ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ఫ్లైట్‌లో నిద్రపోయి ఒంటరిగా నిద్రలేస్తే? ఇది భయపెట్టే కల అసలే కాదు..!

ఫ్లైట్‌లో నిద్రపోయి ఒంటరిగా నిద్రలేస్తే? ఇది భయపెట్టే కల అసలే కాదు..!

సాధారణంగా భయంకరమైన కల (Nightmare) అంటే ఎలా ఉంటుంది. అందరితో కలిసి కూర్చొని ఉండగా.. సడన్‌గా కళ్లు మూసుకొని తెరవగానే అంతా మాయమైపోతారు. మనమొక్కరమే మిగులుతాం. ఎక్కడున్నామో.. అక్కడికి ఎలా వచ్చామో అర్థం కాక.. ఎలా బయటకు వెళ్లాలో తెలియక ఏడుస్తుంటాం. ఇలాంటి కల మీకెప్పుడైనా వచ్చిందా? మనకు నిద్రలో ఇలాంటి కల గనుక వస్తే.. సడన్‌గా ఉలిక్కిపడి లేచి మరీ కంగారు పడతాం. మరి, ఇలాంటి సంఘటన నిజంగానే ఎదురైతే? ఇదేదో సినిమా కథ కాదండోయ్.. నిజంగా జరిగిన సంఘటన.

ఈ భయంకరమైన సంఘటన టిఫానీ ఆడమ్స్ అనే మహిళ విషయంలో జరిగింది. ఈ ఘటన జరిగిన రోజు నుండి భయంకరమైన కలలు, కంగారు లాంటివి తనని వదిలిపెట్టడం లేదని చెబుతూ.. ఆ మహిళ తన కథను పంచుకుందట. ఎయిర్ కెనడా ఫ్లైట్‌లో ఈ నెల 9 తేదిన ఈ సంఘటన జరిగిందట. దీనికి సంబంధించిన వివరాలను ఆమె స్నేహితురాలు డెయాన్నా నోయల్ ఎయిర్ కెనడా ఫేస్‌బుక్ పేజీలో పంచుకుంది. ఈ విషయాన్ని పంచుకున్న కొద్ది గంటల్లోనే ఆ పోస్టు వైరల్‌గా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

Facebook

ADVERTISEMENT

టిఫానీ ఆడమ్స్ క్యుబెక్ సిటీ నుంచి టొరంటోకి ఈ నెల 9న ప్రయాణమైంది. తన ప్రయాణం గురించి వివరిస్తూ.. “ఫ్లైట్‌లో  (Flight)  గంటన్నర పాటు ప్రయాణించాలి. నా వరుస మొత్తం ఖాళీగా ఉండడంతో చాలా సంతోషించాను. నిజంగా చెప్పాలంటే ఫ్లైట్ కేవలం పావు వంతు మాత్రమే నిండి ఉంది. దీంతో సంతోషంగా పుస్తకం చదువుతూ అలాగే నిద్రలోకి జారిపోయాను.

నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న నాకు నిద్రపట్టడమే పెద్ద ఇబ్బంది. ఒకసారి పడుకుంటే చాలు.. చాలా గాఢంగా నిద్రపడుతుంది. అలా ఆరోజు అర్థరాత్రి వరకూ నిద్రపోయా. అర్థ రాత్రి చలిగా అనిపించి నిద్రలేచాను. చుట్టూ చీకటి. నా సీట్ బెల్ట్ ఇంకా అలాగే ఉంది. అసలే యాంగ్జైటీ డిజార్డర్‌తో బాధపడుతూ.. ప్రతి విషయానికి కంగారు పడే నాకు ఈ సంఘటన ఇంకెంత భయాన్ని కలిగించి ఉంటుందో వూహించుకోవచ్చు.

కళ్లు తెరిచి చూడగానే నేను ఉన్న స్థానాన్ని చూసి.. నేనేదో భయంకరమైన కల కంటున్నానేమో అనిపించింది. ఎందుకంటే సాధారణంగా ఇలాంటిది.. ఎప్పుడూ ఎవరికీ జరగదు. అప్పుడే ఫోన్ గుర్తొచ్చింది. ఫోన్ ఆన్ చేసి చూసేసరికి మిస్డ్ కాల్ నోటిఫికేషన్స్ చాలా వచ్చాయి. నా స్నేహితురాలి ఇంటి నుంచి బయల్దేరేటప్పుడే.. నేను టొరంటో చేరగానే తనకి కాల్ చేస్తానని చెప్పాను. నేను కాల్ చేయకపోయే సరికి తనే చాలాసార్లు చేసింది.

వెంటనే తనకో మెసేజ్ పెట్టాను. “నేను ఇప్పుడే అర్థరాత్రి పూట నిద్రలేచాను. ఈ ఫ్లైట్‌లో నేనొక్కదాన్నే ఉన్నా. ఫ్లైట్‌లో మొత్తం చీకటి, చలి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు” అని తనకి మెసేజ్ చేశాను. అయితే తను మాత్రం నేను ఇంటికి చేరిపోయానని.. రాత్రి నిద్రలో ఏదో భయంకరమైన కల కంటున్నానని అనుకుంది.

ADVERTISEMENT

Shutterstock

అది నిజమేనని చెప్పేందుకు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. వెంటనే నా ఫోన్‌లో ఫేస్ టైమ్ ఆన్ చేసి తనతో మాట్లాడా. చుట్టూ చీకటిగానే ఉన్నా కనీసం తనకి నా మాటలు అర్థమవుతాయని ఆ పని చేశాను. కానీ నా ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల ..నిమిషం కూడా మాట్లాడకముందే ఫోన్ కట్ అయి స్విచ్ఛాఫ్ అయిపోయింది. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు.

నా ఊపిరి మీద ధ్యాస పెట్టి మరీ కంగారు పడకుండా ప్రయత్నించాను. అక్కడ కనిపించిన యూఎస్‌బీ పోర్ట్‌లో నా ఫోన్ ఛార్జింగ్ చేయడానికి ప్రయత్నించాను. కానీ ఫ్లైట్ పవర్ ఆఫ్‌లో ఉంది. కాబట్టి ఫోన్ ఛార్జింగ్ అవ్వలేదు. ఆ కంగారులో నేను బాత్రూంకి వెళ్లాల్సి వచ్చింది. కానీ అది కూడా చాలా ఇబ్బందిగానే గడిచింది. అసలేమీ కనిపించనప్పుడు బాత్రూంకి వెళ్లడం కూడా కష్టమే. ఫోన్ ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ పెట్టే వీలు కూడా లేదు. కాబట్టి ఎవరినైనా ఎలా పిలవాలో నాకు అర్థం కాలేదు. దాంతో నాకు మరింత కంగారు పెరిగిపోయింది.

ADVERTISEMENT

కాక్‌పిట్‌లో ఏమైనా దొరుకుతాయేమో అని ప్రయత్నించాను. వాకీటాకీ కూడా ఆఫ్ అయి ఉంది. కానీ అక్కడో టార్చ్ లైట్ కనిపించడంతో నా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఆ ఫ్లాష్ లైట్ సాయంతో కిటికీల నుంచి లైట్ బయటకు వేస్తూ ఎవరైనా నాకు సాయం చేయడానికి వస్తారేమోనని చూశాను. కానీ ఎవరూ చూడలేదు. నా దగ్గర ఫ్లాష్ లైట్ ఉంది. కాబట్టి డోర్ తీసుకొని నేనే బయటకు వెళ్దామని నిర్ణయించుకున్నా.

తలుపు‌కి ఉన్న మూడు గడియలు తీసి తీసినప్పుడు.. నాకు నేనే విజేతగా కనిపించా. ఇక నేను బయటకు వెళ్లిపోవచ్చు అనుకున్నా. కానీ తలుపు తీసి చూస్తే.. ఆ తలుపు నేల నుంచి నలభై, యాభై అడుగుల పైన ఉంది. తలుపును పట్టుకొని వేలాడుతూ నేను ఎవరికైనా కనిపిస్తానేమో అని చెక్ చేసి చూశాను.

నాకు ఎయిర్ పోర్ట్‌లోని లైట్లన్నీ కనిపిస్తున్నాయి. కానీ అవి చాలా దూరంలో ఉన్నాయి. రాత్రి పూట ఫ్లైట్లను పార్క్ చేసే ఏరియాలో నేను ఉండిపోయాను. ఏదైనా చేయాలని ఫ్లైట్ అటెండెంట్ సీట్ దగ్గర.. ఏదైనా తాడు దొరుకుతుందేమోనని ప్రయత్నించాను. అలాంటిదేమీ కనిపించలేదు. దీంతో మళ్లీ లైట్‌నే నమ్ముకున్నా. ఫ్లైట్ డోర్ నుంచి వేలాడుతూ.. ఫ్లైట్ మీద లైట్ వేసే ప్రయత్నం చేశాను. నున్నని మెరిసే బయట లేయర్ వల్ల.. నేను వేసిన లైట్ పరావర్తనం చెంది.. ఫ్లైట్ బయట భాగం వెలిగినట్లుగా కనిపిస్తోంది. దీంతో ఈ ఫ్లైట్ ఇలా ఎందుకు వెలుగుతోందని ఎవరైనా అటు వైపు వస్తారేమోనని నా ఆశ. అలా ఎంతసేపు వేలాడానో నాకే తెలీదు.

ADVERTISEMENT

Facebook

నేనున్న ఫ్లైట్ దగ్గరి నుంచి ఓ లగేజ్ కార్ట్ వెళ్తుంటే.. ఫ్లైట్ నుంచి నా కాళ్లు బయటకు పెట్టి తనని పిలిచాను. ఆఖరికి నా ప్రయత్నం ఫలించింది. అతడు నన్ను చూశాడు. కానీ తను షాక్ అయిపోయాడు. వాళ్లు నన్ను అలా ఎలా వదిలేసి వెళ్లారో అతడికి అర్థం కాలేదు. అలా ఓ వ్యక్తి‌ని ఫ్లైట్‌లో వదిలేసి వెళ్లిపోవడం ఎప్పుడూ జరగలేదు.

ఫ్లైట్ అటెండెంట్స్ బయటకు వెళ్లే ముందు.. ఫ్లైట్ మొత్తం వెతికి.. ఎవరైనా ఉంటే వారిని లేపి మరీ బయటకు పంపించి.. తర్వాతే వాళ్లు వెళ్తారు. అది పక్కన పెడితే ఆ వ్యక్తి దగ్గర నిచ్చెన ఉండడంతో నేను ఫ్లైట్ నుంచి కిందకు దిగాను. ఎయిర్ కెనడా కార్లు నన్ను ఎయిర్ పోర్ట్ వరకూ తీసుకెళ్లాయి. అక్కడ ఎయిర్ కెనడా ఆఫీసర్ నన్ను చూసి నాకు లగ్జరీ కారు, హోటల్ గది ఇస్తామన్నారు. నేను వాటిని కాదని కొన్ని గంటల్లో నేను ఆఫీస్‌కి వెళ్లాల్సి ఉందని చెప్పాను. తన ఫోన్ నుంచి ఇంటికో ఫోన్ చేసుకొని నా కారు వరకూ వారిని డ్రాప్ చేయమని చెప్పాను. ఇది శనివారం అర్థరాత్రి జరగ్గా సోమవారం, మంగళవారం రెండు రోజులు.. ఎయిర్ కెనడా వాళ్లు నాకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలుసుకొని క్షమాపణలు చెప్పారు.

దీనిపై విచారణ జరిపిస్తామని.. అలా ప్రయాణీకులు ఫ్లైట్‌లో ఉండిపోకుండా ఉండేందుకు వారికి నిర్ధిష్టమైన నిబంధనలు ఉంటాయని చెప్పారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి నాకు నిద్రపోవాలంటే భయమేస్తుంది. నేను నిద్రలేచే సరికి మళ్లీ ఏదైనా చీకటి ప్రదేశంలో ఒంటరిగా నిద్రలేస్తానేమో అనిపిస్తుంది. భయంగా, కంగారుగా అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు షేర్ చేస్తున్నానంటే మీకు తెలిసిన వాళ్లకు ఎవరికైనా.. ఇలా జరిగితే వారి కథ నాతో పంచుకోండి. నేను ఒంటరిగా, భయంగా ఫీలవకుండా ఉండేందుకు నాకు సహాయం చేయండి… అంటూ తన స్నేహితురాలు రాసిన కథను తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంది డియాన్నా.

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ఇవి కూడా చదవండి. 

బిడ్డ‌ను ఎయిర్‌పోర్ట్‌లో మ‌ర్చిపోయి ఫ్లైట్ ఎక్కిందో త‌ల్లి.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..!

ADVERTISEMENT

నిద్రంటే మీకు ఇష్ట‌మా? అయితే ఈ నాసా ఉద్యోగం మీ కోస‌మే ..!

ఇలా చేస్తే మీ ఫోన్.. చాలా తొందరగా ఛార్జింగ్ అవుతుంది..!

24 Jun 2019
good points

Read More

read more articles like this
ADVERTISEMENT