అనుష్కను మొదటిసారి కలిసినప్పుడు.. విరాట్ ఏం మాట్లాడాడో తెలుసా?

అనుష్కను మొదటిసారి కలిసినప్పుడు.. విరాట్ ఏం మాట్లాడాడో తెలుసా?

విరాట్ కొహ్లీ (virat kohli), అనుష్కా శర్మ (anushka sharma). ఎంతోమంది అభిమానులు ఆరాధించే సెలబ్రిటీ జంట వీరిది. తమకు కాబోయే భర్త విరాట్‌లా ఉండాలని.. తనలా ప్రేమగా చూసుకోవాలని ప్రతి అమ్మాయి.. అనుష్క లాంటి చక్కటి భార్య తనకు కావాలని ప్రతి అబ్బాయి కోరుకుంటారు. 2017లో సీక్రెట్‌‌గా ఇటలీలోని లేక్ కొమోలో వివాహమాడిన ఈ జంట.. పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే వరకూ వారి వివాహం గురించి బయట ప్రపంచానికి తెలియకపోవడం విశేషం. అయితే అంత సీక్రెట్‌గా, ఎవరికీ తెలియకుండా..  తొందరగా పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించాడు విరాట్ కొహ్లీ.

Instagram

అమెరికాకి చెందిన టీవీ షో హోస్ట్ గ్రాహమ్ బెన్సింగర్‌తో 'ఇన్ డెప్త్ విత్ గ్రామమ్ బెన్సింగర్'  అనే షోలో పాల్గొన్న విరాట్ తమ పెళ్లికి సంబంధించిన వివరాలను కూడా పంచుకున్నాడు. ఇందులో భాగంగా వారి పెళ్లి గురించి చెబుతూ "మా పెళ్లికి ఏర్పాటు మొత్తం అనుష్కనే చూసుకుంది. అప్పుడు నేను ఓ సిరీస్‌‌లో భాగంగా బిజీగా ఉన్నా. అందుకే లొకేషన్ నుంచి ఏర్పాట్ల వరకూ అన్నీ తనే చూసుకుంది. అంతేకాదు.. ఈ వార్తను చాలా రహస్యంగా ఉంచాలని తను నాకు చెప్పింది. నాక్కూడా అది నచ్చింది. అయినా అది కాక నాకు ఇంకో మార్గం కూడా లేదు. మేం మా పెళ్లిని చాలా సీక్రెట్‌గా ఉంచాం. ఎంతగా అంటే మేం ఫ్లోరెన్స్‌లో దిగిన తర్వాత ఎక్కడకి వెళ్తున్నామో కనీసం మా క్యాబ్ డ్రైవర్‌కి కూడా చెప్పలేదు.

అంతేకాదు.. టికెట్లు‌ను కూడా ఫేక్ పేర్లతో బుక్ చేసుకున్నాం. ఆఖరి నిమిషం వరకూ కూడా ఆ టికెట్లు మాకని బుక్ చేసిన వ్యక్తులకు కూడా తెలీదు. చివరకు పెళ్లికి వచ్చే అతిథులకు కూడా పెళ్లి వేదిక గురించి తెలీదు. ఇటలీలో పెళ్లి అని చెప్పాం. కానీ పెళ్లి ఎక్కడ అని వారికి కూడా చెప్పలేదు. ఇటలీకి వెళ్లిన తర్వాత వారికి పెళ్లి వేదిక గురించి చెప్పాం. ఇంత సీక్రెట్‌గా ఉంచినా మీడియా వాళ్లు.. మా పెళ్లి గురించి ముందే పసిగట్టి ఆ వేదిక వరకూ వచ్చేశారు. కానీ సెక్యూరిటీ  చాలా టైట్‌గా ఉండడంతో లోపలికి రాలేకపోయారు" అని చెప్పుకొచ్చారు కోహ్లీ.

Instagram

"మా పెళ్లికి మేం కేవలం 42 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించాం. మా వివాహాన్ని చాలా వ్యక్తిగతంగా నిర్వహించాలని భావించాం. అందుకే ఈ విషయాన్ని మేం కేవలం మా దగ్గరి బంధువులు, స్నేహితులకు మాత్రమే వెల్లడించాం. వారికి మాత్రమే కార్డ్స్ అందించాం. పెళ్లి వేదికలో కూడా సెక్యూరిటీ చాలా టైట్‌గా ఉంది. ఆహ్వాన పత్రిక చూపించిన వారికే లోపలికి అనుమతి లభించింది. లేకపోతే లేదు. ఆ తర్వాత మేం ఇండియా తిరిగొచ్చేశాం. ఇక్కడ మా స్నేహితులు, బంధువుల కోసం రిసెప్షన్స్ ఏర్పాటు చేశాం. దాంతో వేడుకలు పూర్తయ్యాయి.

పెళ్లి వేడుకలన్నీ పూర్తయ్యాక.. మా కుటుంబ సభ్యులు చెప్పిన మాట నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. మీరు పెళ్లి ఇటలీలో చేసుకొని మంచి పని చేశారు. అసలు వేడుకను ఇక్కడ ఏర్పాటు చేసి అందరినీ పిలిస్తే.. మీరు అతిథులందరినీ చూసుకోలేక ఇబ్బందిపడేవారు. పెళ్లి ఇక్కడ చేసుకుంటే అతిథులను చూసుకోలేక మా కుటుంబాలు ఇబ్బందిపడేవి. అందుకే మేం చేసిన పని నాకే కాదు.. వారికీ నచ్చింది" అంటూ చెప్పుకొచ్చాడు విరాట్.

Instagram

అంతే కాదు.. అనుష్కను మొదటిసారి కలిసిన సందర్భం గురించి కూడా విరాట్ ఇందులో వెల్లడించాడు. దాని గురించి చెబుతూ.. మొదటిసారి మేం ఓ షాంపూ కమర్షియల్ యాడ్‌లో నటించాం. దీని గురించి నా మేనేజర్ బంటి ముందు చెప్పినప్పుడు చాలా ఆలోచించా. అనుష్క శర్మతో నటించాలి అంటే.. ఓ ప్రొఫెషనల్ నటితో కలిసి నేను నటించడమంటే ఇబ్బంది కదా అనుకున్నా. తన పక్కన నేను నటించడం అంటే నా వల్ల కాదని చెప్పేశా. కానీ బంటి మాత్రం 'స్క్రిప్ట్ చాలా బాగుంది. అందులో నటించడం నీక్కూడా నచ్చుతుంది' అని చెప్పాడు. దాంతో సరేనన్నా.

మొదటిసారి అనుష్కను కలిసినప్పుడు చాలా నెర్వస్గా ఫీలయ్యా. దాన్ని దూరం చేసుకోవడానికి తన హీల్స్ గురించి ఓ జోక్ వేశా. నేను ఆరు అడుగుల ఎత్తు లేను కాబట్టి.. మీరు మరీ ఎత్తైన హీల్స్ వేసుకోవాల్సిన అవసరం లేదంటూ జోక్ చేశాను. దాంతో ఇద్దరం నవ్వుకున్నాం. కానీ అది నాకే ఏదోలా అనిపించింది. కానీ ఆ తర్వాత ఇద్దరం క్లోజ్ అయ్యాం. ఆ షూటింగ్ మూడు రోజుల పాటు కొనసాగింది. ఆ మూడు రోజుల్లో మేమిద్దరం.. మంచి స్నేహితులుగా మారిపోయాం. ఆ తర్వాత ఇద్దరం తరచూ కలిసేవాళ్లం. కొన్నాళ్లకు మా స్నేహం ప్రేమగా మారింది ..అంటూ ఆ మొదటి మీటింగ్ గురించి చెప్పుకొచ్చాడు విరాట్.

2017లో పెళ్లాడిన ఈ ఆలుమగలు.. సోషల్ మీడియాలో తమ ఫొటోలతో తమలాంటి జంటలకు కపుల్ గోల్స్ అందిస్తున్నారని చెప్పుకోవచ్చు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.