బరువు తగ్గడం(Weight loss).. ప్రస్తుతం చాలామందికి ఉన్న ఫిట్ నెస్(Fitness) గోల్ ఇదే.. దీని కోసం ఎన్నో రకాల పద్ధతులు, మందులు, ఆహారం ఉపయోగిస్తుంటారు చాలామంది. బరువు తగ్గడంలో ఒక్కొక్కరి పద్ధతి వేరుగా ఉంటుంది. అయితే బరువు తగ్గడంలో మనకు సాయం చేసేవారు ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా.. ట్రైనర్లను పెట్టుకోవాలంటే అది చాలా ఖరీదైన విషయం.. పైగా ఇది అందరికీ సాధ్యమయ్యేది కూడా కాదు.
కానీ రోజంతా మీకు తోడుండే ఫిట్ నెస్ ట్రైనర్ ఉన్నారు.. అంతేనా.. వీరికి పెద్దగా డబ్బు కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కేవలం ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి కొన్ని యాప్స్ (Apps) డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అవునండీ.. మేం చెబుతోంది ఫిట్ నెస్ యాప్స్ గురించి. ఈ యాప్స్ వల్ల కొన్ని రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది. మరి, ఆ యాప్స్ ఏంటంటే..
1. వెయిట్ వార్
పేరులో ఉన్నట్లే ఇది బరువుకి వ్యతిరేకంగా చేసే పోరాటం లాంటిదే. ఇది మీరు మీ బరువును కంట్రోల్లో ఉంచుకునేందుకు, సరైన డైట్ తీసుకునేందుకు తోడ్పడుతుంది. ఈ యాప్ సాయంతో మీరు అలారం సెట్ చేసుకోవచ్చు. దీని వల్ల మీరు సమయానికి తగిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.. మీ బరువు తగ్గించుకోవడానికి వ్యాయామం చేయడం వంటివన్నీ గుర్తుచేస్తుంది. ఇదొక్కటే కాదు.. ఈ యాప్ మీ శరీరం బీఎంఐ, బీఎంఆర్ లెక్కలను కూడా చూపిస్తుంది.
2. లూజ్ ఇట్
బరువు తగ్గడానికి తక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకోవడం చాలా కష్టమైన పని. అందుకు ఈ యాప్ మీకు సహాయం చేస్తుంది. దీని ద్వారా మీరు తీసుకునే క్యాలరీలు, అందులోని పోషకాల విలువలన్నింటినీ మీరు నోట్ చేయగలుగుతారు. దీంతో పాటు మీరు ఎన్ని క్యాలరీలు కరిగిస్తున్నారన్న విషయాన్ని కూడా నోట్ చేస్తుంది. ఈ యాప్ ని ఉపయోగించడం ఎంతో సులభం. దీన్ని ఉపయోగిస్తూ తక్కువ క్యాలరీల్లోనే నచ్చిన ఆహారం తీసుకోవడం ఎంతో ఆనందంగా కూడా అనిపిస్తుంది.
బరువు తగ్గడానికి తక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకోవడం చాలా కష్టమైన పని. అందుకు ఈ యాప్ మీకు సహాయం చేస్తుంది. దీని ద్వారా మీరు తీసుకునే క్యాలరీలు, అందులోని పోషకాల విలువలన్నింటినీ మీరు నోట్ చేయగలుగుతారు. దీంతో పాటు మీరు ఎన్ని క్యాలరీలు కరిగిస్తున్నారన్న విషయాన్ని కూడా నోట్ చేస్తుంది. ఈ యాప్ ని ఉపయోగించడం ఎంతో సులభం. దీన్ని ఉపయోగిస్తూ తక్కువ క్యాలరీల్లోనే నచ్చిన ఆహారం తీసుకోవడం ఎంతో ఆనందంగా కూడా అనిపిస్తుంది.
3. మై డైట్ కోచ్
చాలామంది బరువు తగ్గాలనుకుంటారు.. కానీ దానికి తగిన మోటివేషన్ మాత్రం వారికి ఉండదు. అలాంటివారు ఈ యాప్ ని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఇందులో చక్కటి గ్రాఫిక్స్, చార్ట్స్, వర్చువల్ రివార్డ్స్ వంటివి ఉంటాయి. కాబట్టి ఈ యాప్ మీరు బరువు తగ్గేందుకు మీకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అంతేకాదు.. ఈ యాప్ ద్వారా మీరు ఇంకా ఎంత బరువు తగ్గాలి? ఇప్పటివరకూ ఎంత బరువు తగ్గారు? అన్న విషయాలన్ని పొందుపర్చి ఉంటాయి.
ఇందులోని డైట్ ప్లాన్ మీరు కేవలం ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలని మీకు రోజూ గుర్తుచేస్తూ ఉంటుంది. అంతేకాదు.. నీళ్లు తాగడం, స్నాక్స్, భోజనం ఇతర ఆహారం తీసుకోవడం గురించి రిమైండర్స్ ద్వారా గుర్తు చేస్తుంటుంది కూడా. వ్యాయామం చేసే సమయాన్ని కూడా ఇది గుర్తు చేస్తుంది. రోజూ మీరు ఎన్ని క్యాలరీలు కరిగించారో.. ఇంకా ఎన్ని కరిగించాల్సి ఉందో గుర్తుచేస్తుంది. దాన్ని పూర్తి చేస్తే మీకు వర్చువల్ రివార్డ్స్ కూడా అందుతాయి. అంతేకాదు.. బరువు తగ్గేందుకు మంచి టిప్స్ తో పాటు వెయిట్ లాస్ గురించి ప్రత్యేకమైన కథనాలు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి.
4. డైలీ యోగా
యోగా.. బరువు తగ్గేందుకు మన శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెంచేందుకు చక్కటి వ్యాయామం ఇది. అలాంటి యోగా చేసేందుకు మీకు తోడ్పడుతుంది ఈ డైలీ యోగా యాప్. ఇందులో భాగంగా దాదాపు యాభైకి పైగా ఆన్ లైన్ యోగా క్లాసులు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా మనం 400కి పైగా యోగాసనాల గురించి తెలుసుకోవచ్చు. వీటి ద్వారా రోజూ ఇంట్లో కూర్చొని యోగా చేసేయొచ్చు.
మంచి ఆరోగ్యం, సెక్సీ లుక్ సొంతం చేసుకోవచ్చు. మీ బరువును ఇందులో ఎంటర్ చేస్తే దానికి తగినట్లుగా బరువు తగ్గడానికి ఫుల్ వర్కవుట్ ప్లాన్.. యోగాసనాలన్నీ మీకు ఈ యాప్ లో అందుబాటులో ఉంటాయి. ఆరోగ్య సమస్యలను బట్టి వివిధ రకాల యోగా ప్రోగ్రాంలను ఎంచుకోవచ్చు.
5. గూగుల్ ఫిట్
గూగుల్ సంస్థ తయారుచేసిన ఈ ఫిట్ నెస్ యాప్ మీ ఫిట్ నెస్ ని ట్రాక్ చేస్తుంది. మీ యాక్టివిటీలన్నింటినీ ఇది రికార్డ్ చేస్తుంది. ఇది ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన ఫిట్ నెస్ యాప్. దీని ద్వారా మీరు మీ బరువును మానేజ్ చేయవచ్చు. ఇది రన్నింగ్, సైక్లింగ్, ఇతర ఎక్సరసైజుల్లాంటి మీ ఫిట్ నెస్ యాక్టివిటీలన్నింటినీ ట్రాక్ చేస్తుంది. కేవలం ఇదే కాదు.. ఈ యాప్ ద్వారా చాలా చేయొచ్చు.
ఫిట్ నెస్ వాచ్, మీ ఫిట్ నెస్ ప్రోగ్రెస్ ని ట్రాక్ చేయడం వంటివన్నీ చేసుకోవచ్చు. మీరు నోట్ చేసిన వివరాలు, ఈ యాప్ ట్రాక్ చేసిన వివరాలు అన్నీ మీ గూగుల్ అకౌంట్ కి పంపుతుంది కాబట్టి మీ ఫిట్ నెస్ ని మెయిన్ టెయిన్ చేయడం చాలా సులభంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి.
పొట్ట దగ్గర కొవ్వు మటుమాయం కావాలా?? అయితే ఈ ఆహారం తినాల్సిందే..!
తొడలు లావుగా ఉన్నాయా? ఇలా చేస్తే సన్నగా కనిపిస్తారు..!
ఈసారి ఎవరైనా బరువు పెరిగావని చెబితే.. వారికి ధీటుగా బదులివ్వండిలా..!