీజన్ 3"తో (Bigg Boss Telugu 3).. మిగతా రెండు సీజన్స్‌కి ఉన్న ఒక పెద్ద వ్యత్యాసం ఏంటంటే - తొలిసారిగా భార్యాభర్తలని కంటెస్టెంట్స్‌గా  హౌస్‌లోకి పంపించడం. అలా ఆలుమగలను కంటెస్టెంట్స్‌గా పంపించారు కాబట్టి .. వీరిరువురి మధ్య మంచి అవగాహన ఉంటుందని.. హౌస్‌లో చాలా సులభంగానే మెలుగుతారని అందరూ అనుకున్నారు.

బిగ్ బాస్ తెలుగు: తమన్నా గేమ్ 'ప్లాన్స్'..

అయితే నిన్నటి ఎపిసోడ్ చూసాక మాత్రం, బిగ్‌బాస్ హౌ‌స్‌లోకి ఒక్కసారి వచ్చాక.. భార్యాభర్తలు అయినా.. అన్నదమ్ములు అయినా.. అక్కచెల్లెలు అయినా ఎక్కడో ఒక చోట అదుపుతప్పుతారని.. అలాగే ఒకరిపై ఒకరు కోపగించుకుంటారని స్పష్టమైంది. ఇంతకి జరిగిందేంటంటే - లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ హౌస్‌లో వాడకానికి నీళ్లు, వంటకు గాను గ్యాస్, అలాగే హౌస్ యాక్సెస్ కోసం.. ఎటువంటి అంతరాయం కలగకుండా ఇంటి ఆవరణలో ఉన్న మూడు సైకిల్స్‌ని ఆపకుండా తొక్కుతూ ఉండాలి.

అయితే నీళ్ల కోసం ఒక సైకిల్.. అలాగే హౌస్ యాక్సెస్ & గ్యాస్ కోసం కూడా మరో రెండు సైకిల్స్ ఇవ్వగా.. అందులో దేనిని ఆపకుండా తొక్కినా.. దానికి సంబంధించిన సౌలభ్యం ఇంటి సభ్యులకి ఉంటుంది. ఈ టాస్క్‌లో భాగంగా సైకిల్ తొక్కడానికి ఇంటి సభ్యులందరూ.. ఒకరితో ఒకరు పోటీలు పడ్డారు. అలా టాస్క్ కొనసాగుతున్న సమయంలో పునర్నవి ( Punarnavi Bhupalam) - "నువ్వు కూడా టాస్క్‌లో పార్టిసిపేట్ చెయ్యి" అని వరుణ్ సందేశ్ భార్య వితికకు చెప్పడం జరిగింది. దానికి వెంటనే - "అదేంటి ఇంటిలో సభ్యులకి టిఫిన్ చేసింది నేనే కదా! అందరికి వంట చేసి పెట్టడం కూడా టాస్క్‌లో భాగమే" అని కాస్త గట్టిగా స్వరం పెంచి సమాధానమిచ్చింది వితిక.

దానికి కొనసాగింపుగా "టాస్క్ అంటే సైకిల్ తొక్కడం. వంట చేయడం కాదు" అని పునర్నవి సమాధానమివ్వగా - "అవును.. పునర్నవి చెప్పేదాంట్లో తప్పేముంది. నువ్వెందుకు అలా గట్టిగా మాట్లాడుతున్నావు?" అని వితికని ఉద్దేశించి వరుణ్ సందేశ్ (Varun Sandesh) మాట్లాడడం జరిగింది. దీనితో ఒక్కసారిగా కోపాన్ని ఆపుకోలేక.. అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ "దయచేసి ఎవ్వరు మాట్లాడకండి. మరి ముఖ్యంగా నువ్వేమి మాట్లాడకు.. వరుణ్" అంటూ ఏడ్చుకుంటూ వాష్ రూమ్ వైపుకి వెళ్ళిపోయింది వితిక.

ఒక్కసారిగా చిన్న మాటతో మొదలైన సంవాదం.. ఆఖరికి చిలికి చిలికి వితిక (Vithika) ఏడవడం వరకు వెళ్ళింది. ఇక ఇంటి సభ్యులు, అలాగే వరుణ్ సందేశ్ నచ్చజెప్పే ప్రయత్నం చెప్పడంతో వితిక కాస్త మెత్తబడింది. అయితే బ్రతిమిలాడే సమయంలో "సారీ" అని చెప్పిన తరువాత.. వితిక శాంతించడం ఈ మొత్తం ఎపిసోడ్‌కి కొసమెరుపు అని చెప్పాలి. అలాగే వితిక మాట్లాడుతూ - "ఉదయం కిచెన్‌లో కూడా అనవసరంగా తనకి అది చెయ్ & ఇది చెయ్ అని మాట్లాడడం వల్ల కాస్త డిస్ట్రబ్ అయ్యాను.. ఇక ఇప్పుడు మళ్ళీ తప్పు మొత్తం నాదే అని నువ్వే అంటుంటే ఇంకేం చేయాలో తెలియక ఏడ్చేసా" అని తన భావోద్వేగానికి కారణం చెప్పింది వితిక.

బిగ్‌బాస్ తెలుగు: వితిక కోసం మహేష్ విట్టాతో.. వరుణ్ సందేశ్ వాగ్వాదం

ఈ సన్నివేశం జరగకముందు సైకిల్ని ఎవరు ఎంతసేపు తొక్కాలి? అన్న టాపిక్ పైన శివ జ్యోతి అలియాస్ సావిత్రక్కకి.. ఇంటి సభ్యులకి మధ్య కాస్త గట్టిగానే చర్చ నడిచింది. చివరికి సైకిల్ తొక్కడానికి శివ జ్యోతికి అవకాశం రావడంతో డిస్కషన్‌కి బ్రేక్ పడింది. ఇదిలాఉండగా.. ఇంటి సభ్యులందరూ కూడా ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ని ఎలాగైనా సాధించాలి అని గేమ్‌ని కూడా స్మార్ట్‌గానే ఆడుతున్నారు.

ఏదేమైనా... ఈరోజు ఎపిసోడ్‌లో భార్యాభర్తలైన వితిక-వరుణ్ సందేశ్‌ల మధ్య జరిగిన గొడవ హైలైట్‌‌గా నిలిచింది. ఇక రేపు ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమోలో.. శివ జ్యోతి & వరుణ్ సందేశ్‌ల మధ్య యేవో భేదాభిప్రాయాలు తలెత్తినట్టుగా తెలుస్తోంది. చూద్దాం... ఈ ప్రోమోలో ఇచ్చిన హింట్ ఎంతవరకు మనకి ఎపిసోడ్‌లో కనిపిస్తుందో!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3... టైటిల్ గెలిచే కంటెస్టెంట్ ఎవరు?