(Telugu Actress Anjali’s interesting statements on the career and films)
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా గుర్తుందా..? ఆ సినిమాలో చక్కని తెలుగింటి అమ్మాయి గెటప్‌లో ఒదిగిపోయి నటించింది అంజలి. ఆ ఒక్క సినిమా హిట్‌తో అప్పట్లో తెలుగులో వరుసగా సినిమాలు చేసే ఆఫర్లను కూడా దక్కించుకుంది ఆమె. తెలుగమ్మాయి అయినా అంజలి తొలి హిట్ ఓ తమిళ సినిమాతోనే లభించడం గమనార్హం. షాపింగ్ మాల్, జర్నీ లాంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టాయి. ఈ మధ్యకాలంలో తెలుగులో సినిమాలు చేయడం తగ్గించిన అంజలి.. ఇటీవలే ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రామ్‌లో తన ఆలోచనలను పంచుకుంది.
జబర్దస్త్ యాంకర్ ‘రష్మీ’ హీరోయిన్‌గా.. కొత్త చిత్రం..!
“నేను పుట్టింది నర్సాపూర్. పెరిగింది రాజోలులో. కానీ ప్రస్తుతం ఉంటుంది మాత్రం చెన్నై. చిత్రమేంటంటే.. నేను స్కూలింగ్ పూర్తి అవ్వగానే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాను. ఆ తర్వాత తెలుగులో ఓ రెండు చిన్న సినిమాలలో నటించాను. కానీ అంత పేరు రాలేదు. అలాంటప్పుడు తమిళంలో నాకు తొలి అవకాశం వచ్చింది. అది కూడా చాలా చిత్రంగా జరిగింది. నా మొదటి తమిళ సినిమా ‘కాట్రాదు తమిళ్’. ఆ సినిమా ఆఫీస్ మా ఇంటికి దగ్గరలోనే ఉండేది. ఆ సినిమా దర్శకుడు ఓసారి నేను వీధిలో నడిచివెళ్తుంటే చూశారట. ఆ సినిమాలో పాత్ర ఓ మధ్య తరగతి అమ్మాయికి సంబంధించింది. అందుకే చాలా నేచురల్‌గా ఉండాలని భావించారట. నన్ను చూడగనే ఆడిషన్స్‌కి రమ్మన్నారు. ఆడిషన్స్ పూర్తయ్యాక.. హీరోయిన్ రోల్ ఆఫర్ చేస్తామన్నాను. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను” అని తన గతానుభవాలను పంచుకుంది అంజలి.
మన అభి’నయన’తార నటించిన.. టాప్ 5 మేటి చిత్రాలు ఇవే..!
అంజలి నటించిన తమిళ సినిమాలలో ఆమె బాగా పేరుతెచ్చిపెట్టిన మరో సినిమా ‘అంగడి తెరు’. ఇదే చిత్రం తెలుగులో ‘షాపింగ్ మాల్’ పేరుతో డబ్ చేయబడింది. ఈ సినిమాకి సంబంధించి కూడా ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది అంజలి. “ఆ సినిమా షూటింగ్ చాలా చిత్రంగా జరిగింది. మాకు తెలియకుండానే సీక్రెట్ కెమెరాలు పెట్టి షూట్ చేశారు. రంగనాథ స్ట్రీట్ అనేది షూటింగ్ స్పాట్. అక్కడ చాలా షాపులుండేవి. రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉండేది. అలాంటి ప్రదేశంలో నన్ను ఒంటరిగా వదిలేసి.. వస్తువులు అమ్మమని చెప్పారు. నేను డైరెక్టర్ చెప్పినట్లే చేశాను. కానీ నన్ను జనాలెవ్వరూ గుర్తుపట్టలేదు. కొత్త నటిని కావడం వల్ల నేను వారికి పెద్దగా తెలియదు. ఓ సాధారణ సేల్స్ గర్ల్‌గానే భావించి.. నా వద్దకు వచ్చి వస్తువులు కొనుక్కొని వెళ్లారు. అది ఓ మరిచిపోలేని అనుభవం” అని తెలిపింది అంజలి.
సినిమా కోసం.. శాకాహారిగా మారిపోయా : నయనతార
ప్రస్తుతం అంజలి తెలుగులో గీతాంజలి 2, నిశ్శబ్దం, ఆనందభైరవి మొదలైన చిత్రాలలో నటిస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ సరసన ‘పింక్’ రీమేక్‌లో కూడా నటిస్తోంది. 2014లో ‘గీతాంజలి’ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం అందుకున్న అంజలి.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు’ సినిమాకు అదే నంది అవార్డుల కమిటి నుండి ఉత్తమ నటిగా స్పెషల్ జ్యూరీ విభాగంలో అవార్డును కైవసం చేసుకుంది. అలాగే తాను నటించిన తొలి తమిళ సినిమాకే ఉత్తమ నటిగా ఆమె ఫిల్మ్‌ఫేర్‌ను కైవసం చేసుకుంది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.