ADVERTISEMENT
home / సౌందర్యం
చాక్లెట్ వ్యాక్స్ లేదా రెగ్యులర్ వ్యాక్స్.. ఏ చర్మానికి ఏది బాగుంటుంది?

చాక్లెట్ వ్యాక్స్ లేదా రెగ్యులర్ వ్యాక్స్.. ఏ చర్మానికి ఏది బాగుంటుంది?

శరీరంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించుకొనేందుకు ఎక్కువ మంది అమ్మాయిలు ఎంచుకొనే మార్గం వ్యాక్సింగ్. నెలకోసారైనా వ్యాక్సింగ్ చేసుకోవడం మనలో చాలామందికున్న అలవాటు. దీనికోసం కొందరు బ్యుటీషియన్ల దగ్గరకు వెళితే మరికొందరు మాత్రం ఇంట్లోనే వ్యాక్సింగ్ చేసుకొంటూ ఉంటారు. సాధారణంగా కోల్డ్ లేదా హాట్ వ్యాక్స్ గురించే మనకు తెలుసు. కానీ ఇటీవలి కాలంలో చాలామంది బ్యుటీషియన్లు ఫ్లేవర్డ్ వ్యాక్స్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. వీటివల్ల చర్మంపై ఉన్న రోమాలను తొలగించుకోవడం మాత్రమే కాదు.. చర్మం ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుందంటున్నారు.

ఈ ప్లేవర్డ్ వ్యాక్స్ వల్ల ఏంటి  లాభాలని ఆలోచిస్తున్నారు కదా..! చాక్లెట్ వ్యాక్స్, స్ట్రాబెర్రీ వ్యాక్స్, వైట్ చాక్లెట్ వ్యాక్స్ ఇలా వివిధ రకాల ఫ్లేవర్ వ్యాక్స్‌లు మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే.. వ్యాక్సింగ్‌కి వెళ్లిన ప్రతిసారి ఓ కొత్త ఫ్లేవర్‌ను ప్రయత్నించ వచ్చన్నమాట. రెగ్యులర్ వ్యాక్స్ ఉపయోగించడం వల్ల మన చర్మం కాస్త నొప్పి పెడుతుంది. కానీ ఫ్లేవర్ వ్యాక్స్ వల్ల ఆ నొప్పి ఉండదు. మరి ఏ ఫ్లేవర్ ఎంచుకోవాలో తెలియడం లేదా? అందుకే ముందు దేని వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయో తెలుసుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి.

రెగ్యులర్ వ్యాక్స్(Regular wax)

పంచదార, నిమ్మరసం ఉపయోగించి తయారుచేసే వ్యాక్స్ ఇది. దీన్నేమనం ఏళ్లకేళ్లుగా ఉపయోగిస్తున్నాం. దీన్ని ఉపయోగించడం ద్వారా మన చర్మంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు. కానీ ఈ వ్యాక్స్ చర్మంపై ఉన్న చిన్న చిన్న వెంట్రుకలను తొలగించలేదు. అందుకే ఒకే చోట మళ్లీ మళ్లీ వ్యాక్స్ చేయాల్సి వస్తుంది. అందుకే నొప్పిగా అనిపిస్తుంది. వ్యాక్సింగ్ తర్వాత చర్మంపై ఎర్రటి పొక్కులు కనిపిస్తాయి. మీది సెన్సిటివ్ స్కిన్ అయితే.. ఇవి రెండు మూడు రోజుల వరకు ఉంటాయి.

ADVERTISEMENT

చాక్లెట్ వ్యాక్స్ (Chocolate wax)

చాక్లెట్ వ్యాక్స్ సహజసిద్ధ ఉత్పత్తులైన కొకోవా, సోయాబీన్ నూనె, బాదం నూనె, ఆలివ్ నూనె, గ్లిసరిన్ వంటి వాటితో తయారైంది. వీటికి తోడుగా చర్మానికి మేలు చేసే విటమిన్లు కూడా ఈ వ్యాక్స్ తయారుచేయడంలో ఉపయోగిస్తారు. రెగ్యులర్ వ్యాక్స్ కంటే ధర కాస్త ఎక్కువే. దీనివల్ల చర్మానికి కలిగే ప్రయోజనమూ అధికమే.

  1. దీనిలో యాంటీ ఇనఫ్లమేటరీ గుణాలుంటాయి.
  2. వ్యాక్స్ చేసినప్పుడు చర్మంపై వచ్చే ర్యాషెస్ చాలా తక్కువగా ఉంటాయి.
  3. చర్మంపై ఉన్న చిన్న చిన్న వెంట్రుకలతో పాటు.. లోపల పెరుగుతున్న రోమాలను సైతం ఈ వ్యాక్స్ తొలగిస్తుంది.
  4. అలాగే ట్యాన్‌ని తొలగిస్తుంది.
  5. వ్యాక్సింగ్ తర్వాత చర్మం మృదువుగా తయారవుతుంది.
  6. మీ చర్మతత్వం ఏదైనా సరే ఈ వ్యాక్స్ ఉపయోగించవచ్చు.

ADVERTISEMENT

రికా వ్యాక్స్(Rica wax)

దీన్నే వైట్ చాక్లెట్ వ్యాక్స్(white chocolate wax) అని కూడా పిలుస్తారు. దీన్ని వెజిటబుల్ ఆయిల్, మొక్కల నుంచి తీసిన తైలాలతో తయారుచేస్తారు.

  1. వ్యాక్స్ చేసినప్పుడు చర్మం ఎరుపెక్కడం, ఇతర ఎలర్జీలకు కారణమైన కొలోఫొనీ (Colophony) దీనిలో ఉండదు.
  2. రెగ్యులర్ వ్యాక్స్ మాదిరిగా దీన్ని ఎక్కువ సమయం వేడిచేయాల్సిన అవసరం ఉండదు.
  3. రికా వ్యాక్స్ ఉపయోగించడానికి కంటే ముందుగా చర్మంపై ప్రీ వ్యాక్స్ జెల్ ఉపయోగిస్తారు. ఇది చర్మాన్ని శుభ్రం చేయడంతో పాటు.. ఏ మాత్రం హాని లేకుండా రోమాలన్నీ తొలగిపోయేలా చేస్తుంది.
  4. చర్మంపై ఉన్న ప్రతి చిన్న వెంట్రుకను ఒక్కసారికే తొలగిస్తుంది. కాబట్టి ఒకే చోట మళ్లీ మళ్లీ వ్యాక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
  5. ఎలాంటి చర్మతత్వం కలిగిన వారికైనా రికా వ్యాక్స్ చక్కటి ఎంపిక.

రెగ్యులర్ వ్యాక్స్‌తో పోలిస్తే దీని ధర చాలా ఎక్కువ.  ఎందుకంటే దీన్ని ఇటలీ నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సాధారణ వ్యాక్స్‌తో పోలిస్తే దీన్ని ఉపయోగించడం వల్ల కాస్త పని ఎక్కువగా ఉంటుంది. కానీ మనం కోరుకొన్న ఫలితం మాత్రం కనిపిస్తుంది.

ADVERTISEMENT

సూచన: రెగ్యులర్ వ్యాక్స్ తక్కువ ధరకే మనకు అందుబాటులో ఉన్నప్పటికీ దానివల్ల మన చర్మానికి కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఉండదు.  పైగా వ్యాక్సింగ్ తర్వాత వచ్చే వెంట్రుకలు లోపల పెరగకుండా ఉండాలంటే ఈ ఫ్లేవర్డ్ వ్యాక్స్ ఒక్కటే మార్గం. ప్రస్తుతం చాలావరకు బ్యూటీ పార్లర్లలో చాక్లెట్ వ్యాక్స్ అందుబాటులో ఉంది. కానీ రికా వ్యాక్స్ ఖరీదు ఎక్కువ కాబట్టి అన్నిచోట్లా అందుబాటులో ఉండకపోవచ్చు.

Images: Shutterstock

ఇవి కూడా చదవండి

బ్రెజిలియన్ వ్యాక్స్ గురించి వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి

ADVERTISEMENT

ఫేషియల్ వ్యాక్సింగ్ గురించి వ్యాసాన్ని ఇక్కడ ఆంగ్లంలో చదవండి

వ్యాక్సింగ్ కిట్స్ పై వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి

23 Dec 2018

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT