ADVERTISEMENT
home / Health
ఇలా చేస్తే జిమ్ అవ‌స‌రం లేకుండానే.. బ‌రువు త‌గ్గొచ్చు..

ఇలా చేస్తే జిమ్ అవ‌స‌రం లేకుండానే.. బ‌రువు త‌గ్గొచ్చు..

ప్ర‌స్తుతం కాలం మారిపోయింది. అంతా బిజీబిజీగా మారిపోయారు. ప‌ని, హాబీలు, భ‌ర్త‌, పిల్ల‌లు, స్నేహితులు.. ఇలా మ‌నం స‌మ‌యం కేటాయించాల్సిన అంశాలు, అవ‌స‌రాలు ఎన్నో.. ఎన్నెన్నో.. ఈ బిజీ లైఫ్‌( Busy lifestyle) లో రోజూ జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేసే స‌మ‌యం చాలామందికి ఉండ‌దు.

మ‌రి, ఎప్పుడూ ఇలాగే ఉండిపోవాలా? కాస్త బ‌రువు త‌గ్గి (loose weight) స‌న్న‌గా మార‌డం ఎలా? చాలామంది ఇదే ఆలోచిస్తూ ఉంటారు. బ‌రువు త‌గ్గాల‌ని చాలామంది భావిస్తారు.. కానీ దానికి జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేసే స‌మ‌యం మాత్రం ఉండ‌దు. ఇలాంట‌ప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నారా? అయితే మీరు చాలా ల‌క్కీ.. ఈ కింద అంశాలు చ‌దివి వాటిని ఫాలో అయిపోతే చాలు.. జిమ్‌కి వెళ్ల‌కుండానే(without going to gym) బ‌రువు త‌గ్గిపోవ‌చ్చు. మ‌రి, అవేంటో చూసేద్దాం రండి..

1. ఇంటిప‌నులు చేయండి..

ఇంటి ప‌నుల‌న్నీ ప‌నిమ‌నిషికి అప్ప‌గించి మీరు చ‌క్క‌గా సోఫాలో కూర్చొని టీవీ చూస్తే బ‌రువు త‌గ్గిపోరు. అందుకు కాస్త ఒళ్లు వంచాల్సి ఉంటుంది. దీనికి మీ ప‌నిమ‌నిషిని పూర్తిగా మాన్పించాల్సిన అవ‌స‌ర‌మేమీ లేదండోయ్‌..! మీకు దొరికిన కాస్త ఖాళీ స‌మ‌యంలో మీరు చేయ‌గ‌లిగే ప‌నులు ఎంచుకొని వాటిని పూర్తిచేస్తే సరిపోతుంది. మిగిలిన ప‌నుల‌ను ప‌నిమ‌నిషికి అప్ప‌గించండి. ఉదాహ‌ర‌ణ‌కు మీ ఇంటిని మీరే తుడిచి శుభ్రం చేసుకోవ‌డం వంటివి చేయండి. దీనివ‌ల్ల మీ క్యాల‌రీలు క‌ర‌గ‌డ‌మే కాదు.. మీ ఇంటిని మీరే శుభ్రంగా ఉంచుకుంటున్నార‌నే సంతృప్తి కూడా సొంత‌మ‌వుతుంది.

slim1

2. చిన్న చిన్న వ్యాయామాలు

కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు చేయ‌డానికి మీరు జిమ్ దాకా వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. దీనికి పెద్ద‌గా స‌మ‌యం కూడా అవ‌స‌రం ఉండ‌దు. క్రంచెస్‌, పుష‌ప్స్‌, లెగ్‌ లిఫ్ట్స్‌, స్కిప్పింగ్‌, మెట్లు ఎక్క‌డం వంటి వ్యాయామాలు చేయ‌డం వ‌ల్ల మీరు యాక్టివ్‌గా ఉండ‌డంతో పాటు బ‌రువు కూడా త‌గ్గించుకోవ‌చ్చు. ఇవి అన్నీ ఒకేసారి చేయాల‌నేమీ లేదు. ఖాళీ ఉన్న‌ప్పుడ‌ల్లా ఓ ఐదు నిమిషాలు ఈ వ్యాయామం చేయండి. ఒక అర‌గంట పాటు వ్యాయామానికి స‌మ‌యం కేటాయించ‌గ‌లిగితే చాలు. యోగా లేదా జాగింగ్ లాంటివి కూడా ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.

ADVERTISEMENT

3. డ్యాన్స్ చేయండి.

ఖాళీ దొరికితే చాలు.. టీవీ చూస్తూ సోఫాకి అతుక్కుపోవ‌డం కాదు.. అదే టీవీ చూస్తూనో లేక మ్యూజిక్ సిస్ట‌మ్‌లో పాట‌లు పెట్టుకునో డ్యాన్స్ చేయ‌డం వ‌ల్ల అటు క్యాల‌రీలు క‌ర‌గ‌డంతో పాటు ఇటు మీ ఒత్తిడి కూడా త‌గ్గుతుంది. రోజూ క‌నీసం పావుగంట పాటు మంచి సంగీతం వింటే డిప్రెష‌న్ కూడా దూర‌మ‌వుతుంద‌ట‌. ఆ పాట‌లు వింటూ డ్యాన్స్ చేయ‌డం వ‌ల్ల మీ మెట‌బాలిజం మ‌రింత వేగ‌వంతం అవుతుంది. ఇలా న‌వ్వుతూ, తుళ్లుతూ నృత్యం చేయ‌డం వ‌ల్ల తెలియ‌కుండానే కొవ్వు కరిగిపోతుంది.

slim2

4. త‌క్కువ‌గా తినండి.

బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్న‌ర్ అంటూ రోజూ మూడు మీల్స్‌ని తినాల‌ని పెద్ద‌లు చెప్పారంటే దానికో కార‌ణం ఉంటుంద‌ని గుర్తుంచుకోండి. వీటి మ‌ధ్య‌లో మీరు మ‌ళ్లీ ఏదైనా హెవీగా తింటే కొవ్వు పేరుకుపోతుంది. అయితే మీరు ఆరు చిన్న చిన్న మీల్స్ తినే డైట్‌లో ఉంటే త‌క్కువ మోతాదులో తిన‌డం అల‌వాటు చేసుకోవాలి. అంతేకాదు.. మీరు తినే వ‌స్తువుల్లోనూ ఆయిలీ ఫుడ్ కాకుండా ఆరోగ్య‌క‌ర‌మైనవి ఎంచుకుంటే మంచిది. మంచి డైట్ అంటే అందులో కూర‌గాయ‌లు, పండ్లు, ప‌నీర్ వంటి ప్రొటీన్ ఎక్కువ‌గా ఉన్న ఆహారంతో పాటు పెరుగు వంటి ప్రొబ‌యోటిక్స్ ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి.

5. డిన్న‌ర్ త్వ‌ర‌గా చేయండి.

చాలామంది రాత్రిపూట భోజ‌నం చేయ‌డానికి ఆల‌స్యం చేస్తూ ఉంటారు. రోజులో ఇదొక్క పూటే హ‌డావిడి లేకుండా ప్ర‌శాంతంగా తినాల‌ని.. న‌చ్చిన‌వ‌న్నీ తినేందుకు కూడా ఆస‌క్తి చూపిస్తుంటారు. అయితే ఇలా చేయ‌డం వ‌ల్ల మీరు తిన్న ఆహారం పడుకోక‌ముందే అరిగి దాన్ని శ‌క్తిగా మార్చుకునేందుకు శ‌రీరానికి ఏమాత్రం స‌మ‌యం ఉండ‌దు. దీనివ‌ల్ల రాత్రి తిన్న భోజ‌నం ద్వారా వ‌చ్చే శ‌క్తిని శ‌రీరం కొవ్వుగా దాచి ఉంచుతుంది. అందుకే రాత్రి నిద్ర‌పోవ‌డానికి క‌నీసం మూడు నాలుగు గంటల ముందే ఆహారం తీసుకునే ప్ర‌య‌త్నం చేయండి. దీనివ‌ల్ల ఆహారం స‌రిగ్గా అరిగిపోవ‌డంతో పాటు క్యాల‌రీలు కూడా క‌రిగే అవ‌కాశం ఉంటుంది.

slim3

6. చిన్న‌దూరాల‌కు న‌డ‌క మంచిది..

ఇంటి ద‌గ్గ‌ర ఉన్న‌ప్పుడు చిన్న చిన్న ప‌నుల‌కు కూడా వాహనాలు ఉప‌యోగించ‌డానికి బ‌దులుగా న‌డ‌వ‌డం మంచిది. ఉదాహ‌ర‌ణ‌కు పాలు లేదా ఏవైనా స‌రుకులు తీసుకురావ‌డానికి, షాపుకి వెళ్ల‌డానికి, న‌డ‌వ‌డం వ‌ల్ల కొన్ని క్యాల‌రీలు కూడా క‌రుగుతాయి. మీకు ముందు కాస్త ఇబ్బందిగా అనిపించ‌వ‌చ్చు. వాహ‌నం ఉప‌యోగించాల‌ని కూడా అనిపించ‌వ‌చ్చు. కానీ న‌డ‌క మీ శ‌రీరానికి ఆరోగ్యాన్ని అందించ‌డంతో పాటు మీ బ‌రువు కూడా త‌గ్గిస్తుంది. మీకు సైకిల్ తొక్క‌డం అంటే ఇష్ట‌మైతే.. దాన్ని కూడా ఉప‌యోగించ‌వచ్చు.

