ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
సెక్స్‌కి సంబంధించిన ఈ పదాలపై.. ప్రతి అమ్మాయికి అవగాహన అవసరం..!

సెక్స్‌కి సంబంధించిన ఈ పదాలపై.. ప్రతి అమ్మాయికి అవగాహన అవసరం..!

శృంగారానికి (Sex) సంబంధించిన విష‌యాలు మాట‌ల మ‌ధ్య‌లో చ‌ర్చ‌కు వ‌స్తే.. అమ్మాయిలు సిగ్గుతో ముడుచుకుపోతుంటారు. ఫ్లీజ్‌.. ఇక మీద‌ట అలా చేయ‌కండి. అలాగే మీ స్నేహితులు మాటల మధ్యలో ఏవైనా సెక్స్ సంబంధిత పదాలను (Sex terms) ఉపయోగిస్తే.. వారి మీద జోకులేయకండి. ఎందుకంటే.. వీటిపై మీకు కనీస అవగాహన లేదని.. మీ అంతట మీరే వారికి తెలియజేస్తున్నట్టవుతుంది. పైగా ఈ విషయంలో మీకేమీ తెలియదని చిన్నచూపు చూసే అవకాశం కూడా లేకపోలేదు. అలా మీకు జరగకుండా ఉండాలంటే.. లైంగికపరమైన అర్థాలనిచ్చే 15 పదాలు (words) తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటిలో మీకెన్ని పదాలు తెలుసో? ఎన్ని పదాలు గుర్తు పెట్టుకుంటారో చూద్దాం.

క్వీనింగ్ (Queening): స్త్రీ తన భాగస్వామి ముఖంపై కూర్చుంటే.. పురుషుడు ఆమె యోనిని నాలుకతో స్పృశిస్తాడని ఫ్యాన్సీగా చెప్పడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు.

పాన్ సెక్సువల్(Pansexual): జెండర్‌తో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరికీ ఆకర్షితులయ్యేవారు తమని తాము పాన్ సెక్సువల్  అని పిలుచుకుంటారు.

ADVERTISEMENT

Giphy

ఎసెక్సువల్(Asexual): లైంగికపరమైన విషయాల్లో చాలా తక్కువ ఆసక్తి లేదా అసలు ఆసక్తి లేనివారిని ఎసెక్సువల్ అని పిలుస్తారు. వీరిలో సెక్స్ పరమైన కోరికలు, ఊహలు ఉండవు.

తంత్ర (Tantra): మీరెప్పుడైనా తాంత్రిక్ సెక్స్ గురించి విన్నారా? లేకపోతే దాని గురించి తెలుసుకోవాల్సిందే. ఇది మన దేశంలో దాదాపు 5,000 సంవత్సరాల నుంచి ప్రాచుర్యంలో ఉంది. ఇదేదో మంత్ర తంత్రాలకు సంబంధించినది కాదు. ఇది మీలో దాగున్న శక్తిని బయటకు తీస్తుంది.

మిమ్మల్ని మీరు గుర్తించేందుకు తోడ్పడుతుంది. ఇటీవలి కాలంలో భాగస్వామితో తాంత్రిక్ సెక్స్‌లో పాల్గొనడానికి ఎక్కువ మంది ప్రాధాన్యమిస్తున్నారు. చాలా నెమ్మదిగా సాగే ఈ తరహా సెక్స్ మీకు మల్టిపుల్ ఆర్గాజమ్స్ కలిగేలా చేస్తుంది. ఎంత నెమ్మదిగా ఉంటే.. అంత ఎక్కువగా దీన్ని ఆస్వాదించవచ్చు.

ADVERTISEMENT

పెగ్గింగ్ (Pegging): స్ట్రాప్ ఆన్ డిల్డో(ఒకరకమైన సెక్స్ టాయ్) ఉపయోగించి తన భర్త లేదా బాయ్ ఫ్రెండ్‌ను సంతృప్తి పరచడానికి చేసే ప్రయత్నాన్ని పెగ్గింగ్ అంటారు.

ట్రాన్స్ సెక్సువల్ (Transsexual): సర్జరీ ద్వారా తమ లింగాన్ని మార్చుకున్న వారిని ట్రాన్స్ సెక్సువల్స్, ట్రాన్స్ జెండర్స్ అని అంటారు.

Giphy

ADVERTISEMENT

ఆప్రోడిసియాక్ (Aphrodisiac): మనలోని లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆహారాన్ని ఆప్రోడిసియాక్‌గా వ్యవహరిస్తారు. ఆయిస్టర్స్, చాక్లెట్, రెడ్ వైన్, జాజికాయ, వెనీలా వీటన్నింటినీ ఆప్రోడిసియాక్ ఆహారపదార్థాలుగా వ్యవహరిస్తారు.

సిజరింగ్ (Scissoring): స్వజాతి సంపర్కంలో పాల్గొనే ఇద్దరు స్త్రీలు (లెస్బియన్స్) ఒకరి యోనిని మరొకరి యోనితో రబ్ చేసుకుంటే.. దాన్ని సిజరింగ్ అని పిలుస్తారు. యోని మాత్రమే కాదు పిరుదులు, తొడలు కూడా రాసుకుంటూ.. సంతృప్తి పొందుతుంటారు.

క్వీఫింగ్ (Queefing): కొన్ని సందర్భాల్లో వెజీనా నుంచి గాలి బయటకు వస్తూ చేసే శబ్ధాన్ని క్వీఫింగ్ అంటారు. ఇది దాదాపుగా మహిళందరికీ ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది.

శాడోమాసోకిసమ్ (Sadomasochism): ఆనందం పొందడానికి ఇతరులను బాధపెట్టడాన్నే శాడోమాసోకిసమ్ అంటారు. అంటే సెక్స్ సమయంలో కలిగే బాధ లేదా కలిగించే బాధ వల్ల పొందే శాడిస్టిక్ ఆనందమని అర్థం.

ADVERTISEMENT

Giphy

ఆఫ్టర్ కేర్(Aftercare): శృంగారంలో పాల్గొన్న తర్వాత భాగస్వాములిద్దరూ ఒకరి పట్ల మరొకరు తీసుకునే శ్రద్ధనే ఆఫ్టర్ కేర్ అంటారు. సెక్స్‌లో పాల్గొన్న తర్వాత తమ భాగస్వామిలో వచ్చే మానసిక, శారీరక, భావోద్వేగ పరమైన అవసరాన్ని తీర్చడమే ఆఫ్టర్ కేర్. అంటే సెక్స్ అనంతరం ఒకరినొకరు కౌగిలించుకోవడం, మాట్లాడుకోవడం, ముద్దు పెట్టుకోవడం చేయడం లాంటివి దీని కిందకు వస్తాయి.

అరొమాంటిక్(Aromantic): రొమాంటిక్ ఆలోచనలు ఏమీ లేకపోయినా సెక్స్‌ను ఆస్వాదించే వ్యక్తిని అరొమాంటిక్ అని వ్యవహరిస్తారు.

ADVERTISEMENT

బైసెక్సువల్(Bisexual): సెక్స్, రొమాన్స్ విషయంలో.. స్త్రీపురుషులిద్దరికీ ఆకర్షితులయ్యేవారిని బైసెక్సువల్ అని పిలుస్తారు.

స్వింగింగ్(Swinging): అంటే ఒకరి భాగస్వామిని మరొకరు మార్చుకోవడం. దీన్నే కపుల్ స్వాపింగ్ అని కూడా అంటారు.

ఫెటిష్(Fetish): ఏదైనా వస్తువు లేదా శరీర భాగాలు -మెడ, చంక, పాదాల వంటి వాటిని చూసినప్పుడు కూడా కొన్నిసార్లు సెక్స్ పరమైన కోరికలు కలుగుతాయి వాటినే ఫెటిష్ అని పిలుస్తారు.

సెక్స్ గురించి ఏమీ తెలియని అమ్మాయీ.. నీ సందేహాలకు సమాధానాలివిగో..

ADVERTISEMENT

 

Feature Image: Shutterstock

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది

ADVERTISEMENT
26 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT