సెక్స్ గురించి ఏమీ తెలియని అమ్మాయీ.. నీ సందేహాలకు సమాధానాలివిగో..

సెక్స్ గురించి ఏమీ తెలియని అమ్మాయీ.. నీ సందేహాలకు సమాధానాలివిగో..

శృంగారం(Sex).. చాలామంది అమ్మాయిలకు ఇది పరిచయం లేని సబ్జెక్ట్. సెక్స్ గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల వారికి ఎన్నో సందేహాలు(Doubts) ఉంటాయి. వాటికి సమాధానం తెలుసుకోవాలని ఉన్నప్పటికీ.. ఇతరులను అడిగి తెలుసుకోవడానికి చాలా భయపడుతుంటారు. సిగ్గుపడుతుంటారు. ఈ క్రమంలో వారి మెదడును తొలిచేసే కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలు మీకోసం..


1. మొదటిసారి కలయికలో పాల్గొన్నప్పుడు బాగా నొప్పిగా ఉంటుందట కదా. నిజమేనా?


ఇది ఒక్కొక్కరిలోనూ ఒక్కో విధంగా ఉంటుంది. కొందరిలో మొదటిసారి కలయికలో పాల్గొన్నప్పుడు కాస్త అసౌకర్యంగా అనిపిస్తుంది. కానీ నొప్పిగా ఏమీ అనిపించదు. మరికొందరికి చాలా నొప్పిగా అనిపించవచ్చు. అలాగే మొదటిసారి సెక్స్ లో పాల్గొన్నప్పుడు అమ్మాయిలకు రక్తం వస్తుందని ఎక్కువమంది బలంగా నమ్ముతారు. ఇది కూడా అందరి విషయంలోనూ జరగదు.


1-sex-questions


2. ఫింగరింగ్(వేలితో స్వయంతృప్తి) పొందడం వల్ల హైమన్ పొర చిరిగిపోతుందా?


కొన్ని సందర్భాల్లో హైమన్ పొర బ్రేక్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే ఇది మీరు ఎంత సున్నితంగా చేసుకొంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఎగ్రెసివ్ గా చేసుకొన్నట్లయితే పొర చిరిగిపోయే అవకాశాలుంటాయి. ఆ సందర్భంలో నొప్పి గా అనిపించడంతో పాటు రక్తం కూడా వస్తుంది.


3. వ్యాక్సింగ్ లేదా షేవింగ్ చేసుకోవడం ద్వారా అక్కడి అవాంఛిత రోమాలను తొలగించుకోవడం వల్ల సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఏమైనా తేడా కనిపిస్తుందా?


వెజీనా దగ్గర వెంట్రుకలు ఉన్నా లేకపోయినా సెక్స్ లో పాల్గొన్నప్పుడు పొందే అనుభూతిలో తేడా ఏమీ ఉండదు. అక్కడి రోమాలను తొలగించుకోవడం లేదా ఉంచుకోవడమనేది పూర్తిగా వ్యక్తిగతమైనది. మీ ఇష్టానికి సంబంధించినది.


4. నా బాయ్ ఫ్రెండ్ ఓరల్ సెక్స్ కావాలని అడుగుతున్నాడు. ఓరల్ సెక్స్ అంటే నాకు కాస్త చిరాకుగా అనిపిస్తుంది. నా ఒక్కదానికే ఇలా అనిపిస్తోందా? అమ్మాయిలందరికీ అంతేనా?


అందరికీ అలా అనిపించదు. అలాగని నీ అభిప్రాయం తప్పు అని చెప్పడం లేదు. అన్నీ కంఫర్టబుల్ గా ఉన్నప్పుడే శృంగారాన్ని ఎంజాయ్ చేయగులుగుతాం. కాబట్టి మీకు ఇష్టం లేని పనిని చేయకపోవడమే మంచిది.


4-sex-questions


5. కండోమ్ ఉపయోగించకపోతే గర్భం ధరిస్తామా?


సెక్స్ లో పాల్గొన్న ప్రతిసారి కండోమ్ ధరించడం తప్పనిసరి. అసలు కండోమ్ లేకుండా సెక్స్ లో పాల్గొనడానికి అంగీకరించవద్దు. ఎందుకంటే తర్వాత బాధపడటం కంటే ముందే జాగ్రత్త వహించడం మంచిది కదా. కండోమ్ ను గర్భం రాకుండా ఉండటానికి మాత్రమే ఉపయోగించరు. లైంగిక చర్యలో పాల్గొనడం ద్వారా సంక్రమించే వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. ఇవి ఒక్కసారి మనకు సోకాయంటే వాటి నుంచి బయటపడటం కష్టం. కాబట్టి ముందుగానే జాగ్రత్తపడటం మంచిది. ఇప్పుడు మహిళలు ఉపయోగించదగిన కండోమ్స్ సైతం అందుబాటులోకి వచ్చాయి కాబట్టి అతనికి వాడటం ఇష్టం లేకపోతే మీరైనా ఫిమేల్ కండోమ్ ఉపయోగించండి.


6-sex-quwstions


6. సెక్స్ లో పాల్గొనడం ప్రారంభించిన తర్వాత యోని వదులుగా మారిపోతుందా? అసలు  ఒక్కసారి కూడా సెక్స్ లో పాల్గొనని వారి యోని మిగిలిన వారితో పోలిస్తే బిగుతుగా ఉంటుందా? దానివల్ల  వారు ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతారా?


అలా ఏమీ జరగదు. ఎందుకంటే యోని కండరాలు సంకోచవ్యాకోచాలు చెందే లక్షణాన్ని కలిగి ఉంటాయి. సెక్స్ లో పాల్గొనక ముందు యోని కండరాలు ఎంత బిగుతుగా ఉన్నాయో ఆ తర్వాత కూడా అలాగే ఉంటాయి. కాకపోతే ఆరంభంలో అలవాటు లేకపోవడం వల్ల నొప్పిగా అనిపిస్తుంది. అలవాటయ్యే కొద్దీ నొప్పిగా అనిపించడం తగ్గుతుంది. కానీ మీరనుకొన్నట్లుగా వదులుగా మారిపోదు.


7. అబ్బాయి వర్జిన్(virgin) అవునా కాదా అనేది తెలుసుకోవడానికి ఏదైనా మార్గముందా?


మనలాగా వారికి హైమన్ పొర లాంటిదేమీ ఉండదు కాబట్టి వారు వర్జినా? కాదా? అని తెలుసుకోవడం కష్టం. కానీ మొదటిసారి సెక్స్ లో పాల్గొనే అబ్బాయిలను గుర్తించడం సులభం. అదెలాగంటే వారు మీకు నొప్పి కలిగించేలా వ్యవహరించరు. అయినప్పటికీ వారు వర్జిన్ అని చెప్పడం కష్టం కాబట్టి ముందుగానే ఈ విషయం మీ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడి క్లారిటీ తెచ్చుకోండి.


8-sex-question


8. కండోమ్ ఉపయోగించడం వల్ల మనకు కలిగే అనుభూతి లేదా సౌఖ్యంలో తేడా ఏమైనా ఉంటుందా?


దీనికి సమాధానం అవుననీ చెప్పలేం.. అలాగని కాదనీ చెప్పలేం. కండోమ్ ఉపయోగించడం వల్ల మీరు పొందే తృప్తిలో ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే లాటెక్స్ తో తయారైన కండోమ్ ఉపయోగించడం వల్ల చాలామంది మహిళల్లో నేచురల్ లూబ్రికేషన్ పై ప్రభావం పడుతుంది. ఫలితంగా అక్కడ పొడిగా మారిపోతుంది. అయితే వాటర్ బేస్డ్ లూబ్రికెంట్ ఉపయోగించడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. ఇటీవలి కాలంలో నాన్ లాటెక్స్ కండోమ్స్ సైతం అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. కండోమ్ లేకుండా మాత్రం సెక్స్ లో అస్సలు పాల్గొనవద్దు.


GIFs: Tumblr


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ 


క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.