Bigg Boss Telugu 3 : బాబా భాస్కర్‌ని టార్గెట్ చేసిన.. వరుణ్ సందేశ్, వితిక & పునర్నవి

Bigg Boss Telugu 3 : బాబా భాస్కర్‌ని టార్గెట్ చేసిన.. వరుణ్ సందేశ్, వితిక & పునర్నవి

(Varun Sandesh, Vithika and Punarnavi targets Baba Bhaskar in Bigg Boss Telugu Show)

'బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3'లో భాగంగా.. 11వ వారం సగానికి చేరుకుంది ఈ రియాలిటీ షో. అలాగే నిన్నటితో ఈ వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్క్ పూర్తయింది.  ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న సభ్యులు - రాహుల్ సిప్లిగంజ్, మహేష్ విట్టా, పునర్నవి & వరుణ్ సందేశ్.

ఇక 'రాళ్లే రత్నాలు' పేరుతో జరిగిన టాస్క్ చివరికి వచ్చేసరికి.. అలీ రెజా, బాబా భాస్కర్, వితిక, శివజ్యోతిలు ఎక్కువ విలువ గల రాళ్లతో టాప్ నాలుగు స్థానాలలో నిలవడం విశేషం. 

అయితే ఈ టాస్క్ ముగిసిన తరువాత.. బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరి ముఖ్యంగా బాబా భాస్కర్‌ని టార్గెట్ చేస్తూ.. ఇంటి సభ్యులు చేస్తున్న కామెంట్స్‌ను కూడా ప్రోమోలో ప్రసారం చేయడం జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే, టాస్క్‌లో భాగంగా.. లాస్ట్ బజర్ ముందు.. అందరూ తమ రాళ్ల విలువలని లెక్కించుకోగా.. బాబా భాస్కర్ & వరుణ్ సందేశ్‌‌లకి మధ్య చాలా స్వల్పంగా.. ఓ 100 పాయింట్లు మాత్రమే తేడా ఉండడం గమనార్హం. 

Bigg Boss Telugu 3: మరోసారి ఘర్షణ పడిన.. వరుణ్ సందేశ్ & వితిక షేరు

అయితే ఈ తేడాని గమినించిన వితిక తన వద్ద ఉన్న రాళ్ళలో.. కొన్నింటిని వరుణ్ సందేశ్‌కి ఇవ్వడం జరిగింది. దానితో బాబా భాస్కర్ & వరుణ్ సందేశ్‌ల వద్దనున్న రాళ్ల విలువ సమానంగా మారింది. ఆ తరువాతే రాళ్ల వర్షం కురవడం జరిగింది. ఇక లాస్ట్ బజర్ వచ్చేసరికి.. అందరి వద్దనున్న రాళ్ల విలువను లెక్కగడితే.. ఎవ్వరూ ఊహించని విధంగా బాబా భాస్కర్ వద్ద 3700 విలువ గలిగిన రాళ్ళు ఉండడం గమనార్హం. ఇదే క్రమంలో వరుణ్ సందేశ్ వద్దనున్న.. రాళ్ల విలువ అందరికన్నా తక్కువ ఉండడంతో.. తాను ఈవారం నామినేషన్స్‌లోకి వెళ్లి నాల్గవ సభ్యుడయ్యాడు.

ఇక ఇదే అంశం పై.. ఇంటిలోకి వెళ్లిన తరువాత వరుణ్ సందేశ్, వితిక & పునర్నవిలు బాబా భాస్కర్‌ని టార్గెట్ చేస్తూ మాట్లాడసాగారు. అందరికి తక్కువ లెక్క చూపెట్టి.. చివరికి వచ్చేసరికి అందరికన్నా ఎక్కువ విలువ గలిగిన రాళ్ళని సొంతం చేసుకున్నాడని అభిప్రాయపడ్డారు.

అలాగే పునర్నవి మాట్లాడుతూ - "నేను పడుకున్న సమయంలో నా దగ్గర ఉన్న రాళ్ళని ఆయన తీసుకున్నాడేమో" అని అనుమానాన్ని వ్యక్తం చేసింది. వరుణ్ సందేశ్ కూడా మాట్లాడుతూ - " తనకేం.. ఏమి లేవు నా దగ్గర అని చెప్పి.. మన దగ్గర ఎంత విలువ గలిగిన రాళ్ళు ఉన్నాయో  తెలుసుకుంటూ గేమ్ ఆడాడు" అని చెప్పడం జరిగింది.

Bigg Boss Telugu 3: అలీ రెజా రీ-ఎంట్రీతో.. బిగ్ బాస్ ఇంటిసభ్యులు షాక్?

అయితే ఈ ముగ్గురు మాత్రం బాబా భాస్కర్ మొదటిసారిగా 'స్మార్ట్ గేమ్' ఆడాడని అభిప్రాయపడ్డారు. అలాగే నాగార్జున మొన్న చెప్పినట్టుగా.. బాబా భాస్కర్ తన మాస్క్‌ని పూర్తిగా తీసేసి గేమ్ ఆడినట్టుగా తెలుస్తుందని మాట్లాడుకున్నారు.

ఇక ఇదే అంశం పై శ్రీముఖి, శివజ్యోతిలు కూడా ఒకరితో ఒకరు తమ అభిప్రాయాలను పంచుకున్నారు - 'వరుణ్ సందేశ్ ఈ టాస్క్‌ని వితిక‌ని సేఫ్ చేయడానికే ఆడినట్టుగా కనిపిస్తుంది' అని అభిప్రాయపడ్డారు. ఈ మాటలకి బలం చేకూరుస్తూ "నేను వితికని ఎలాగైనా ఈ గేమ్‌లో ఉండేలా చేయడానికి  మాత్రమే ఈ టాస్క్ ఆడాను" అని పునర్నవి & రాహుల్ సిప్లిగంజ్‌ల ముందు వరుణ్ ఒప్పుకోవడం జరిగింది.

ఇక మొన్న బిగ్ బాస్ చెప్పినట్టుగా.. బిగ్‌బాస్ మెడాలియన్‌కి సంబంధించిన రేసు నుండి.. ఈ వారం నామినేట్ అయిన సభ్యులు తప్పుకున్నట్లుగా ప్రకటించారు. అలాగే మిగిలిన అయిదుగురు సభ్యులు మాత్రమే.. ఈ మిగిలిన వారంలో ఆ మెడాలియన్ కోసం పోటీపడతారని బిగ్‌బాస్ స్పష్టం చేశారు. దీనితో ఈ నాలుగు రోజులు.. బిగ్ బాస్ గేమ్ మరింత ఆసక్తిగా మారే అవకాశం ఉంది.

ఏదేమైనా.. బిగ్ బాస్ సీజన్ 3 ముగియడానికి.. ఇంకా అయిదు వారాలు మాత్రమే మిగిలి ఉన్న ఈ తరుణంలో ..ఆట రసవత్తరంగా మారింది. చూడాలి.. ఈ వారం బిగ్‌బాస్ ఇచ్చే మెడాలియన్ ని ఎవరు అందుకోబోతున్నారో...

Bigg Boss Telugu 3 : హౌస్ మేట్స్ కోసం.. వారి కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదం ..!