కాలేజీ అమ్మాయిలూ.. ఈ 10 రకాల పర్ఫ్యూమ్స్ మీకోసమే..

కాలేజీ అమ్మాయిలూ.. ఈ 10 రకాల పర్ఫ్యూమ్స్ మీకోసమే..

మీరు కాలేజీ అమ్మాయా? తక్కువ ఖర్చులో మంచి పరిమళాన్ని వెదజల్లే పర్ఫ్యూమ్ (Perfumes) కోసం వెతుకుతున్నారా? మాకు తెలుసండి. అందుకే మీ కోసం మీ పాకెట్ మనీతో కొనగలిగే మంచి బ్రాండెడ్ పర్ఫ్యూమ్ లను వెతికి మరీ మీ ముందుకు తీసుకొచ్చాం. వాటిలో మీకు నచ్చిన, మీకు నప్పే వాటిని ఎంచుకోండి.


1. ఐసెంట్స్ ట్విలైట్ ఈడీపీ


అందమైన ప్యాక్ లో  ఆకట్టుకొనే బాటిల్ లో నిండిన ఈ పర్ఫ్యూమ్ పరిమళాలు మన మనసుని ఆహ్లాదంగా మార్చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా చాలా తక్కువ ఖర్చులోనే మనకు లభిస్తుంది. కాలేజీకి స్ప్రే చేసుకొని వెళ్లడానికి చాలా బాగుంటుంది.


ధర: రూ. 249. 2. ఫ్యాబ్ ఇండియా వైల్ఢ్ రోజ్ పర్ఫ్యూమ్ ఆయిల్


రోజా పూల పరిమళాలు మీకు ఇష్టమా? అయితే మీకు ఫ్యాబ్ ఇండియా వారి వైల్ఢ్ రోజ్ పర్ఫ్యూమ్ ఆయిల్ కచ్చితంగా నచ్చుతుంది. చాలా మైల్డ్ గా అనిపించే దీని సువాసన రోజంతా మిమ్మల్ని మైమరిపిస్తుంది. గులాబీ పరిమళాలు నిండిన దీనిలో బాదం నూనె, గ్రేప్ సీడ్ ఆయిల్, విటమిన్ఇ కూడా ఉన్నాయి.


ధర: 290. 3. ఎస్సెన్స్ క్యాండీ షాప్


చాక్లెట్ పరిమళాలు వెదజల్లాలని మీరు కోరుకొంటున్నారా? అయితే మీకు క్యాండీషాప్ బాగా నప్పుతుంది. అందమైన ఈ బాటిల్ లో వెనీలా, టోంకాబీన్ సువాసనలు నిండి ఉన్నాయి.


ధర: రూ.349. ఇక్కడ కొనండి.4. రూట్స్ అండ్ అబౌవ్ ఆయుర్వేదిక్ ఫ్లోరెట్ డస్ట్


అమ్మాయిలు ఇన్స్టెంట్ గా ఫ్రెష్ గా తయారవ్వాలనుకొంటే ఫ్లోరెట్ డస్ట్ మీ వెంట ఎప్పుడూ ఉండాల్సిందే. పూర్తిగా ఆయుర్వేద ఉత్పత్తులతో తయారైన ఈ పర్ఫ్యూమ్ మీ మూడ్ ని క్షణాల్లో మార్చేస్తుంది.


ధర: రూ. 4005. జారా బ్లూ బెర్రీ


బ్లూ బెర్రీ సువాసనను ఇష్టపడేవారికి జారా బ్లూబెర్రీ ఎవా డు టాయెలెట్టె మంచి ఎంపిక అవుతుంది. పైగా ట్రెండీగా కూడా ఉంటుంది.


ధర: రూ. 490. ఇక్కడ కొనండి.6. వెర్సేస్ 19.69 ఇటాలియా పారాడైస్ పర్ఫ్యూమ్డ్ స్ప్రే


అందమైన ప్యాక్ లో మరింత మధురమైన పరిమళాలను వెదజల్లే ఈ పర్ఫ్యూమ్డ్ స్ప్రే కాలేజ్ అమ్మాయిలందరి దగ్గరా ఉండాల్సిందే. దీని సువాసన రోజంతా నిలిచి ఉండటంతో పాటు అందరి దృష్టిని మన వైపు మరలేలా చేస్తుంది.


ధర: 495. 7. కలర్ మి ఫ్లవర్ ఈడీటీ


ఘాటైన పరిమళాలను ఇష్టపడే వారి అవసరాన్ని తీరుస్తుంది. కలర్ మీ ఫ్లవర్ ఈడీటీ. అందమైన ప్యాక్ లో నిండిన ఈ సుగంధం కాలేజీలో అందరినీ మీకు ఫ్యాన్స్ గా మార్చేస్తుంది.


ధర: 550. ఇక్కడ కొనండి.8. ఎవాన్ సెంట్ ఎస్సెన్స్ రొమాంటిక్ బొకే


ఉదయం నుంచి సాయంత్రం వరకు కాలేజీలోనే సమయం గడపడం వల్ల కొన్నిసార్లు తీవ్రమైన ఒత్తిడికి గురి కావచ్చు. అలాంటి సందర్భాల్లో మీ మూడ్ ని మార్చడానికి మంచి సాధనం ఈ రొమాంటిక్ బొకే ఎస్సెన్స్. ఇది క్షణాల్లో మిమ్మల్ని ఫ్రెష్ గా మార్చేస్తుంది.


ధర: 599. ఇక్కడ కొనండి.9. అడిడాస్ నేచురల్ విటలిటీ ఈడీటీ


అడిడాస్ ఉత్పత్తి చేసిన ఈ సెంట్ నాకు బాగా ఇష్టం. ప్రతి రోజూ ఉపయోగించడానికి ఇది చక్కటి ఎంపిక. రోజంతా చక్కటి పరిమళాన్ని వెదజల్లుతూ  మీ మూడ్ ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.


ధర: 649. ఇక్కడ కొనండి.10. విక్టోరియా సీక్రెట్ లవ్ స్పెల్ బాడీ మిస్ట్


విక్టోరియా సీక్రెట్ ఉత్పత్తులను ఇష్టపడనివారెవరైనా ఉంటారా? దీని ప్యాకేజింగ్ మాత్రమే కాదు.. పరిమళాలు కూడా ఆకర్షించే విధంగానే ఉంటాయి. రోజువారీ ఫ్రాగ్రెన్స్ అవసరాల కోసం ఇది చక్కని ఎంపిక అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


ధర: 692. ఇక్కడ కొనండి.Featured Image: Shutterstock