ADVERTISEMENT
home / సౌందర్యం
మీరు ఐలైనర్ వేసుకునేట‌ప్పుడు.. ఈ పొర‌పాట్లు చేయ‌కండి..!

మీరు ఐలైనర్ వేసుకునేట‌ప్పుడు.. ఈ పొర‌పాట్లు చేయ‌కండి..!

అమ్మాయిలు రెగ్యులర్‌గా ఉపయోగించే బ్యూటీ ప్రొడక్ట్ ఐలైనర్. కనురెప్పలకు దీన్ని సరిగ్గా వేసుకున్నట్లయితే..కళ్లు చాలా అందంగా కనిపిస్తాయి. లేదంటే.. చూడటానికి అంత బాగోదు. అప్పుడప్పుడూ చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఐలైనర్ సరిగ్గా అప్లై చేసుకోలేకపోవచ్చు. మరి దాన్ని ఎలా సరిచేయాలి? ఐలైనర్ వేసుకొనేటప్పుడు సాధారణంగా చేసే పొరపాట్లు ఏంటి? వాటిని ఎలా దిద్దుకోవాలి? అవి చెప్పడానికే కదా.. మేమున్నాం. మీరు ఈ ఆర్టికల్ చదవడం పూర్తి చేసే లోపు.. eyeliner mistakes తో పాటు వాటిని ఎలా సరిచేసుకోవాలో కూడా తెలుసుకొంటారు. దానికి గ్యారంటీ మాది.

1. పూర్తిగా ఐలైనర్ వేసేయడం..

1-eyeliner-mistakes

ఐలైనర్ విషయంలో ఎక్కువగా చేసే పొరపాటు ఇది. పైరెప్పలు, కింది రెప్పలకు ఒకే విధంగా ఐలైనర్ వేస్తుంటారు. దీనివల్ల కళ్లు చాలా చిన్నవిగా కనిపిస్తుంటాయి. కొంతమంది అయితే పైరెప్పలకు ఎక్కువగా.. కింది రెప్పలకు తక్కువగా అప్లై చేస్తారు. ఇది కూడా సరైనది కాదు.

ADVERTISEMENT

సరిచేయడం ఎలా? ఐలైనర్ పై రెప్పకు మాత్రమే రాసుకోవాలి. కింది రెప్పకు కాదు. దీనికి ఐలైనర్ బదులుగా కాటుక పెట్టుకోవాలి. చాాలామంది కాటుక పెట్టుకొనేటప్పుడు రెప్పను కిందికి లాగి అప్పుడు రాస్తారు. ఇప్పటి నుంచి ఇలా మాత్రం చేయకండి. కనురెప్పల కింద సన్నగా గీత మాదిరిగా కాటుక పెట్టుకోవాలి. దీనికోసం పెన్సిల్ మాదిరిగా ఉండే కాటుకను ఎంచుకోవాలి.

2. కనురెప్పలపై చర్మం లాగి ఐలైనర్ వేసుకోవడం..

ఐలైనర్ వేసుకొనేటప్పుడు చాలామందికి ఉండే అలవాటిది. ఇలా చర్మం లాగితే ఐలైనర్ వేసుకోవడం సులభమనే అపోహే దీనికి కారణం. ఇలా చేయడం వల్ల ఐలైనర్ ఆకృతి వంకరటింకరగా వస్తుంది. పైగా ఇలా రోజూ చేయడం వల్ల కనురెప్పల చర్మం సాగిపోతుంది.

మరి దీన్ని సరిచేయడం ఎలా? ఐలైనర్ వేసుకొనేటప్పుడు కిందికి చూడటం అసంకల్పితంగా జరిగే చర్య. ఇలా కిందికి చూస్తున్నా కనబడేవిధంగా హ్యాండ్ మిర్రర్ ఏర్పాటు చేసుకొంటే.. కనురెప్పలను లాగి ఐలైనర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు.

ADVERTISEMENT

3. పాతది ఉపయోగించడం..

3-eyeliner-mistakes

అవును.. ఇలా చేయడం కూడా పొరపాటు కిందే లెక్క. ప్రతి వస్తువుకి ఎక్స్పైరీ తేదీ ఉంటుంది. ఇది ఐలైనర్‌కూ వర్తిస్తుంది. మనం కూడా ఉపయోగించాల్సిన సమయం మించిపోయినవి వాడితే.. అది ముద్దముద్దగా అలముకొంటుంది. పైగా ఇలాంటివి ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంది.

దీన్ని ఎలా సరిచేయాలంటే.. పాతది వాడటం మానేసి కొత్తదాన్ని కొని ఉపయోగించడమే! కొనేముందే కాదు.. వాటిని ఉపయోగించేటప్పుడు కూడా వాటి ఎక్స్ఫైరీ తేదీని చెక్ చేస్తూ ఉండండి. అలాగే ప్రతి 3 నుంచి 5 నెలలకోసారి మీ ఐలైనర్‌ను మారుస్తూ ఉండండి.

ADVERTISEMENT

4. చేత్తోనే వింగ్డ్ ఐలైనర్ వేసుకోవడం

వింగ్డ్ ఐలైనర్ వేసుకోవడంలో మీరు ఎక్స్‌పర్ట్ అయితే తప్ప.. ఇలా వేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే దాని ఆకారం సరిగ్గా రాకపోతే మొదటికే మోసం వస్తుంది.

మరి వింగ్డ్ ఐలైనర్ సరిగ్గా వేసుకోవడం ఎలా? దీనికోసం స్టెన్సిల్ లేదా టేప్ ఉపయోగిస్తే వింగ్డ్ ఐలైనర్ అందంగా వస్తుంది. ఇలా చేయడం కుదరకపోతే.. మామూలుగానే ఐలైనర్ వేసుకోండి. కానీ వింగ్డ్ ఐలైనర్ వేసుకోవడం ప్రాక్టీస్ చేయడం మాత్రం మానకండి.

5. ఐలైనర్ వేసుకొన్న తర్వాత కర్లింగ్ చేయడం..

ADVERTISEMENT

5-eyeliner-mistakes

ఇలా చేయడం వల్ల కనురెప్పల కుదుళ్లకు దగ్గరగా ఉన్న ఐలైనర్ తొలగిపోతుంది. ఇది చూడటానికి అంత బాగోదు.

ఎలా సరిచేయాలి? ఐలైనర్ వేసుకోవడానికి ముందే కనురెప్పల వెంట్రుకలను కర్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మళ్లీ మళ్లీ ఐలైనర్ అప్లై చేసుకోవాల్సిన అవసరం రాదు.

6. ఫైనల్ టచ్ ఇవ్వకపోవడం..

ADVERTISEMENT

కనురెప్పలపై ఐలైనర్‌తో అలా గీసుకొంటూ వెళ్లిపోయి అంతా బాగానే ఉందిలే అనుకొంటే పొరపాటే. ఎందుకంటే.. ఐలైనర్ వేసుకొన్న తర్వాత అక్కడక్కడా ఖాళీలు ఉండిపోతాయి. మరికొన్నిసార్లు కుడి కంటికి ఒకరకంగా.. ఎడమ కంటికి మరో విధంగా ఐలైనర్ అప్లై చేసుకొని ఉండొచ్చు.

ఎలా సరిచేయాలి? ఐలైనర్ వేసుకొన్న తర్వాత ఓసారి క్షుణ్ణంగా పరిశీలించండి. ఎక్కడైనా లోపాలు కనిపిస్తే వెంటనే సరిచేయాలి. ఎందుకంటే ఓసారి ఇంటి నుంచి అడుగు బయట పెట్టిన తర్వాత దాన్ని సరిచేసుకోవడం కుదరకపోవచ్చు.

7. బేస్ మేకప్ వేయకపోవడం..

7-eyeliner-mistakes

ADVERTISEMENT

ముఖం అంతా ఫౌండేషన్, కన్సీలర్ అప్లై చేసుకొని కళ్ల చుట్టూ ఉన్న చర్మానికి అప్లై చేసుకోకపోతే.. చూడటానికి బాగోదు. ఇలాంటప్పుడు మీరు ఎంత బాగా ఐమేకప్ వేసుకొన్నా అందంగా కనిపించదు. 

ఎలా సరిచేయాలి? కన్సీలర్ లేదా ప్రైమర్‌ను ముఖంతో పాటు కళ్ల చుట్టూ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కంటి చుట్టూ ఉన్న నల్లటి వలయాలు కవర్ అవడంతో పాటు.. ఎక్కువ సమయం ఐమేకప్ నిలిచి ఉంటుంది.

8. కంటి ఆకారానికి అనుగుణంగా ఐలైనర్ వేసుకోకపోవడం

ప్రతిఒక్కరికీ వారికి మాత్రమే ప్రత్యేకమైన కంటి ఆకారం ఉంటుంది. అలాగే కంటి ఆకృతికి తగినట్లుగా కొన్ని రకాల ఐలైనర్ స్టైల్స్ మాత్రమే నప్పుతాయి. అలాంటి వాటినే మీరు ఎంచుకొని వేసుకోవాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

ముందు మీ కళ్ల ఆకృతి గుర్తించండి.  ఎలాంటి స్టైల్ అయితే మీకు బాగుంటుందో తెలుసుకోండి. మీ కళ్లు పెద్దవిగా ఉంటే.. సన్నని గీతలాగా ఐలైనర్ వేసుకొంటే బాగుంటుంది. మీ కళ్లు చిన్నవిగా ఉన్నట్లయితే వింగ్డ్ ఐలైనర్ వేసుకోవాల్సి ఉంటుంది. మీ కళ్ల ఆకృతికి తగినట్లుగా ఐలైనర్ ఎలా వేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

9. మీకు నప్పని రంగు ఐలైనర్ వాడటం

9-eyeliner-mistakes

రంగుల్లో ఉన్న ఐలైనర్స్ వేసుకోవడం లేటెస్ట్ బ్యూటీ ట్రెండ్. ట్రెండ్ కదాని గుడ్డిగా ఫాలో అయితే మొత్తం రసాభాస అవుతుంది. మీ స్కిన్ టోన్‌కి నప్పని రంగులోని ఐలైనర్ వేసుకొంటే.. మీరెంత బాగా ఐ మేకప్ వేసుకొన్నా.. అది అంత కళగా అనిపించదు.

ADVERTISEMENT

ఎలా సరిచేయాలి?  ముందు మీ స్కిన్ టోన్ గుర్తించి ఏ రంగులు మీకు నప్పుతాయో గుర్తించండి. బ్లాక్, బ్రౌన్ రంగులైతే అన్ని రకాల స్కిన్ టోన్స్‌కు నప్పుతాయి. అలాగే బ్లూ, ఆలివ్ గ్రీన్, ఇండిగో రంగులు  కూడా బాగుంటాయి. డస్కీ, డార్క్ స్కిన్ టోన్స్ కలిగినవారికి డీప్ పర్పుల్, డార్క్ బ్లూ, డార్క్ గ్రీన్ రంగులు బాగుంటాయి.

10. సరైన ఐలైనర్ అప్లై చేసుకోకపోవడం

మీరు చదివింది నిజమే.. జెల్, పెన్సిల్, లిక్విడ్ ఈ మూడు తరహా ఐలైనర్లను ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఏ సమయంలో దేన్ని ఉపయోగించాలో తెలియకపోవడమూ తప్పే.

దీన్ని ఎలా సరిచేసుకోవాలి? మీరు చాలా త్వరగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు పెన్సిల్ ఐలైనర్ ఉపయోగించండి. జెల్ ఐలైనర్ రోజూ వేసుకోవడానికి బాగోదు. ఇలా కాకుండా ప్రత్యేకమైన కార్యక్రమాలకు హాజరయ్యేటప్పుడు జెల్ ఐలైనర్ వేసుకొంటే బాగుంటుంది. లిక్విడ్ ఐలైనర్ వేసుకొంటే కళ్ల‌కు చాలా అందంగా ఉంటుంది. కానీ అప్లై చేసుకొన్నాక ఆరడానికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి మీ చేతిలో ఎక్కువ సమయం ఉన్నప్పుడు లిక్విడ్ ఐలైనర్ వేసుకోవడానికి ప్రయత్నించండి.

ADVERTISEMENT

Images: Shutterstock

ఇవి కూడా చ‌ద‌వండి

కాటుక కళ్లకు.. రంగుల సోయగాలను అద్దే “టూ టోన్డ్ ఐలైనర్”

జస్ట్.. ఒక్క నిమిషంలో.. అందమైన ఐబ్రోస్ కావాలంటే ఏం చేయాలి..?

ADVERTISEMENT

పర్ఫెక్ట్ పౌట్ లిప్స్ కోసం.. లిప్ స్టిక్ ఇలా వేసుకోండి..

30 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT