అల వైకుంఠపురంలో (Ala Vaikunthapurramuloo).. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu arjun), త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ డ్రామా చిత్రం. బన్నీ ఈ సినిమాలో నటిస్తున్నాడనే వార్త వచ్చినప్పటి నుంచి.. ఈ చిత్రం పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అభిమానుల అంచనాలను అందుకునేలా ఉంటుందని చెప్పేలా.. ఈ సినిమా టీజర్ సైతం ఆకట్టుకుంది.
‘గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది’ అంటూ.. తను 2019 లో సినిమా చేయకపోవడానికి గల కారణాన్ని కూడా టీజర్‌తో చెప్పేశాడు బన్నీ. ఆ తర్వాత విడుదలైన ఈ సినిమా పాటలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ‘సామజవరగమనా (Samajavaragamana), రాములో రాములా, ఓ మై గాడ్ డాడీ’ .. ఇలా దేనికవే విభిన్నంగా ఉన్నాయి ఈ సినిమా పాటలు. అంతేకాదు.. విడుదలైన కొన్ని గంటల్లోనే అత్యధిక వ్యూస్ సంపాదించి టాప్ స్థానంలో కూడా నిలిచాయి.
“స్టైల్‌గా ఉంది కదా! నాకు కూడా నచ్చింది – “అల వైకుంఠపురంలో” టీజర్‌లో అల్లు అర్జున్
సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా పాటల ఆడియో.. ఇప్పటికే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. గతంలో దీపావళికి ‘రాములో రాములా’ వీడియో పాటను విడుదల చేసిన ఈ సినిమా యూనిట్.. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా ‘సామజవరగమనా’ వీడియో సాంగ్‌ని విడుదల చేయనుంది. దీనికి సంబంధించి ప్రీ టీజర్‌ని కూడా విడుదల చేసింది సినిమా యూనిట్. 20 సెకన్లు మాత్రమే ఉన్న ఈ వీడియోలో.. అల్లు అర్జున్, పూజా హెగ్డేలు చాలా రొమాంటిక్‌గా కనిపించారు. ప్యారిస్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ పాటలో.. ఈఫిల్ టవర్ అందాలను కూడా చూపించడం విశేషం.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ టీజర్.. ఫ్యాన్స్ అంచనాలని అందుకుంటుందా?
నెల రోజుల క్రితం విడుదలైన ఆడియో వర్షన్ ఎంతగా హిట్ అయిందంటే.. కేవలం రెండు రోజుల్లోనే అందరూ ఈ పాటను ఒకసారి కాదు.. ఎన్నోసార్లు వినడానికి అలవాటు పడిపోయారు. చాలామంది ఫోన్ రింగ్ టోన్లు కూడా సెట్ చేసుకున్నారు. విడుదలైన కొన్ని రోజుల్లోనే వంద మిలియన్ వ్యూస్ సంపాదించింది ఈ పాట. గానాలో దాదాపు ఇరవై మిలియన్లకు పైగా.. ఈ పాటను విన్నారట. తాజాగా ప్రీ టీజర్ విడుదయ్యాక.. 24 గంటలు కూడా గడవక ముందే పది లక్షల వ్యూస్‌ను సాధించింది. ఈ క్రమంలో, భవిష్యత్తులో ఈ పాట వీడియో వర్షన్ ఎలాంటి రికార్డులను కొల్లగొడుతుందో వేచి చూడాల్సిందే.
This New Year won't be regular as you welcome it with Song of the year, #Samajavaragamana ❤
A small teaser on 31st December!! #AlaVaikunthapurramuloo @alluarjun #Trivikram @hegdepooja @MusicThaman pic.twitter.com/d9ogbAjcJH
— Haarika & Hassine Creations (@haarikahassine) December 29, 2019
‘మీ కొత్త సంవత్సరానికి మెలోడియస్ టచ్ ఇస్తూ,, మెలోడీ పాటతో సంవత్సరాన్ని ప్రారంభించండి’ అంటూ సరికొత్త మార్కెటింగ్ టెక్నిక్‌తో ఈ పాటను విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్. ఈ వీడియోలో ప్యారిస్‌లోని అందమైన లొకేషన్లు కనిపిస్తున్నాయి. వైట్ కోట్‌లో పూజ నడుస్తుంటే.. వెనుక రెడ్ కలర్ షర్ట్‌లో బన్నీ చేతులు చాపి నడుస్తున్నట్లుగా చూపించారు. బన్నీ మార్క్ స్టెప్స్ కూడా ఈ టీజర్‌లో కనిపించాయి.
పూజ వెనుక బన్నీ ఫాలో అవుతూ ఫీలవుతున్నట్లుగా.. ఈ రొమాంటిక్ పాట సాగుతుందని ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ పాట ఆడియో వర్షన్‌కి కొన్ని గంటల్లోనే అద్భుతమైన వ్యూస్ రావడంతో.. ఇది ‘సాంగ్ ఆఫ్ ది ఇయర్’గా మారిపోయింది. మరి, 2020 లోకి అడుగుపెట్టే ముందు వచ్చే ఈ పాట వీడియో వర్షన్.. ఆ సంవత్సరపు ‘సాంగ్ ఆఫ్ ద ఇయర్’ గా మారనుందా? లేదా? అన్న విషయం తెలుసుకోవాలంటే.. పాట విడుదలయ్యే వరకూ అంటే కొత్త సంవత్సరం వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.
హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్‌లపై ఎస్ రాధాక్రిష్ణ, అల్లు అరవింద్‌లు ఇద్దరూ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. ఎస్. తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ దేవరాజ్ (బంటు) అనే పాత్రలో, పూజా హెగ్డే నిధి (అమ్ములు) అనే పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు నివేథా పేతురాజ్, సుశాంత్, టబు, రాజేంద్ర ప్రసాద్, నవదీప్‌లు నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 తేదిన విడుదలకు సిద్దమవుతోంది.
మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.