ADVERTISEMENT

7. ఫాస్ట్‌ఫుడ్‌కి దూరంగా ఉండండి.

క‌ప్‌కేక్‌లు, చాక్లెట్లు, బిస్క‌ట్లు.. ఇలా న‌చ్చిన ఆహారం తినాల‌నే ఆశ ఎవ‌రికైనా ఉంటుంది. అవి నోటికి చాలా రుచిగా అనిపిస్తాయి కూడా. కానీ వీటిని త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల ఆరోగ్యం పాడ‌య్యే అవ‌కాశం ఉంటుంది. చ‌క్కెర ఎక్కువ‌గా ఉన్న ప‌దార్థాలు, ఫాస్ట్‌ఫుడ్ వంటివి అప్పుడ‌ప్పుడూ తింటే ఫ‌ర్వాలేదు. కానీ ఎప్పుడూ వాటిని తిన‌డం మంచిది కాదు. మూడ్ బాగోలేన‌ప్పుడు మంచి ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకుంటే మంచిది.

slim4

8. పండ్లు ఎక్కువ‌గా తీసుకోండి.

పండ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో ప్ర‌ధానం అని అంద‌రికీ తెలుసు. అవి మంచి ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారంగా ఉప‌యోగ‌ప‌డ‌డంతో పాటు జీవ‌క్రియ‌ల‌ను వేగ‌వంతం చేస్తాయి. అంతేకాదు.. చ‌ర్మం రంగు, ఆరోగ్యాన్ని కూడా కాపాడ‌తాయి. వీటిలో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ కూడా ఎక్కువ‌గా ల‌భిస్తాయి. కేవ‌లం స‌లాడ్ల‌లో ఉప‌యోగించ‌డం మాత్ర‌మే కాకుండా పెరుగుతో పాటు మంచి స్వీట్‌గా కూడా ప‌నిచేస్తాయి. అందుకే ఎప్పుడైనా స్వీట్ తినాల‌నే కోరిక ఉంటే వీటిని తీసుకోవ‌డం మంచిది.

9. మిమ్మ‌ల్ని మీరు బిజీగా ఉంచుకోండి..

వారం మొత్తం క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తాం.. కాబ‌ట్టి వారాంతంలో కాస్త రెస్ట్ తీసుకుంటాం అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ వారాంతాల్లో అలా సోఫాలో కూర్చొని టీవీ చూసే బ‌దులు ఏవైనా మంచి ఆట‌లు ఆడుతూ ఉండ‌డం మంచిది. ఇలాంటివి చేయ‌లేక‌పోతే క‌నీసం బ‌య‌ట‌కు వెళ్లి స్నేహితులు, బంధువుల‌ను క‌ల‌వ‌డం వంటివి చేయండి. లేదంటే క‌నీసం వారంద‌రితో ఫోన్ మాట్లాడుతూ న‌డ‌వ‌డం కూడా మంచిదే. బిజీగా ఉండ‌మ‌న్నాం కదా అని ప‌గ‌లంతా ప‌డుకొని.. రాత్రి పార్టీల‌కు వెళ్ల‌డం కూడా స‌రికాదు. దీనివ‌ల్ల మీ ఆరోగ్యం మ‌రింత పాడ‌వుతుంది.

slim5

10. లక్ష్యం నిర్ణ‌యించుకోండి.

లక్ష్యం లేకుండా మ‌నం ఏదీ సాధించ‌లేం. అందుకే బ‌రువు త‌గ్గే విష‌యంలోనూ ఫ‌లానా స‌మ‌యంలో ఇంత బ‌రువు త‌గ్గాలి అని ఓ లక్ష్యం పెట్టుకొని.. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నం మొద‌లుపెట్టండి. అయితే పూర్తిగా పెద్ద ల‌క్ష్యాల‌ను పెట్టుకోవ‌డంతో పాటు వాటిని చిన్న చిన్న వాటిగా విడ‌దీసుకోవ‌డం కూడా మంచిది. మీరు ఒక ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్న త‌ర్వాత దాన్ని చేరుకోవ‌డంలో మీరు అందుకున్న అడుగుల‌ను గుర్తించి వాటిని కూడా నోట్ చేసుకోవ‌డం మర్చిపోవ‌ద్దు. ఇంకా మీరు చేరుకోవాల్సిన ల‌క్ష్యాల కోసం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకునేందుకు ఇవి బాగా తోడ్ప‌డ‌తాయి.

ADVERTISEMENT

ఇవి కూడా చ‌ద‌వండి.

హార్మోన్లు మీ బ‌రువును పెంచేస్తున్నాయా? ఇలా చేసి చూడండి..

యోగా గురించి ఈ అపోహ‌లు మీకూ ఉన్నాయా?

30 రోజుల పాటు షుగర్‌కి దూరంగా ఉంటే.. ఏం జరుగుతుందో తెలుసా?

ADVERTISEMENT
29 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT