ADVERTISEMENT
home / Bigg Boss
Bigg Boss Telugu 3:  ఇంటి సభ్యులకి షాక్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా శిల్పా చక్రవర్తి ..!

Bigg Boss Telugu 3: ఇంటి సభ్యులకి షాక్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా శిల్పా చక్రవర్తి ..!

“బిగ్ బాస్ తెలుగు సీజన్ 3″కి (Bigg Boss Telugu) సంబంధించి ఏడవ వారం మొదటిరోజే  ఇంటి సభ్యులకి వైల్డ్ కార్డ్ (Wild Card Entry) రూపంలో ఒక పెద్ద ఝలక్ ఇచ్చాడు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్‌లో ఎవ్వరిని కూడా ఎలిమినేట్ చేయకుండా షో వీక్షిస్తున్న వీక్షకులతో పాటు.. ఇంటి సభ్యులని ఆశ్చర్యపరిచిన బిగ్ బాస్ ఆ మరుసటి రోజే  మరో కొత్త నిర్ణయం తీసుకున్నాడు. హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ రూపంలో ప్రముఖ యాంకర్ శిల్పా చక్రవర్తిని (Shilpa Chakravarthy) పంపించారు. చిత్రమేంటేంటే.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు వచ్చిన ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా మహిళలే కావడం విశేషం.

బిగ్‌బాస్ హౌస్‌లోని వెన్నుపోటుదారుల గురించి తెలుసా..?

అయితే మరో చిత్రమైన అంశం ఏమిటంటే.. శిల్పా చక్రవర్తిని నేరుగా హౌస్‌‌లోకి పంపకుండా.. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియని ఆమె చేతనే నిర్వహింపజేశారు. ముందుగా కన్ఫెషన్ రూమ్‌‌కి ఇద్దరిద్దరు ఇంటి సభ్యులను పిలిపించి.. వారి చేత చెరొక ఇంటి సభ్యుల పేర్లను నామినేషన్ కోసం చెప్పించారు. ఈ క్రమంలో  నామినేషన్‌కు సరైన కారణం కూడా తెలపాల్సిందిగా.. ఓ అజ్ఞాత వ్యక్తి చేత హౌస్ సభ్యులకు చెప్పించారు. అయితే ఆ అజ్ఞాత వ్యక్తి ముఖం మాత్రం ఇంటి సభ్యులకు కనపడకుండా చేశారు. అలా ఇంటి సభ్యులకి “తాము ఎవరితో మాట్లాడుతున్నామో తెలియని రీతిలో సస్పెన్స్ ఏర్పడగా..” వారు నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొన్నారు.

ఇక ఆ నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన తరువాత.. మెల్లగా ఆ కన్ఫెషన్ రూమ్ నుండి అజ్ఞాత వ్యక్తి రూపంలో మాట్లాడిన శిల్పా చక్రవర్తి బయటకు రావడం జరిగింది. ఇక ఆమెతో ఇంటి సభ్యులకు పరిచయాలు ముగిశాక.. ఇద్దరు సభ్యులను నామినేట్ చేయాల్సిందిగా బిగ్‌బాస్ శిల్పకు సూచించారు.  ఈ క్రమంలో శిల్ప తన నిర్ణయం ప్రకారం – అలీ రెజా, శ్రీముఖిలని నామినేట్ చేయడం జరిగింది.

ADVERTISEMENT

డబుల్ ఎలిమినేషన్‌కి ప్లాన్ చేసిన బిగ్‌బాస్?

దీనితో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిందని ప్రకటించిన బిగ్ బాస్ … ఇదే వారానికి సంబంధించి ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న సభ్యుల పేర్లను కూడా ప్రకటించడం జరిగింది. ఆ జాబితాలో ఉన్న సభ్యులే – రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా , మహేష్ విట్టా , రవికృష్ణ,  శ్రీముఖి.

అయితే ఈ నామినేషన్స్‌లో తొలిసారిగా అలీ రెజా పేరు రావడం గమనార్హం. హౌస్ సభ్యులలో కూడా చాలామంది అలీ రెజాని నామినేట్ చేస్తూ… అతను ఇప్పటివరకు నామినేషన్స్‌లో లేని కారణంగా.. తనను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆ కారణంతో ఈ సీజన్‌లో తొలిసారిగా నామినేట్ అయ్యాడు అలీ రెజా. అయితే తొలిసారిగా నామినేషన్‌లో ఉన్న అలీ రెజా ప్రవర్తన.. ఈ వారం ఇంట్లో ఎలా ఉండబోతుందనేది ఓ ఆసక్తికరమైన విషయమే.

ఎందుకంటే అలీ రెజాకి సంబంధించి..  హౌస్‌లోని సంఘటనలని ఆధారం చేసుకుంటే.. తనకి నచ్చని అంశం జరిగితే ఎక్కువగా కోప్పడ్డం.. అలాగే  ఇతరుల మాటని వినకపోవడం లాంటి కొన్ని అభ్యంతరకర చర్యలు కనిపిస్తుంటాయి. ఈ క్రమంలో ఈ వారం నామినేషన్స్‌లో ఆయనకు ప్రేక్షకుల నుండి ఎటువంటి మద్దతు లభిస్తుందనేది వేచి చూడాలి.

ADVERTISEMENT

ఈ ఎపిసోడ్‌లో కొస మెరుపు ఏమిటంటే.. శిల్పా చక్రవర్తి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన కొద్దిసేపటికి.. శ్రీముఖి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. గతంలో తనకి, శిల్పకి మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయని శ్రీముఖి తెలపడం గమనార్హం. అయితే అలాంటి ఆమెతో కలిసి తనతో ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండాల్సి రావడం ఛాలెంజింగ్‌గా.. అలాగే ఇంటరెస్టింగ్‌గా ఉందని చెప్పడం విశేషం. ఇదే విషయమై శ్రీముఖి, హిమజల మధ్య ఒక చర్చ కూడా మొదలైంది.

ఇక నిన్నటి ఎపిసోడ్ ప్రారంభమవడమే.. వినాయక చవితి సంబరాలతో మొదలైంది. అలా మొదలైన వేడుకలలో భాగంగా ఇంటి సభ్యులంతా బిగ్ బాస్ హౌస్‌ని అలకరించడంతో పాటుగా.. పాయసం వంటివి చేసుకుని అందరూ ఈ పండగని చక్కగా జరుపుకున్నారు.

బిగ్ బాస్‌తో డీల్ కుదుర్చుకున్న వరుణ్, రాహుల్, రవికృష్ణ

02 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT