ADVERTISEMENT
home / Bath & Body
రోజూ సంగీతం వింటే చాలు.. ఆరోగ్యం మీ సొంతం

రోజూ సంగీతం వింటే చాలు.. ఆరోగ్యం మీ సొంతం

సంగీతం(Music).. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. మనల్ని మార్చే మంత్రం. ఎంత బాధలో ఉన్నా సరే.. ఓ జోష్ ఫుల్ పాట (song) వింటే మూడ్ మారిపోతుంది. నచ్చిన పాట మనకి పాత జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేస్తుంది. అదీ సంగీతం స్పెషాలిటీ. మనిషికి పుట్టుకతోనే సంగీతానికి, కఠోరమైన శబ్దాలకు తేడా తెలుసుకోవడం వస్తుందట. ఫాస్ట్ మ్యూజిక్ మన గుండె వేగాన్ని పెంచి, రక్తపోటు పెరిగేలా చేస్తే సున్నితమైన సాఫ్ట్ మ్యూజిక్ రక్తపోటును తగ్గిస్తుందట.

ఇదంతా ఎందుకు అంటారా? సంగీతం వింటున్నప్పుడు మన మెదడు డోపమైన్ అనే కెమికల్‌ని విడుదల చేస్తుందట. అందుకే సంగీతం మన మూడ్‌ని బాగుచేస్తుంది. అందుకే మనసు బాగాలేనప్పుడు కాస్త మంచి సంగీతం వినడం వల్ల ప్రశాంతంగా ఫీలయ్యే వీలుంటుంది. సంగీతం మూడ్‌ని కంట్రోల్ చేయడంతో పాటు.. మన ఆరోగ్యం (Health) కూడా కాపాడుతుందట. ఈ క్రమంలో మనం కూడా సంగీతం వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయో తెలుసుకుందాం..

ఈ కథనం కూడా చదవండి: జుంబా డ్యాన్స్ అందించే ప్రయోజనాలు తెలిస్తే.. ‘జుంబారే జుంజుంబారే’ అనేస్తారు !

ADVERTISEMENT

Shutterstock

1. మూడ్ మారుస్తుంది

మన మూడ్ ఎంత బాగాలేకపోయినా.. ఎంత చికాకుగా అనిపించినా సరే.. ఓ పది నిమషాల పాటు నచ్చిన పాటలు వినడం వల్ల స్వాంతన పొందుతాం. మన భావోద్వేగాలు రెగ్యులేట్ చేయడంలో సంగీతానిది చాలా ముఖ్యమైన పాత్ర. అందుకే రోజూ సంగీతం వినడం ద్వారా మన మనసుకు, శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది.

2. ఒత్తిడి తగ్గిస్తుంది.

ADVERTISEMENT

మంచి మంద్ర స్థాయి సంగీతం వినడం వల్ల మనకు ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ ఉపశమనాన్ని పొందడానికి పాటలు లేకుండా కేవలం వాద్య సంగీతం మాత్రం వినాల్సి ఉంటుంది. కేవలం ఆరోగ్యంగా ఉన్నవారికే కాదు.. అనారోగ్యంతో బాధపడుతున్నవారికీ ఇది పనిచేస్తుంది. క్యాన్సర్‌తో బాధపడేవారు ఓ వైపు చికిత్స చేయించుకుంటూనే.. సంగీతం కూడా వింటే ఎంతో ఉపశమనాన్ని పొందుతారు. అలాగే వేగంగా కోలుకొనే అవకాశం కూడా ఉందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. 

ఈ కథనం కూడా చదవండి: ఇలా చేస్తే జిమ్ అవ‌స‌రం లేకుండానే.. బ‌రువు త‌గ్గొచ్చు..

Shutterstock

ADVERTISEMENT

3. మానసిక వ్యాధుల చికిత్సలో..

సంగీతం కేవలం మానసికంగా మనకు స్వాంతన కలిగించడం మాత్రమే కాదు.. ఎన్నో మానసిక వ్యాధుల చికిత్సలో కూడా ఉపయోగపడుతుంది. అల్జీమర్స్ సమస్య ఉన్నవారు సంగీతం వింటే.. మతిమరుపును అధిగమించవచ్చు. ఆటిజంతో బాధపడుతున్న వారు సంగీతం వింటే వారి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. సంగీతం వినడం వల్ల ఒకే విషయంపై శ్రద్ధ పెట్టడం, అందరితో కలవడం వంటి విషయాల్లో వారి శైలి మెరుగుపడిందని పరిశోధనల్లో తేలింది. సంగీతం డిప్రెషన్, ఆత్రుత, కోపం, భయం వంటి వాటిని కూడా తగ్గించి మనసుకు ఆహ్లాదాన్ని పంచుతుంది.

4. నొప్పిని తగ్గిస్తుంది.

సంగీతం నొప్పిని కూడా తగ్గిస్తుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. వివిధ రకాల సర్జరీలు చేయించుకున్నవారు సంగీతంతో ఉపశమనాన్ని పొందవచ్చట. అందుకే కొందరికి సర్జరీ సమయంలో, ఆ తర్వాత కూడా డాక్టర్లు మంచి సంగీతం వినమని చెబుతారు. ఎందుకంటే పెయిన్ కంట్రోల్‌కి సంగీతాన్ని మించిన ఔషధం లేదు. గాయాల పాలైనప్పుడు రోజూ సంగీతం వినడం వల్ల నొప్పి నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అలాగే గాయాలు కూడా వేగంగా మానే అవకాశం ఉంది. 

ADVERTISEMENT

ఈ కథనం కూడా చదవండి: ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెరగాలంటే.. ఇలా ప్ర‌య‌త్నించి చూడండి.. !

Shutterstock

5. వ్యాయామ ఫలితం పెంచుతుంది..

ADVERTISEMENT

వ్యాయామం చేసేటప్పుడు సంగీతం వింటే.. మనలో మరింత ఉత్సాహం పెరుగుతుంది. బరువు తగ్గాలని భావించే వారు సంగీతం వింటూ వ్యాయామం చేస్తే.. ఫలితాలు బాగుంటాయట. అలాగే మనం మానసికంగా, శారీరకంగా కూడా ఉల్లాసంగా ఉండచ్చు. బరువులు ఎత్తుతూ వ్యాయామం చేసేవారు.. సంగీతాన్ని వింటూ ఎక్సర్‌సైజులు చేయడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందుతారట.

6. పిల్లల్లోనూ ఎంతో మేలు

సంగీతం కేవలం పెద్దవారికే కాదు.. పిల్లల మెదడు ఎదుగుదలకు కూడా తోడ్పడుతుందట. పాటలు, జోల పాటలు, రైమ్స్ వంటివి పిల్లల్లో మెదడు ఎదుగుదలకు తోడ్పడతాయట. సాధారణంగా పాటలు వింటూ పెరిగే  పిల్లలు.. మిగతావారితో పోల్చితే మరిన్ని తెలివితేటలు కలిగుంటారని వైద్యులు చెబుతున్నారు. మహిళలు గర్భంతో ఉన్నప్పుడు..  మంద్ర సంగీతం వినడం వల్ల వారి కడుపులోని బిడ్డ కదలికల్లో మార్పు వస్తుందట. అలాగే ఆయా బిడ్డ ఐక్యూ స్థాయులు కూడా పెరుగుతాయట. నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లోనూ ఆరోగ్యం మెరుగయ్యేందుకు.. సంగీతం చాలా సాయపడుతుందట. అందుకే వీలున్నప్పుడల్లా మీరు సంగీతం వినడంతో పాటు మీ పిల్లలకు కూడా వినిపించండి.

13 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT