ADVERTISEMENT
home / Dating
మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నాడా..? ఈ విషయాన్ని తెలుసుకోవడం ఎలా..?

మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నాడా..? ఈ విషయాన్ని తెలుసుకోవడం ఎలా..?

“వివాహం” అనేది ఇద్దరు వ్యక్తులను జీవితాంతం కలిపి ఉంచే బంధం. అయితే ఈ బంధంలో అన్నింటికంటే ఎక్కువ బాధను కలిగించేది భాగస్వామి (partner) తాను వివాహమాడిన వ్యక్తిని మోసం చేసి.. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే. అందుకేనేమో..పెళ్లికి ముందు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు చెప్పేవారని అనిపిస్తుంది. 

అయితే ఆ ఒక్క విషయాన్ని బట్టి.. ఒక వ్యక్తి తన భాగస్వామిని జీవితాంతం ఆనందంగా చూసుకోగలడా? లేదా తనకు తెలియకుండా వేరొక వ్యక్తితో అనైతికంగా సంబంధాన్ని పెట్టుకుంటాడా? అన్నది మాత్రం ఎవరూ చెప్పలేరు. ఈ క్రమంలో అసలు ఇలాంటి సంబంధాలు పెట్టుకొనేవారు, భాగస్వామిని మోసం చేసేవారిలో ఉండే ఓ లక్షణాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు.

బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సైకాలజీలో ప్రచురితమైన ఓ కథనం ప్రకారం తరచూ ఆవేశానికి లోనయ్యేవారు.. ఉద్రేకంలో నిర్ణయాలు తీసుకునేవారు తమ భాగస్వామిని మోసం చేసే అవకాశం ఉందట.  అలాగే వీరు తమ భాగస్వామికి తెలియకుండా ఇతరులతో సంబంధాన్ని కొనసాగించే అవకాశం కూడా లేకపోలేదట . దీనికి గల కారణాలను కూడా విశ్లేషించి చెప్పారు శాస్త్రవేత్తలు. 

ADVERTISEMENT

Shutterstock

ఉద్రేకంలో నిర్ణయాలు తీసుకునేవారు మోసం చేసేముందు.. దాని గురించి అస్సలు ఆలోచించరట. కేవలం దాని గురించి మాత్రమే కాదు.. తమ పరిస్థితి గురించి కూడా ఏమాత్రం ఆలోచన లేకుండా అక్రమ సంబంధం వైపు అడుగులు వేస్తారట.

ఈ యువకుడు అమ్మ కు రెండో పెళ్లి చేశాడు.. ఎందుకో తెలుసా..?

ADVERTISEMENT

Shutterstock

అంతేకాదు.. ఈ పరిశోధనలో మరో విషయాన్ని కూడా వెల్లడించారు శాస్త్రవేత్తలు. పెళ్లికి ముందు ఎక్కువమందితో లైంగిక సంబంధాలు కలిగినవారు.. పెళ్లి తర్వాత కూడా తమ భాగస్వామిని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఎందుకంటే.. ఇలా ఎక్కువమందితో సెక్స్‌లో పాల్గొనేవారికే మాత్రమే.. ఇలాంటి ఎఫైర్స్‌లో ఉండే లోటుపాట్ల గురించి బాగా తెలుస్తుంది. అలాగే అవతలి వారిని ఎలా ఆకర్షించాలి? అని కూడా పదే పదే ఆలోచిస్తారు. కాబట్టి.. వారు పెళ్లయ్యాక కూడా ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువట.

భాగస్వామి ఫోన్ మనం చెక్ చేయడం.. సరైన పనేనా?

ఈ అధ్యయనంలో.. అవతలివారు ఎందుకు తమ భాగస్వామిని మోసం చేయాలనుకుంటారనే అంశాన్ని కూడా గుర్తించారట. ఒక బంధంలో అవతలి వ్యక్తి నుంచి తాము ఆశించిన ప్రేమ దక్కకపోవడం, వారు దూరంగా ఉన్నారన్న ఫీలింగ్ కలగడంతో పాటు.. రిలేషన్ షిప్‌లో ఆనందం లేకపోవడం వంటివన్నీ.. వేరే వ్యక్తి దగ్గరకు చేరేందుకు అవకాశాన్నిస్తాయట.

ADVERTISEMENT

అంతేకాదు.. ఇలా భాగస్వామిని మోసం చేసేవారిలో మగవారు ఎక్కువగా ఉంటున్నారట. కానీ తమ భాగస్వామి కోసం సమయాన్ని కేటాయించి..  వారితో అన్ని విషయాలు మాట్లాడేవారిలో ఇలాంటి గుణాలు తక్కువగా ఉంటున్నాయట. మొత్తంగా చెప్పాలంటే భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతూ.. వారితో ఆనందంగా ఉండేవారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తక్కువ అని ఈ అధ్యయనంలో తేలింది.

Shutterstock

రిలేషన్ షిప్‌కి సంబంధించి నిపుణులు చెప్పే వివరాల ప్రకారం.. మీ భాగస్వామి మరో వ్యక్తితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తూ.. మీకంటే తన గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటే.. మీ ఇద్దరి మధ్య  దూరం పెరిగిపోతోందని అర్థం. అయితే వేరే వాళ్లతో సంబంధాలు కొనసాగించినా.. వాటిని సాధ్యమైనంత త్వరగా మర్చిపోయి.. భాగస్వామితో జీవితాన్ని కొనసాగించేవారు కూడా చాలామందే ఉంటారట.

ADVERTISEMENT

కానీ తమ భాగస్వామిని లెక్కకు మించి మోసం చేసిన.. వ్యక్తుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలట. వారు ఇలాంటి పనులు చేయడం మానుకోలేరు కాబట్టి.. ఈ ప్రవర్తన కూడా వారి జీవనశైలిలో భాగం కనుక.. అటువంటి వారికి దూరమవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Shutterstock

పెద్దలు కుదిర్చిన పెళ్లే అయినా.. ప్రేమతో అల్లుకున్న బంధం ఈ తారలది..!

ADVERTISEMENT

మరి, మీ భాగస్వామి కూడా ఇలాంటి బంధంలో ఉన్నారా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకోవడానికి కొన్ని సూచనలను ఆధారంగా చేసుకొని పరీక్షించవచ్చు. ఈ లక్షణాలు వారిలో కనిపిస్తే వారు మరో వ్యక్తితో బంధంలో ఉన్నారేమోనని అనుమానించవచ్చు.

1. మీ భాగస్వామి ఇన్నాళ్లూ లేనిది మీ దగ్గర ఏదో దాస్తున్నట్లు అనిపించినా..
2. వారి ఫోన్, లాప్ టాప్‌లతో అనుకున్న సమయం కన్నా ఎక్కువగా గడుపుతున్నా..
3. మీతో సమయం గడిపేందుకు ఆసక్తి చూపించకపోయినా
4. సెక్స్ జీవితంలో మార్పులు (ఇంతకుముందు కంటే తక్కువగా లేదా ఎక్కువగా సెక్స్‌లో పాల్గొనడం)
5. చిన్న చిన్న విషయాలకే మీపై చిరాకు పడుతున్నా..
6. మీ ఇద్దరూ మాట్లాడుకునే సమయం తగ్గిపోయి.. మీరు మాట్లాడినది కూడా తను సరిగ్గా వినకపోతున్నా..
7. వారి స్నేహితులు లేదా మీ ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్‌గా ఉండే స్నేహితులు.. మీతో ఇంతకు ముందులా క్లోజ్‌గా ఉండకపోయినా..

ఈ లక్షణాలుంటే మీ భాగస్వామికి.. మరో వ్యక్తితో సంబంధం ఉందేమోనని అనుమానించాల్సిందే. అయితే ముందు నిజాలు తెలుసుకునే వరకూ.. మీ అనుమానాన్ని తన ముందు వ్యక్తం చేయకపోవడం మంచిది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

16 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT