ప్రతి అమ్మాయి తనకి తాను ఎంతో ప్రత్యేకం. సన్నగా ఉన్నా.. లేక లావుగా (Fat) ఉన్నా.. ప్రతిఒక్కరూ అందంగానే ఉంటారు. అందుకే ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. మనం దేవుడు సృష్టించిన ఒక అద్భుతం. అందుకే ఎవరు మనల్ని ఇష్టపడినా.. లేకపోయినా.. మనల్ని మనం ప్రేమించుకోవాలి. అంతేకాదు.. మీరంటే ఏంటో చెప్పేది మీ వ్యక్తిత్వం, మీ ఆలోచనలే కానీ మీ బరువు (weight) మాత్రం కాదని తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే జీవితమంటే కేవలం లావు, సన్నం మాత్రమే కాదు.. మీరెలా ఉన్నా మంచిదే.. కానీ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
కానీ మనం ఎంత మంచివాళ్లమైనా సరే.. కొంతమంది మన లుక్స్‌ని బట్టి మాత్రమే మనల్ని జడ్జ్ చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితిని తట్టుకోవడం ఎవరికైనా కాస్త ఇబ్బందే. కానీ అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొని మీపై కామెంట్లు చేసే వారికి తిరిగి నోరుమూయించే సమాధానం చెప్పడం చాలా అవసరం. మిమ్మల్ని మీరు ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఇలా కామెంట్లు చేసే వారికి సమాధానం ఇచ్చేందుకు ఈ డైలాగ్స్‌ని ఓసారి పరిశీలించండి.
సమాధానం - అవును. మా అమ్మానాన్న నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అందుకే నీతో డేటింగ్ చేయాలనుకోవట్లేదు. ( మీ బరువు గురించి కామెంట్ చేసే వ్యక్తితో అస్సలు డేటింగ్ చేయకండి.)
సమాధానం - ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలో నాకు తెలుసు. అవి చేస్తున్నా కూడా... నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో మాత్రం చూసుకోవాల్సిన బాధ్యత నీదే.
సమాధానం - అవును. పెరిగిపోయాను. నువ్వు పెరగడానికి నన్ను అడుగుతున్నావా? లేక నేను పెరిగిపోవడం వల్ల నీకు ఏమైనా ఇబ్బంది ఎదురైందా?
సమాధానం - అవును. బాగుంది కదా.. నీలాంటి జీనియస్‌లు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటారు.
సమాధానం - నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సులువుగా బరువు తగ్గగలను. కానీ నువ్వు నీ నోరును ఎప్పుడు అదుపులో ఉంచుకుంటావు?
సమాధానం - అవును. బరువుతో పాటు బుర్ర కూడా పెంచుకున్నా.. నీకు తక్కువగా ఉంది.. కదా కాస్త అప్పుగా ఇవ్వమంటావా?
సమాధానం - ఇది నేను దాచిపెట్టుకునే నా ఎనర్జీ. ఏవైనా విపత్తులు ఎదురైప్పుడు ఉపయోగించేందుకు నేను దాన్ని దాచిపెట్టుకుంటున్నా.
సమాధానం - ఓహ్.. అవునా.. నాకస్సలు తెలీదు తెలుసా. ఎందుకో నా కంటిచూపుకి ఏదో సమస్య ఎదురైనట్లుంది. నాకు నా బరువు అస్సలు కనిపించట్లేదు.
సమాధానం - మరి నువ్వెందుకు నన్ను నీపై కూర్చునేందుకు రెచ్చగొడుతున్నావు?
సమాధానం - ఇది నా సమ్మర్ బాడీ.. నేను సంవత్సరమంతా దీనికోసం ప్రయత్నిస్తున్నా. నీకేమైనా సమస్యా?
సమాధానం - అవునా.. చాలా గొప్ప విషయం కనిపెట్టావు. నాసాలో ఎప్పుడు చేరుతున్నావు?
సమాధానం - అవును. కానీ ఇప్పుడు నీ మాటలతో నేను ఎదుర్కొంటున్న సమస్య కంటే అవి చాలా తక్కువే..!
ఇవి కూడా చదవండి.
అమ్మాయిలూ.. వీటి గురించి అసలు బాధ పడాల్సిన అవసరమే లేదు..!
ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగాలంటే.. ఇలా ప్రయత్నించి చూడండి.. !
సానియా మీర్జా 4 నెలల్లో 22 కేజీల బరువు తగ్గింది.. ఎలాగో తెలుసా..?
Images : Shutterstock.