సల్మాన్ ఖాన్ ఆమెను పెళ్లి చేసుకుంటున్నారట.. నిజమేనా..?

సల్మాన్ ఖాన్ ఆమెను పెళ్లి చేసుకుంటున్నారట.. నిజమేనా..?

బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ (Zareen Khan) పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ ఖాన్ తనను పెళ్లి చేసుకోబోతున్నారని ఆమె తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని పేర్కొన్నారు. అయితే ఇక్కడ కూడా ఓ తిరకాసు ఉంది. ఆమెను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి జరీన్‌ను ప్రశ్నిస్తూ.. "మీ గురించి మీరే ఓ విచిత్రమైన రూమర్ సృష్టించాలి. ఆ పని మీరు చేయగలరా? " అని అడిగిన ప్రశ్నకు ఆమె ఈ సమాధానం తెలిపారు. "అవును.. నా పై చాలా రూమర్లు ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా ఓ రూమర్ క్రియేట్ చేస్తాను. సల్మాన్ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు " అని ఆమె తెలిపారు. 

తర్వాత పెళ్లి అనే అంశం మీద జరీన్ చాలా సేపు మాట్లాడారు. "నాకు పెళ్లి అనేదానిపై నమ్మకం లేదు. నేడు వివాహ వ్యవస్థ అనేది ఒక జోక్‌గా మారిపోయింది" అని ఆమె తన అభిప్రాయాన్ని తెలిపారు. మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. జరీన్ ఖాన్‌ను బాలీవుడ్ తెరకు పరిచయం చేసింది సల్మాన్ ఖానే (Salman Khan). ‘వీర్‌’ చిత్రంలో వీరిద్దరూ జోడిగా నటించారు. జరీన్ ఖాన్.. కత్రినా కైఫ్ పోలికలతో ఉంటుందని కూడా చాలామంది అంటూ ఉంటారు. 

‘వీర్‌’ సినిమా విడుదల అయ్యాక.. జరీన్ ఖాన్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. ఎక్కువగా ఐటం నెంబర్స్‌కే ఆమె పరిమితం అయ్యారు. రెడీ (Ready) చిత్రంలో "క్యారెక్టర్ డీల".. సాంగ్ ఆమెకు ఐటమ్ గర్ల్‌గా మంచి పేరు తీసుకువచ్చింది. తర్వాత జరీన్ పంజాబీ చిత్రాలలో కూడా నటించారు. ఎంటీవీ ట్రోల్ పోలీస్ కార్యక్రమానికి సంబంధించి రెండు ఎపిసోడ్లలో గెస్ట్ అప్పీయరెన్స్ కూడా ఇచ్చారు. హౌస్ ఫుల్ 2, హేట్ స్టోరీ 3, అక్సర్ 2, 1921 మొదలైన చిత్రాలలో జరీన్ నటించారు. 

 

1987లో ముస్లిం పఠాన్ కుటుంబంలో జన్మించిన జరీన్ ఖాన్.. ముంబయిలో చదువుకున్నారు. సుభాష్ ఘయ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ "విజ్లింగ్ వుడ్స్"లో ఆమె నటనలో శిక్షణ తీసుకున్నారు. సల్మాన్ ఖాన్ తొలిసారిగా జరీన్‌ను "యువరాజ్" సినిమా సెట్‌లో చూశారు. దాదాపు కత్రినా పోలికలతో ఉన్న తనను చూసి ఆశ్చర్యపోయారు. "వీర్" చిత్రంలో హీరోయన్ పాత్ర కోసం తనను రికమెండ్ చేశారు. అందులో రాకుమార్తె యశోధర పాత్రలో ఆమె నటించారు. కానీ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో.. ఆమెకు రావాల్సిన పేరు రాలేదు.

ఈ సినిమా తర్వాత ఐటం నెంబర్స్.. అలాగే ఫ్యాషన్ షోలకు మాత్రమే జరీన్ పరిమితమయ్యారు. 2013లో దక్షిణాదిలో కూడా తన లక్ పరీక్షించుకున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన "నాన్ రాజవాగ పోగిరెన్" చిత్రంలో ఐటెం సాంగ్ చేశారు. తర్వాత 2014లో పంజాబీ చిత్రం "జట్ జేమ్స్ బాండ్" చిత్రం..  జరీన్‌కు ఆ పరిశ్రమలో మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం "ఢాకా" అనే చిత్రంలో జరీన్ ఖాన్ నటిస్తున్నారు. జరీన్ ఖాన్‌కు ఫిమేల్ వెర్షన్ ఆఫ్ ఇమ్రాన్ హష్మీ అనే పేరు కూడా ఉంది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.                  

ఇవి కూడా చదవండి

ఈ బాలీవుడ్ నటులు.. ఓటు ఎందుకు వేయలేదంటే..?

ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలని భావించిన ఏక్తా.. సింగిల్‌గా ఎందుకు మిగిలిందో తెలుసా?

ప్రీతీ జింటా.. చ‌క్క‌ని న‌టి మాత్ర‌మే కాదు.. ధైర్య‌శాలి కూడా..!