ADVERTISEMENT
home / సౌందర్యం
లేడీ పార్ట్స్ దగ్గర  పెరిగే.. అవాంఛిత రోమాలను సులభంగా తొలగించే చిట్కాలు

లేడీ పార్ట్స్ దగ్గర పెరిగే.. అవాంఛిత రోమాలను సులభంగా తొలగించే చిట్కాలు

లేడీ పార్ట్స్ దగ్గర పెరిగే అవాంఛిత రోమాలను (Pubic Hair) తొలగించుకోవడం అంత సులభమైన విషయం కాదు. ఈ విషయంలో కొందరు పార్లర్ వరకూ వెళ్లి హాట్ వ్యాక్స్ చేయించుకోవడం ద్వారా.. ఈ వెంట్రుకలను తొలిగించుకుంటారు. కానీ ఎక్కువ మంది అమ్మాయిలు రేజర్‌తో వాటిని తొలగించుకుంటారు. ఈ పద్ధతిలో వెంట్రుకలను తొలగించుకున్నప్పుడు నొప్పి లేకపోవడం కూడా దీనికి కారణం కావచ్చు. అయినప్పటికీ షేవింగ్(Shaving) చేసుకోవడం వల్ల కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఎలాంటి సమస్యా లేకుండా.. వెజీనా (Vagina) దగ్గర ఉన్న అవాంఛిత రోమాలు తొలగించుకోవచ్చు.

1. ట్రిమ్మింగ్‌తో మొదలుపెట్టి..

మీరు షేవింగ్ చేసుకుని చాలా రోజులైనట్లైతే.. వెజీనా దగ్గర వెంట్రుకలు గుబురుగా పెరిగిపోతాయి.  అయితే వాటిని షేవింగ్ ద్వారా తొలగించుకోవడం కాస్త కష్టమే. పైగా ఇలా తొలగించుకోవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. అందుకే ముందు అక్కడ ఉన్న వెంట్రుకలను ట్రిమ్ చేసుకోవాలి. దీనికోసం ట్రిమ్మర్ లేదా కత్తెర ఉపయోగించవచ్చు. కత్తెర ఉపయోగిస్తున్నట్లయితే.. కాస్త జాగ్రత్తగా ఉపయోగించండి. లేదంటే గాయాలయ్యే అవకాశం ఉంది.

2. యాంటీ బ్యాక్టీరియల్ సోప్‌తో కడిగి..

ట్రిమ్మింగ్ చేసుకున్న తర్వాత సబ్బుతో నురగ వచ్చేలా రుద్దాలి.అయితే దీనికోసం యాంటీ బ్యాక్టీరియల్ సోప్ ఉపయోగించాల్సి ఉంటుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. అలాగే.. రేజర్ కూడా చాలా స్మూత్‌గా జారుతుంది.

ADVERTISEMENT

3. ఒకే దిశలో షేవ్ చేయండి

షేవింగ్ చేసుకున్న అనంతరం తిరిగి వచ్చే వెంట్రుకల్లో కొన్ని లోపలికి పెరుగుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే.. ఒకే దిశలో షేవ్ చేసుకోవాలి. అంటే పై నుంచి కిందికి షేవింగ్ చేసుకోవడం మొదలుపెడితే.. పూర్తయ్యే దాకా అలాగే చేసుకోవాల్సి ఉంటుంది.

4. కాస్త సమయం తీసుకోండి..

వెజీనా దగ్గర వెంట్రుకలను స్నానం చేయడానికి ముందు షేవింగ్ చేసుకుంటాం. మీరు కూడా అంతే కదా. అయితే షేవింగ్ ద్వారా వెంట్రుకలను సులభంగా తొలగించుకోవాలంటే.. స్నానం చేయడం పూర్తయిన తర్వాత లేదా స్నానం చేయడం మొదలుపెట్టిన పది నిమిషాల తర్వాత.. షేవింగ్ చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు,  వాటి కుదుళ్లు మెత్తబడతాయి. కాబట్టి వాటిని సులభంగా తొలగించుకోవచ్చు.  ఇలా చేయడం వల్ల చర్మం తెగిపోకుండా ఉంటుంది. అలాగే.. కొబ్బరి నూనె లేదా బేబీ ఆయిల్ రాసి కొన్ని నిమిషాల తర్వాత షేవ్ చేసుకున్నా ఇదే ఫలితం కనిపిస్తుంది.

5. షేవింగ్‌కి ముందూ.. తర్వాత ఎక్స్ఫోలియేట్ చేసుకోండి..

ఎక్స్ఫోలియేషన్ చేసుకోవడం ద్వారా డెడ్ సెల్స్ తొలగించుకోవడంతో పాటు.. జుట్టు లోపలికి పెరగకుండా చూసుకోవచ్చు.  అలాగే మళ్లీ షేవ్ చేసుకునేటప్పుడు చాలా స్మూత్‌గా షేవింగ్ చేసుకోవడానికి ఉంటుంది.

ADVERTISEMENT

Shutterstock

6. శుభ్రం చేసుకున్న తర్వాత రుద్దొద్దు..

షేవింగ్  అనంతరం శుభ్రం చేసుకున్న తర్వాత టవల్‌తో గట్టిగా రుద్దేస్తుంటారు. అలా చేయడం వల్ల ఆ ప్రాంతంలో పొడిగా మారిపోవడం, దురద పెట్టడం మరింత ఎక్కువ అవుతాయి. కాబట్టి గట్టిగా రుద్దకుండా నెమ్మదిగా ఒత్తుతూ తుడుచుకోవాలి. ఒకసారి మీరు దీన్ని ప్రయత్నించి చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది.

7. అక్కడక్కడా మిగిలిపోయినవి..

మనం ఎంత సమయం షేవింగ్ చేసుకున్నా.. అక్కడక్కడా కొన్ని వెంట్రుకలు మిగిలిపోతాయి. ఉన్నవి ఒక ట్రెండే అయినా.. చాలా ఇబ్బంది పెడతాయి. వాటిని ట్వీజర్ సాయంతో తొలగించుకోవడం మంచిది.

ADVERTISEMENT

8. రేజర్ కూడా ముఖ్యమే..

షేవింగ్ చేసుకోవడానికి  మనం ఉపయోగించే రేజర్ ఎంపికలోనూ కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే.. షేవింగ్ చేసుకోవడం వల్ల చర్మం పొడిబారిపోయే అవకాశం ఉంది. కాబట్టి చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసే స్ట్రిప్ ఉన్న రేజర్ తీసుకోవడం మంచిది.

Shutterstock

9. మాయిశ్చరైజ్ చేసుకోవడం మరచిపోవద్దు

వెజీనా దగ్గర చర్మం చాలా సున్నితంగా ఉంటుందనే విషయం.. మనందరికీ తెలిసిందే. షేవింగ్ చేసుకున్న తర్వాత వచ్చే ఇబ్బందులూ అనుభవమే. అక్కడి చర్మం ఎర్రగా మారడం, మంటగా అనిపించడం, పొడిమారడం ఇవన్నీ షేవింగ్ అనంతరం మనం ఎదుర్కొనేవే. అయితే  షేవింగ్ తర్వాత మాయిశ్చరైజ్ చేసుకుంటే.. ఈ సమస్యల ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది.

ADVERTISEMENT

రేజర్ శుభ్రంగా..

షేవింగ్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టడం లేదా హడావుడిలో ఉండటం వల్ల రేజర్‌ను శుభ్రం చేయడం మరచిపోవచ్చు.  లేదా సరిగ్గా శుభ్రం చేయలేకపోవచ్చు. ఇలాంటి వాటిని ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్లు రావచ్చు. అలాగే నిర్ణీత వ్యవధి తర్వాత రేజర్‌ను మార్చడం మరచిపోవద్దు.

Feature Image: Shutterstock

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది

22 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT